MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • శ్రీదేవిని తీసేయమని చెప్పిన బాలయ్య.. వీరి కాంబోలో మూవీ రాకపోవడానికి కారణం ఎన్టీఆర్ కాదు, చిరంజీవి ప్రస్తావన

శ్రీదేవిని తీసేయమని చెప్పిన బాలయ్య.. వీరి కాంబోలో మూవీ రాకపోవడానికి కారణం ఎన్టీఆర్ కాదు, చిరంజీవి ప్రస్తావన

శ్రీదేవి అప్పట్లో ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు అందరు అగ్ర హీరోలతో సినిమాలు చేసింది. కానీ బాలయ్యతో మాత్రం ఒక్క మూవీ కూడా చేయలేదు. అందుకు గల కారణం ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Sep 14 2025, 05:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు..
Image Credit : Asianet News

ఎన్టీఆర్ నుంచి వెంకటేష్ వరకు..

ఒకప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమని ఏలిన హీరోయిన్లలో శ్రీదేవి ముందు వరుసలో ఉంటారు. శ్రీదేవిని తెలుగు ప్రేక్షకులు అతిలోక సుందరి అని ముద్దుగా పిలుచుకుంటారు. శ్రీదేవి తెలుగులో అలనాటి ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు లాంటి హీరోలతో పాటు వారి తర్వాతి తరం హీరోలు చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో కూడా హీరోయిన్ గా రొమాన్స్ చేసింది. 

25
బాలయ్యతో ఒక్క మూవీ కూడా లేదు
Image Credit : Asianet News

బాలయ్యతో ఒక్క మూవీ కూడా లేదు

ఇంతమంది అగ్ర హీరోలతో నటించిన శ్రీదేవి.. నందమూరి బాలకృష్ణతో మాత్రం ఒక్క సినిమాలో కూడా నటించలేదు. ఇందు కారణం ఎన్టీఆర్ అని చాలా మంది భావిస్తూ ఉండొచ్చు. ఎన్టీఆర్, శ్రీదేవి లది సూపర్ హిట్ కాంబినేషన్. వేటగాడు, బొబ్బిలి పులి లాంటి చిత్రాల్లో శ్రీదేవి ఎన్టీఆర్ తో రొమాన్స్ చేసింది. తన తండ్రితో నటించిన హీరోయిన్ కాబట్టి బాలయ్య.. శ్రీదేవితో నటించకూడదు అని డిసైడ్ అయినట్లు అంతా భావించారు. కానీ అది నిజం కాదు. 

Related Articles

Related image1
పవన్ కళ్యాణ్ ఆన్ స్క్రీన్ అత్తని ప్రేమించి చివరికి బాలయ్య హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న నటుడు ఎవరు ?
Related image2
మీ చావు మీరు చావండి అని కృష్ణ, శోభన్ బాబుపై మండిపడ్డ ఎన్టీఆర్.. దాన వీర శూర కర్ణ అక్కడ అట్టర్ ఫ్లాప్
35
చిరంజీవి సినిమాలో మాత్రమే..
Image Credit : Social Media

చిరంజీవి సినిమాలో మాత్రమే..

శ్రీదేవితో ఎందుకు నటించలేదో బాలయ్య ఓ ఇంటర్వ్యూలో రివీల్ చేశారు. శ్రీదేవి నా సినిమాలకు సెట్ అవ్వదు. ఆమెతో నటించకూడదని నేను నిర్ణయించుకోలేదు. మా కాంబినేషన్ సెట్ కాకపోవడం అనేది యాదృచ్చికం. చాలా సందర్భాల్లో ఆమె నా సినిమాలకు సరిపోదు అని నాకు అనిపించింది. నాన్నగారి తరం హీరోలతో ఆమె హవా బాగా సాగింది. మా తరానికి వస్తే బ్రదర్ చిరంజీవి నటించిన జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి చిత్రాల్లో మాత్రమే ఆమె పాత్ర పండింది. 

45
నా మాట వినలేదు, మూవీ ఫ్లాప్
Image Credit : google

నా మాట వినలేదు, మూవీ ఫ్లాప్

ఒక హీరో సినిమాలో శ్రీదేవిని తీసుకున్నారు. ఆ చిత్రానికి ఆమె అవసరం లేదు. ఆమెని తీసేసి వేరే వాళ్ళని పెట్టుకోమని ఆ నిర్మాతకి చెప్పాను. అది నా సినిమా కూడా కాదు. వేరే హీరో మూవీ అయినప్పటికీ మంచి సలహా ఇచ్చాను. కానీ వాళ్ళు నా మాట వినలేదు. శ్రీదేవిని హీరోయిన్ గా పెట్టుకున్నారు. ఆ మూవీ కనీసం వారం కూడా ఆడలేదు, డిజాస్టర్ అయింది అని బాలయ్య తెలిపారు. ఆ హీరో ఎవరు  ? ఆ సినిమా ఏంటి ? అనే వివరాలు బాలయ్య చెప్పలేదు. 

55
కథకి ఎవరు కరెక్టో వాళ్లనే తీసుకోమని చెబుతా
Image Credit : youtube print shot/aha unstoppable show

కథకి ఎవరు కరెక్టో వాళ్లనే తీసుకోమని చెబుతా

అదే విధంగా ఒక రీమేక్ సినిమా కోసం టాప్ హీరోయిన్ ని తీసుకున్నారు. అది కూడా నా సినిమా కాదు. ఆ కథకి ఆమె సెట్ కాదు అని చెప్పా. వాళ్ళు కూడా వినలేదు. ఆ సినిమా కూడా ఫ్లాప్ అయింది అని బాలయ్య అన్నారు. తన చిత్రాల్లో ఎక్కువగా సాధారణ హీరోయిన్లే ఉంటారని, కథకి ఎవరు కరెక్టో వాళ్లనే తీసుకోమని చెబుతానని బాలయ్య అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
నందమూరి బాలకృష్ణ
నందమూరి తారక రామారావు
ఏషియానెట్ న్యూస్
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
`కపుల్‌ ఫ్రెండ్లీ`లో దాచినది ఇదే, `నిలవే` మరో కేజీఎఫ్‌.. సతీ లీలావతి రిలీజ్‌ డేట్‌, ఫంకీ, స్వయంభు అప్‌ డేట్స్
Recommended image2
Vijay Deverakonda: ఫారెన్‌ పిల్లతో విజయ్ దేవరకొండ రొమాన్స్, ఫోటోలు లీక్‌.. ఇంతకీ ఎవరీ అమ్మాయి?
Recommended image3
Ileana హీరోయిన్‌ కాకపోతే ఏం చేసేదో తెలుసా? ఇంట్లో ఇష్టంగా చేసే పని ఇదే
Related Stories
Recommended image1
పవన్ కళ్యాణ్ ఆన్ స్క్రీన్ అత్తని ప్రేమించి చివరికి బాలయ్య హీరోయిన్ ని పెళ్లి చేసుకున్న నటుడు ఎవరు ?
Recommended image2
మీ చావు మీరు చావండి అని కృష్ణ, శోభన్ బాబుపై మండిపడ్డ ఎన్టీఆర్.. దాన వీర శూర కర్ణ అక్కడ అట్టర్ ఫ్లాప్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved