MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ మిస్సయినట్లేనా, అఖండ 2 రిలీజ్ వాయిదా ? పవన్ ఓజికి లైన్ క్లియర్

టాలీవుడ్ లో బిగ్గెస్ట్ క్లాష్ మిస్సయినట్లేనా, అఖండ 2 రిలీజ్ వాయిదా ? పవన్ ఓజికి లైన్ క్లియర్

బాలయ్య అఖండ 2, పవన్ ఓజి చిత్రాలు ఒకే రోజు రిలీజ్ కానుండడంతో బిగ్గెస్ట్ క్లాష్ తప్పదని అనుకున్నారు. కానీ తాజాగా అఖండ 2 రిలీజ్ డేట్ విషయంలో ట్విస్ట్ చోటు చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 17 2025, 08:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Image Credit : X/DVV Entertainments, 14 Reels Plus

అఖండ చిత్రం సాధించిన భారీ విజయం తర్వాత బాలయ్య, బోయపాటి ఆ చిత్ర సీక్వెల్ కి శ్రీకారం చుట్టారు. 2021లో విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న అఖండ చిత్రానికి అఖండ 2 సీక్వెల్ గా రూపొందుతోంది. బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటే ఫ్యాన్స్ లో అంచనాలు తారా స్థాయిలో ఉంటాయి. వీరి కాంబోలో వచ్చిన సింహా, లెజెండ్, అఖండ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. 

25
Image Credit : Youtube/14 reels plus

అఖండ 2 రిలీజ్ కి సంబంధించి ఒక ఆసక్తికర ప్రచారం వైరల్ అవుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 25న థియేటర్లలో విడుదల కానుందని చిత్ర బృందం ఇప్పటికే ప్రకటించారు. ఇదే తేదీన పవన్ కళ్యాణ్ నటించిన పాన్ ఇండియా చిత్రం OG కూడా విడుదల కానుంది. అయితే తాజా బజ్ ప్రకారం, అఖండ 2 విడుదల వాయిదా పడే అవకాశం ఉందన్న వార్తలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

Related Articles

Related image1
తుమ్మ మొద్దులా ఉంటాడు, అతడిని చూసి చిరంజీవి మైండ్ బ్లాక్.. మెగాస్టార్ కి ఆదర్శంగా నిలిచిన ఆ నటుడు ఎవరంటే
Related image2
ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీతో ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. అతడు ఇండస్ట్రీకి దొరికిన వరం అంటూ కామెంట్స్
35
Image Credit : Youtube/14 reels plus

విశ్వసనీయ సమాచారం మేరకు, ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇంకా పూర్తికాలేదు అని తెలుస్తోంది. అంతేకాక, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ లాంటి పోస్ట్ ప్రొడక్షన్ పనులకు మరింత సమయం అవసరం అవసరం అవుతోందని సమాచారం. దాంతో చిత్రబృందం రిలీజ్ తేదీని మారుస్తుందన్న ఊహాగానాలు మొదలయ్యాయి.

45
Image Credit : X/DVV Entertainment

అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారనేదానిపై అధికారిక సమాచారం లేదు. కానీ అఖండ తరహాలోనే అఖండ 2 డిసెంబర్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నట్లు టాక్. ఇదే కనుక జరిగితే పవన్ ఓజి చిత్రానికి లైన్ క్లియర్ అయినట్లే. పవన్ ఓజి చిత్రం సోలోగా రిలీజ్ అయ్యే అవకాశం ఉంటుంది. చిరంజీవి విశ్వంభర చిత్రం కూడా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్నట్లు ఇటీవల ప్రచారం జరిగింది. ఆ మూవీ కూడా వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. 

55
Image Credit : X/DVV Entertainment

ఇటు అఖండ 2, అటు ఓజి రెండు చిత్రాలపై అభిమానుల్లో కనీవినీ ఎరుగని అంచనాలు ఉన్నాయి. ఈ రెండు చిత్రాలు ఒకే రోజు రిలీజ్ అయితే ఏదో ఒక చిత్రానికి నష్టం తప్పదని ఇండస్ట్రీలో చర్చ జరిగింది. ఇప్పుడు అఖండ 2 వాయిదా పడుతున్నట్లు వార్తలు రావడంతో బిగ్గెస్ట్ క్లాష్ తప్పింది అని అంటున్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
పవన్ కళ్యాణ్
నందమూరి బాలకృష్ణ
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Rajinikanth Remuneration: కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్‌.. ఇండియాలోనే టాప్‌
Recommended image2
రాంచరణ్ 'చికిరి' హుక్ స్టెప్ క్రెడిట్ జానీ మాస్టర్ కి దక్కలేదా, ఎమోషనల్ కామెంట్స్.. ఏం జరిగిందో తెలుసా
Recommended image3
Barabar Premistha Collections: బరాబర్‌ ప్రేమిస్తా మూవీ ఫైనల్‌ కలెక్షన్లు.. చంద్రహాస్‌ సినిమాకి ఊహించని వసూళ్లు
Related Stories
Recommended image1
తుమ్మ మొద్దులా ఉంటాడు, అతడిని చూసి చిరంజీవి మైండ్ బ్లాక్.. మెగాస్టార్ కి ఆదర్శంగా నిలిచిన ఆ నటుడు ఎవరంటే
Recommended image2
ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీతో ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. అతడు ఇండస్ట్రీకి దొరికిన వరం అంటూ కామెంట్స్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved