MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీతో ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. అతడు ఇండస్ట్రీకి దొరికిన వరం అంటూ కామెంట్స్

ఎన్టీఆర్, రామ్ చరణ్, బన్నీతో ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. అతడు ఇండస్ట్రీకి దొరికిన వరం అంటూ కామెంట్స్

ఒకప్పుడు జెనీలియా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. జెనీలియా పేరు చెప్పగానే బొమ్మరిల్లు చిత్రంలో ఆమె పోషించిన హాసిని పాత్ర గుర్తుకు వస్తుంది. బాయ్స్ చిత్రంతో సౌత్ లోకి అడుగుపెట్టిన జెనీలియా సత్యం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

2 Min read
Author : Tirumala Dornala
Published : Jul 16 2025, 09:43 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జెనీలియా తెలుగు చిత్రాలు
Image Credit : X/RRR Movie

జెనీలియా తెలుగు చిత్రాలు

ఒకప్పుడు జెనీలియా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. జెనీలియా పేరు చెప్పగానే బొమ్మరిల్లు చిత్రంలో ఆమె పోషించిన హాసిని పాత్ర గుర్తుకు వస్తుంది. బాయ్స్ చిత్రంతో సౌత్ లోకి అడుగుపెట్టిన జెనీలియా సత్యం మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఎన్నో మెమొరబుల్ హిట్స్ ని జెనీలియా తన ఖాతాలో వేసుకుంది.

సత్యం, రెడీ, ఢీ, బొమ్మరిల్లు లాంటి హిట్స్ ఆమె ఖాతాలో ఉన్నాయి. కానీ జెనీలియాకి స్టార్ హీరోలతో నటించిన ప్రతిసారి నిరాశే ఎదురైంది. జెనీలియా ఎన్టీఆర్ తో నటించిన నా అల్లుడు, సాంబ చిత్రాలు నిరాశపరిచాయి. అదేవిధంగా రామ్ చరణ్ తో నటించిన ఆరెంజ్, అల్లు అర్జున్ తో నటించిన హ్యాపీ మూవీస్ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

25
జూనియర్ చిత్రంతో జెనీలియా రీ ఎంట్రీ
Image Credit : Instagram/Genelia

జూనియర్ చిత్రంతో జెనీలియా రీ ఎంట్రీ

అయితే వివాహం తర్వాత జెనీలియా సినిమాలకు దూరమైంది. ప్రస్తుతం జెనీలియా మరోసారి టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. గాలి జనార్దన్ రెడ్డి తనయుడు కిరీటి రెడ్డి నటిస్తున్న జూనియర్ చిత్రం జూలై 18న రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో శ్రీ లీల హీరోయిన్ గా నటించింది. కీలక పాత్రలో జెనీలియా మెరిశారు.

Related Articles

Related image1
మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య నిప్పులు పోసిన అట్టర్ ఫ్లాప్ మూవీ, మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్
Related image2
ఈ మాటల వల్లే జబర్దస్త్ వదిలేశా, అమెరికా వెళ్లినా లింకులు పంపారు..హైపర్ ఆదికి అనసూయ డైరెక్ట్ వార్నింగ్
35
రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు అవుతారని ఊహించలేదు
Image Credit : Instagram/Genelia

రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు అవుతారని ఊహించలేదు

ఈ చిత్ర ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జెనీలియా ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ ముగ్గురు హీరోలు ప్రస్తుతం పాన్ ఇండియా హీరోలుగా రాణిస్తున్నారు. వారి జర్నీలో నేను కూడా భాగమైనందుకు సంతోషంగా ఉంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లు అవుతారని అప్పట్లో నేను అసలు ఊహించలేదు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో వాళ్ళ నటన చూశాక వీళ్లతోనేనా నేను నటించింది అని ఆశ్చర్యపోయా.

45
ఎన్టీఆర్ టాలీవుడ్ కి ఒక వరం
Image Credit : Instagram/Genelia

ఎన్టీఆర్ టాలీవుడ్ కి ఒక వరం

జూనియర్ ఎన్టీఆర్ అద్భుతమైన నటుడు. మూడు పేజీల డైలాగ్ ని కూడా సింగిల్ టేక్ లో చెప్పేస్తాడు. అతడు టాలీవుడ్ చిత్ర పరిశ్రమకు ఒక వరం అంటూ ప్రశంసలతో ముంచెత్తింది. రామ్ చరణ్ కూడా అమేజింగ్ యాక్టర్. ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ నటన చాలా బాగుంది. ఇక అల్లు అర్జున్ ఎప్పుడు ఎనర్జిటిక్ గా ఉంటారు. హ్యాపీ మూవీ షూటింగ్ సమయంలో అల్లు అర్జున్ చాలా సరదాగా ఉండేవారు అని జెనీలియా తెలిపింది.

55
కోట శ్రీనివాసరావుపై ఎమోషనల్ కామెంట్స్
Image Credit : Instagram/Genelia

కోట శ్రీనివాసరావుపై ఎమోషనల్ కామెంట్స్

అదేవిధంగా ఇటీవల మరణించిన కోట శ్రీనివాసరావు ని కూడా జెనీలియా గుర్తుచేసుకుంది. కోటా శ్రీనివాసరావు గారి మరణ వార్త విని దిగ్భ్రాంతికి గురైనట్లు జెనీలియా పేర్కొంది. బొమ్మరిల్లు చిత్రంలో నటిస్తున్నప్పుడు ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నా. అలాంటి నటుడిని ఇండస్ట్రీ కోల్పోవడం బాధాకరమని జెనీలియా తెలిపింది.

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
రామ్ చరణ్ కొణిదెల
అల్లు అర్జున్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Ilaiyaraaja Secrets: మణిరత్నంను పరిచయం చేసింది నేనే.. ఇళయరాజా సంచలన వ్యాఖ్యలు!
Recommended image2
Rajinikanth Remuneration: కమల్‌ హాసన్‌తో సినిమాకి రజనీకి రికార్డ్ రెమ్యూనరేషన్‌.. ఇండియాలోనే టాప్‌
Recommended image3
రాంచరణ్ 'చికిరి' హుక్ స్టెప్ క్రెడిట్ జానీ మాస్టర్ కి దక్కలేదా, ఎమోషనల్ కామెంట్స్.. ఏం జరిగిందో తెలుసా
Related Stories
Recommended image1
మెగా, నందమూరి ఫ్యామిలీల మధ్య నిప్పులు పోసిన అట్టర్ ఫ్లాప్ మూవీ, మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్
Recommended image2
ఈ మాటల వల్లే జబర్దస్త్ వదిలేశా, అమెరికా వెళ్లినా లింకులు పంపారు..హైపర్ ఆదికి అనసూయ డైరెక్ట్ వార్నింగ్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved