MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • అల్లు అర్జున్ టీషర్ట్ పై బ్రహ్మానందం ఫోటో, కమెడియన్ డైలాగ్ తో సరికొత్త ట్రెండ్.. బన్నీనా మజాకా

అల్లు అర్జున్ టీషర్ట్ పై బ్రహ్మానందం ఫోటో, కమెడియన్ డైలాగ్ తో సరికొత్త ట్రెండ్.. బన్నీనా మజాకా

పుష్ప ఫీవర్ తగ్గక ముందే అల్లు అర్జున్ మరో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోలు స్టైలిష్ గా అనిపించే టీ షర్ట్ లు ధరిస్తుంటారు.

1 Min read
Author : Tirumala Dornala
Published : May 02 2025, 06:30 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Allu Arjun

Allu Arjun

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప చిత్రంలో తగ్గేదే లే అంటూ సరికొత్తట్రెండ్ సెట్ చేశారు. తగ్గేదే లే డైలాగ్ తో పాటు బన్నీ గడ్డం నిమురుకునే యాటిట్యూడ్ కూడా దేశం మొత్తాన్ని ఊపేసింది. పుష్ప ఫీవర్ తగ్గక ముందే అల్లు అర్జున్ మరో కొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టారు. సాధారణంగా హీరోలు స్టైలిష్ గా అనిపించే టీ షర్ట్ లు ధరిస్తుంటారు. అవసరం అయితే ఆ టీషర్ట్స్ పై మంచి కొటేషన్స్ ఉండేలా చూసుకుంటారు. 

25
Allu Arjun

Allu Arjun

కానీ అల్లు అర్జున్ అందుకు భిన్నం అనే చెప్పాలి. తాజాగా అల్లు అర్జున్ వేవ్స్ సమ్మిట్ 2025 కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ లో వైట్ టీషర్ట్ ధరించి కనిపించారు. అందులో వింతేమి ఉంది అని అనుకోవచ్చు. అక్కడే ట్విస్ట్ ఉంది. బన్నీ టీషర్ట్ పై టాలీవుడ్ స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ఫోటోలు ఉన్నాయి. 

Related Articles

Related image1
నేను బలవంతంగా సినిమాలు మానేయొచ్చు, అప్పు తీర్చడానికే హీరో అయ్యా.. ఫ్యాన్స్ కి షాకిచ్చిన అజిత్
Related image2
లెక్చరర్ ని అవమానించిన చిరంజీవి, తన తప్పు తెలుసుకుని తిరిగి సాయం చేస్తే ఏం జరిగిందో తెలుసా ?
35
Allu Arjun

Allu Arjun

అంతటితో అయిపోలేదు. బ్రహ్మి ఫోటో కింద అతడి డైలాగ్ కూడా ఉంది. అనగనగా ఒక రోజు చిత్రంలో బ్రహ్మి.. నెల్లూరు పెద్దా రెడ్డి తెలుసా అంటూ కడుపుబ్బా నవ్వించిన సంగతి తెలిసిందే. అదే డైలాగ్ ని బన్నీ తన టీ షర్ట్ పై ముద్రించుకున్నారు. 

45
Allu Arjun

Allu Arjun

బ్రహ్మి ఫోటో కింద నెల్లూరు పెద్దారెడ్డి తాలూకా అని రాసి ఉంది. దీనితో బన్నీ టీషర్ట్ ఒక్కసారిగా ఇంటర్నెట్ లో వైరల్ గా మారింది. ఫ్యాన్స్ ప్రతి ఒక్కరూ ఈ టీషర్ట్ గురించే చర్చించుకుంటున్నారు. ఇదేం ట్విస్టు రా బాబోయ్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

55
Brahmanandam

Brahmanandam

మరికొందరు స్టైల్ కి హాస్యం తోడైతే ఇలాగే ట్రెండ్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. అల్లు అర్జున్ టీ షర్ట్ పై బ్రహ్మి ఫోటో కనిపించగానే.. అనగనగా ఒక రోజు చిత్రంలో బ్రహ్మానందం కామెడీ సన్నివేశాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
అల్లు అర్జున్

Latest Videos
Recommended Stories
Recommended image1
Dragon OTT: మతిపోయే ధరకి `డ్రాగన్‌` ఓటీటీ డీల్‌?.. ఎన్టీఆర్‌ మూవీ నుంచి గూంబ్స్ తెప్పించే అప్‌ డేట్
Recommended image2
ధురంధర్ 2 కి రిలీజ్ కు ముందే దెబ్బ? టాక్సిక్ హిస్టారిక్ డీల్‌తో గేమ్ మారిపోయిందిగా..
Recommended image3
Allu Arjun ని కలవాలంటే 42 రూల్స్ ? ఆ బ్రాండ్‌ స్ట్రాటజర్‌కి ఇచ్చిపడేసిన అల్లు అర్జున్‌ టీమ్‌
Related Stories
Recommended image1
నేను బలవంతంగా సినిమాలు మానేయొచ్చు, అప్పు తీర్చడానికే హీరో అయ్యా.. ఫ్యాన్స్ కి షాకిచ్చిన అజిత్
Recommended image2
లెక్చరర్ ని అవమానించిన చిరంజీవి, తన తప్పు తెలుసుకుని తిరిగి సాయం చేస్తే ఏం జరిగిందో తెలుసా ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved