MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • Akhanda 2 OTT: థియేటర్లో డిజాస్టర్‌, ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతున్న `అఖండ 2`.. బాలయ్య ర్యాంపేజ్‌

Akhanda 2 OTT: థియేటర్లో డిజాస్టర్‌, ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతున్న `అఖండ 2`.. బాలయ్య ర్యాంపేజ్‌

Akhanda 2 OTT:: బాలకృష్ణ హీరోగా నటించిన `అఖండ 2` సినిమా గతేడాది డిసెంబర్‌లో విడుదలై డిజాస్టర అయ్యింది. కానీ ఇప్పుడు ఓటీటీలో మాత్రం దుమ్మురేపుతుంది. అందరిని ఆశ్చర్యపరుస్తోంది. 

2 Min read
Author : Aithagoni Raju
Published : Feb 15 2026, 11:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
థియేటర్లో డిజాస్టర్‌ గా `అఖండ 2`
Image Credit : Asianet News

థియేటర్లో డిజాస్టర్‌ గా `అఖండ 2`

బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `అఖండ 2`. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన విషయం తెలిసిందే. ఆదిపినిశెట్టి, సంయుక్త, పూర్ణ వంటి వారు ముఖ్య పాత్రలు పోషించారు. 14రీల్స్ ప్లస్‌ ఈ మూవీని నిర్మించింది. రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలు. ఈ మూవీ శివతత్వం ప్రధానంగా రూపొందింది. అయితే ఈ మూవీ థియేటర్లో ఆడలేదు. గతేడాది డిసెంబర్‌ 12న ఈ మూవీ విడుదలైన విషయం తెలిసిందే. డిసెంబర్‌ 5న విడుదల కావాల్సిన ఈ మూవీ అర్థిక కారణాలతో వాయిదా పడింది. వారం గ్యాప్‌ తర్వాత వచ్చింది.

25
అఖండ 2ని దెబ్బకొట్టిన ఆర్థిక ఇబ్బందులు
Image Credit : Asianet News

అఖండ 2ని దెబ్బకొట్టిన ఆర్థిక ఇబ్బందులు

`అఖండ 2` సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టంది. ఆడియెన్స్ ని ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. శివతత్వానికి సంబంధించిన క్లాస్‌ ఇవ్వడం ఎక్కువగా ఉందని, `అఖండ` మూవీ స్థాయిలో లేదని, బలవంతంగా దేవుడి గురించి చెప్పినట్టుగా ఉందని, రియాలిటీకి దూరంగా ఉందనే విమర్శలు వచ్చాయి. ఒక ప్రొపగండ మూవీగా చెప్పుకొచ్చారు. దీనికితోడు రిలీజ్‌ ఆలస్యం కావడం కూడా మూవీ ఆడకపోవడానికి కారణంగా చెప్పొచ్చు. థియేటర్లలో ఈ సినిమా డిజాస్టర్‌ అయ్యింది.

Related Articles

Related image1
Jagapathi Babu: పెట్టెలో పెట్టి మర్చిపోయారు.. మరణగండం గురించి మతిపోయే విషయాలు బయటపెట్టిన జగపతిబాబు
Related image2
Balakrishna రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రాజశేఖర్‌.. బాలయ్యకి ఊహించని దెబ్బ
35
ఓటీటీలో దుమ్మురేపుతున్న బాలయ్య `అఖండ 2`
Image Credit : Asianet News

ఓటీటీలో దుమ్మురేపుతున్న బాలయ్య `అఖండ 2`

అయితే ఇప్పుడు ఓటీటీలో దుమ్మురేపుతుంది. `అఖండ 2` నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతుంది. ఇది జనవరి 9న ఓటీటీలోకి వచ్చింది. ప్రారంభంలో ఓటీటీలో కూడా  పెద్దగా ఆడలేదు. ఆడియెన్స్ పట్టించుకోలేదు. క్రమంలో ఇది పుంజుకుంది. ఫ్యామిలీ ఆడియెన్స్ బాగా చూస్తున్నారు. ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా ఈ మూవీని ఎక్కువగా చూస్తున్నారు. ఇప్పుడు ఇండియా వైజ్‌గా టాప్‌ 10లోకి వచ్చింది. శివతత్వానికి చెందిన మూవీ కావడంతో ఆడియెన్స్ దీన్ని చూసేందుకు ఇష్టపడుతున్నట్టు తెలుస్తోంది.

45
నెట్‌ ఫ్లిక్స్ లో టాప్ 9లో అఖండ 2
Image Credit : stockPhoto

నెట్‌ ఫ్లిక్స్ లో టాప్ 9లో అఖండ 2

నెట్‌ ఫ్లిక్స్ లో ఉన్న ఈ మూవీ కూడా మొదట్లో విమర్శలు ఎదుర్కొన్నా ఇప్పుడు మాత్రం సత్తా చాటుతోంది. టాప్‌ 10లోకి దూసుకువచ్చింది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ మూవీ ఓటీటీలో దుమ్మురేపుతుంది. నెట్‌ఫ్లిక్స్ లో ఇండియా వైడ్‌గా టాప్‌ 10 మూవీస్‌లో ఇది తొమ్మిదో స్థానంలో ఉంది. ఓటీటీలోకి వచ్చి నెల రోజులు దాటిన తర్వాత కూడా టాప్‌ 10లో ట్రెండింగ్‌ కావడం విశేషం. ఈ మూవీ లేట్‌ గా అయినా లేటెస్ట్ గా ఆడియెన్స్ కి కనెక్ట్ అవుతుందని చెప్పొచ్చు.

55
నెట్‌ ఫ్లిక్స్ టాప్‌ 10 మూవీస్‌
Image Credit : Asianet News

నెట్‌ ఫ్లిక్స్ టాప్‌ 10 మూవీస్‌

ఇక నెట్‌ ఫ్లిక్స్ ఇండియా టాప్‌ 10 మూవీస్‌లో `ధురంధర్‌` మొదటి స్థానంలో ఉంది. రెండో స్థానంలో `తస్కరి`, మూడో స్థానంలో `గ్రేట్‌ ఇండియా కపిల్‌` షో, నాలో స్థానంలో `తేరే ఇష్క్ మెయిల్‌`, ఐదో స్తానంలో `స్ట్రేంజర్‌ థింగ్స్`, ఆరో స్థానంలో హక్‌`, ఏడో స్థానంలో `జాలీ ఎల్ ఎల్‌ బీ 3`, 8వ స్థానంలో `దే దే ప్యార్‌ దే 2`, తొమ్మిదో స్థానంలో `అఖండ 2`, పదో స్థానంలో ఓ హాలీవుడ్‌ రొమాంటిక్‌ మూవీ ఉంది.

About the Author

AR
Aithagoni Raju
అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.
నందమూరి బాలకృష్ణ
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్
ఓటీటీ
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jagapathi Babu: పెట్టెలో పెట్టి మర్చిపోయారు.. మరణగండం గురించి మతిపోయే విషయాలు బయటపెట్టిన జగపతిబాబు
Recommended image2
Top 5 Heroes: అత్యంత ఖరీదైన ఇళ్లు ఉన్న హీరోలు.. చిరు, ప్రభాస్‌, నాగ్‌, బన్నీ, మహేష్‌ హౌజెస్‌ ఎలా ఉన్నాయంటే?
Recommended image3
Soundarya లా మిగిలిపోలేదు.. హీరోయిన్‌గా చేస్తున్న డాక్టర్లు వీరే.. రొమాన్సే కాదు, ఆపరేషన్‌ కూడా చేస్తారు
Related Stories
Recommended image1
Jagapathi Babu: పెట్టెలో పెట్టి మర్చిపోయారు.. మరణగండం గురించి మతిపోయే విషయాలు బయటపెట్టిన జగపతిబాబు
Recommended image2
Balakrishna రిజెక్ట్ చేసిన సినిమాలతో ఇండస్ట్రీ హిట్లు కొట్టిన రాజశేఖర్‌.. బాలయ్యకి ఊహించని దెబ్బ
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved