MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • ఏపీ మాజీ మంత్రి రోజాకి మతిపోయేలా చేసిన సూర్య, ఏకంగా 51 మంది డాక్టర్లు..కష్టపడుతూ ఇంటిని చూసుకుంటున్నా

ఏపీ మాజీ మంత్రి రోజాకి మతిపోయేలా చేసిన సూర్య, ఏకంగా 51 మంది డాక్టర్లు..కష్టపడుతూ ఇంటిని చూసుకుంటున్నా

నటి రోజా సెల్వమణి హీరో సూర్యపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సూర్య తనకి ఇన్సిపిరేషన్ అని ఆమె అన్నారు. సూర్య చేసిన ఒక గొప్ప పని గురించి తెలుసుకుని ఆశ్చర్యపోయినట్లు రోజా తెలిపారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Nov 27 2025, 04:17 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మాజీ మంత్రి రోజా సెల్వమణి
Image Credit : Asianet News

మాజీ మంత్రి రోజా సెల్వమణి

నటి, మాజీ మంత్రి రోజా సెల్వమణి ఏం మాట్లాడినా క్షణాల్లో వైరల్ అవుతుంది. పొలిటికల్ గా బోల్డ్ గా మాట్లాడుతూ ఫైర్ బ్రాండ్ గా రోజా గుర్తింపు పొందారు. కొన్నిసార్లు ఆమె వ్యాఖ్యల వల్ల ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. తెలుగులో రోజా రాజకీయాల కారణంగా 2013 లోనే సినిమాల నుంచి విరామం తీసుకున్నారు. కానీ టీవీ షోలలో మాత్రం కొనసాగుతూ వచ్చారు. ఇన్నేళ్ల తర్వాత రోజా తమిళంలో లెనిన్ పాండియన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. 

25
సూర్య అగరం ఫౌండేషన్
Image Credit : Asianet News

సూర్య అగరం ఫౌండేషన్

ఓ ఇంటర్వ్యూలో రోజా.. తమిళ స్టార్ హీరో సూర్య గురించి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. తనకి తమిళంలో సూర్య ఇన్సిపిరేషన్ అని రోజా ఓపెన్ గా చెప్పారు. సూర్య అగరం ఫౌండేషన్ అనే సంస్థని స్థాపించి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. పేద విద్యార్థులని చదివించడం, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లల చదువు కోసం స్కాలర్ షిప్ లు ఇవ్వడం ఇలా అగరం ఫౌండేషన్ ద్వారా ఎన్నో మంచి కార్యక్రమాలు సూర్య చేస్తున్నారు. 

Related Articles

Related image1
టాలీవుడ్‌⁠లో నెంబర్ 1 హీరో ఎవరో తేలిపోయింది, ఏఐ చెప్పిన టాప్ 6 హీరోలు వీళ్ళే.. ఒక్కొక్కరి గురించి ఇలా
Related image2
తన కూతురి కంటే చిరంజీవిని ఎక్కువగా ప్రేమించిన నిర్మాత.. ఒక్క సినిమాతో కోలుకోలేని దెబ్బ, చివరి రోజుల్లో..
35
51 మంది విద్యార్థులని డాక్టర్లని చేసిన సూర్య
Image Credit : Asianet News

51 మంది విద్యార్థులని డాక్టర్లని చేసిన సూర్య

సూర్య అగరం ఫౌండేషన్ ద్వారా సహాయం పొంది ఏకంగా 51 మంది విద్యార్థులు డాక్టర్లు అయ్యారు. ఆ మధ్యన మే డే సందర్భంగా అగరం ఫౌండేషన్ ఓ ఈవెంట్ నిర్వహించింది. ఈ సంస్థ 15 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కి అగరం ఫౌండేషన్ ద్వారా డాక్టర్లు అయిన 51 మంది డయాస్ పై నిలబడ్డారు. వారిని చూడగానే సూర్య ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యారు. అంతే కాదు అగరం ఫౌండేషన్ ద్వారా 1800 మంది ఇంజనీర్లు కూడా అయ్యారట. 

45
వాళ్ళని చూసి నా మైండ్ పోయింది
Image Credit : Asianet News

వాళ్ళని చూసి నా మైండ్ పోయింది

దీని గురించి రోజా మాట్లాడుతూ.. ''ఆ ఈవెంట్ లో సూర్య చదివించిన డాక్టర్లు డయాస్ పైకి వచ్చారు. ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. ఇంత మంది డాక్టర్లని సూర్య చదివించారా అని తెలియడంతో నా మైండ్ పోయింది. ఆ విషయంలో సూర్య నాకు ఆదర్శం. వారి ఇంట్లో ఇద్దరు హీరోలు ఉన్నారు కాబట్టి.. ఆయన స్థాయిలో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. నేను నా స్థాయిలో కష్టపడుతూ ఇంటిని చూసుకుంటూ సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నా. ఆ విధంగా నాకు కూడా ఒక సంతృప్తి ఉంది'' అని రోజా తెలిపారు. 

55
సినిమాల్లోకి రీ ఎంట్రీ
Image Credit : Asianet News

సినిమాల్లోకి రీ ఎంట్రీ

తమిళంలో సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తున్న రోజా.. తెలుగు కూడా నటన ప్రారంభిస్తారా లేదా అనేది తెలియాల్సి ఉంది. తెలుగులో రోజా ఒకప్పుడు అగ్ర నటిగా వెలుగు వెలిగింది. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున లాంటి హీరోలతో సినిమాలు చేశారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
ఏషియానెట్ న్యూస్
వినోదం
తెలుగు సినిమా

Latest Videos
Recommended Stories
Recommended image1
Romantic Movies: వాలెంటైన్స్ డే కు లవర్ తో కలిసి చూడాల్సిన 5 ఎవర్‍గ్రీన్ సినిమాలు
Recommended image2
BB జోడీ 2 కోసం రీతూ చౌదరి, డిమోన్ పవన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో తెలుసా?
Recommended image3
Sreeleela MBBS: డాక్టర్‌గా మారిన శ్రీలీల.. కానీ నెటిజన్లు ఎందుకు అనుమానిస్తున్నారో తెలుసా?
Related Stories
Recommended image1
టాలీవుడ్‌⁠లో నెంబర్ 1 హీరో ఎవరో తేలిపోయింది, ఏఐ చెప్పిన టాప్ 6 హీరోలు వీళ్ళే.. ఒక్కొక్కరి గురించి ఇలా
Recommended image2
తన కూతురి కంటే చిరంజీవిని ఎక్కువగా ప్రేమించిన నిర్మాత.. ఒక్క సినిమాతో కోలుకోలేని దెబ్బ, చివరి రోజుల్లో..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved