- Home
- Entertainment
- చిరంజీవి మూవీలో గోల్డెన్ ఛాన్స్ మిస్.. ఆమె చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి సంబంధమే లేదు అంటూ కామెంట్స్
చిరంజీవి మూవీలో గోల్డెన్ ఛాన్స్ మిస్.. ఆమె చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి సంబంధమే లేదు అంటూ కామెంట్స్
క్యారెక్టర్ ఆర్టిస్ట్ జయలలితకి చిరంజీవి సూపర్ హిట్ చిత్రంలో ఛాన్స్ మిస్ అయిందట. ఆ సంఘటన గురించి జయలలిత ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

నటి జయలలిత
నటి జయలలిత టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తున్నారు. ఆమె ఎక్కువగా వ్యాంపు తరహా గ్లామర్ రోల్స్ లో నటించి గుర్తింపు పొందారు. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా కూడా నటించారు. అయితే హీరోయిన్ గా కొనసాగే అవకాశం ఆమెకు దక్కలేదు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఆమె వ్యాంపు పాత్రలు చేశారు.
ఖైదీ మూవీలో ఛాన్స్
కెరీర్ బిగినింగ్ లో ఒక గోల్డెన్ ఛాన్స్ తనకి మిస్ అయిందని జయలలిత ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ని మలుపు తిప్పిన ఖైదీ చిత్రంలో అలనాటి హీరోయిన్ సుమలత కీలక పాత్రలో నటించారు. ఆ పాత్రలో ముందుగా జయలలితని అనుకున్నారట. అనుకోకుండా ఖైదీ చిత్ర నిర్మాతలు నన్ను చూశారు. ఈ అమ్మాయి చాలా బావుంది. ఖైదీ చిత్రంలో పాత్రకి సరిపోతుంది అని అనుకున్నారు.
చేజారిన అవకాశం
ఆ తర్వాత నేరుగా వాళ్ళు మా నాన్నని అప్రోచ్ అయ్యారు. నాన్న ఆలోచించుకునే లోపే నన్ను ఖైదీ చిత్రం కోసం నిర్మాతలు చెన్నైకి షిఫ్ట్ చేసేశారు. కానీ చివరికి కొన్ని రోజుల తర్వాత ఈ చిత్రంలో సుమలతను తీసుకున్నామని చెప్పడంతో నా హార్ట్ బ్రేక్ అయింది. ఆ తర్వాత ఓ తమిళ మ్యాగజైన్ ద్వారా నాకు మంచి గుర్తింపు వచ్చింది. నిర్మాతలు నన్ను వ్యాంపు రోల్స్ కోసం సంప్రదించడం మొదలుపెట్టారు.
వ్యాంపు పాత్రల్లో అవకాశం
గుర్తింపు వస్తుంది కదా అని తాను కూడా ఆ పాత్రలకు ఓకే చెప్పినట్లు జయలలిత అన్నారు. చిరంజీవితో తనకి అంతగా పరిచయం లేనప్పటికీ కలిసినప్పుడల్లా ఆయన తనని చాలా గౌరవంగా చూసుకుంటారని జయలలిత తెలిపింది. ప్రజారాజ్యం పార్టీ సమయంలో పాలకొల్లు నుంచి కొందరు చిరంజీవి గారిని కలవాలని నన్ను అడిగారు. నేను వారిని చిరంజీవి గారి దగ్గరికి తీసుకెళ్లాను. ఆ సమయంలో చిరంజీవి గారు నా గురించి చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోలేను అని జయలలిత అన్నారు.
ఆమె వ్యక్తిత్వం గొప్పది
ఈమె చేసే పాత్రలకు, వ్యక్తిత్వానికి ఏ మాత్రం సంబంధం లేదు. చాలామంది తాము చేసిన సహాయాన్ని చాలా గొప్పగా చెప్పుకుంటారు. కానీ జయలలిత ఎన్నో గుప్త దానాలు చేశారు. ఏ రోజూ చెప్పుకోలేదు అని చిరంజీవి తన గురించి చెప్పినట్లు జయలలిత గుర్తుచేసుకుంది.