తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె ధరించిన జాకెట్ కి ఒక ప్రత్యేకత ఉంది.
జాన్వీ కపూర్ కి పాన్ ఇండియా క్రేజ్
జాన్వీ కపూర్ క్రమంగా పాన్ ఇండియా స్థాయిలో తిరుగులేని హీరోయిన్ గా మారుతోంది. శ్రీదేవి కుమార్తెగా ఆమెకి గుర్తింపు ఉంది. ఇటీవల జాన్వీ కపూర్ గ్లామర్ తో యువతని బాగా ఆకర్షిస్తోంది. సోషల్ మీడియాలో ఆమె ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫలితంగా ఆమెకి హిందీతో పాటు తెలుగులో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి.

జగదేక వీరుడు అతిలోక సుందరి పోస్టర్ తో జాకెట్
తాజాగా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆమె ధరించిన జాకెట్ కి ఒక ప్రత్యేకత ఉంది. తెలుగు తెరపై చరిత్ర సృష్టించిన 1990 క్లాసిక్ ఫాంటసీ మూవీ జగదేక వీరుడు అతిలోక సుందరి (JVAS) చిత్రంలో చిరంజీవి, శ్రీదేవి నటించారు. ఆ చిత్రాన్ని ఇప్పటికే చాలా సార్లు చూశానని జాన్వీ కపూర్ పేర్కొంది. ఇటీవల జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం రీ రిలీజ్ అయింది. ఈ చిత్ర పోస్టర్ తో డిజైన్ చేసిన ఓ ప్రత్యేక జాకెట్‌ను ధరించి జాన్వీ కపూర్ అభిమానులను ఆకట్టుకున్నారు. జాన్వీ ధరించిన జాకెట్ పై జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రంలోని చిరంజీవి, శ్రీదేవి, అమ్రీష్ పురి స్టిల్స్ ఉన్నాయి.

ఈ జాకెట్‌ను నిర్మాత స్వప్నా దత్ బహుమతిగా అందించగా, దాన్ని గౌరవంగా స్వీకరించిన జాన్వీ.. జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం గురించి కామెంట్స్ చేశారు.
జగదేక వీరుడు అతిలోక సుందరి విశేషాలు చెబుతూ..
జాన్వీ తన పోస్ట్‌లో ఇలా రాశారు: “ఈ జాకెట్ నాకు తెగ నచ్చేసింది. ఈ సినిమాతో మరింత మమేకమయ్యాను. కొన్ని రోజుల క్రితం రీ-రిలీజ్ ప్రింట్‌ని మళ్లీ చూసే అవకాశం వచ్చింది. ఆ సినిమాకు చెందిన విశేషాలు, టీమ్ క్రియేట్ చేసిన మేజిక్ మరువలేనిది. అమ్మ ఈ చిత్రంలో ఒక దేవతలా, ఏంజిల్ లా, క్యూట్ గా, ఫన్నీగా కనిపించారు. చిరంజీవి సార్ నటన, హాస్యం, యాక్టింగ్ శైలి అంతా అద్భుతం. ఆ ఇద్దరి కాంబినేషన్, రాఘవేంద్రరావు గారి దర్శకత్వం, అమ్రీష్ పురి గారి పాత్ర, సంగీతం, సెట్స్, కాస్ట్యూమ్స్, కథ ఇలా ప్రతి అంశం అద్భుతం. ఈ రీప్రింట్ సినిమా ప్రియులకు ఒక గొప్ప బహుమతిగా అనిపించింది” అని పేర్కొంది.

ప్రస్తుతం జాన్వీ కపూర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌తో కలిసి పెద్ది అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా ద్వారా ఆమె తెలుగు ప్రేక్షకులకు మరింత చేరువవుతారని భావిస్తున్నారు. ఆమె ఇప్పటికే దేవర చిత్రంలో ఎన్టీఆర్ సరసన నటించారు.

