MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Entertainment
  • చిరంజీవి డ్యాన్స్ చూడరా అని డైరెక్టర్ నాతో అన్నారు.. మెగాస్టార్ తో పోటీపై సుమన్ ఓపెన్ కామెంట్స్ వైరల్

చిరంజీవి డ్యాన్స్ చూడరా అని డైరెక్టర్ నాతో అన్నారు.. మెగాస్టార్ తో పోటీపై సుమన్ ఓపెన్ కామెంట్స్ వైరల్

చిరంజీవి డ్యాన్స్ చూసి నేర్చుకోమని ఓ డైరెక్టర్ తనకి చెప్పినట్లు సుమన్ పేర్కొన్నారు. చిరంజీవితో అప్పట్లో తన పోటీ ఎలా ఉండేదో వివరించారు. 

2 Min read
Author : Tirumala Dornala
Published : Aug 10 2025, 05:46 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
సుమన్ కెరీర్ లో వివాదం
Image Credit : Facebook/Suman

సుమన్ కెరీర్ లో వివాదం

సీనియర్ హీరో సుమన్ ప్రస్తావన రాగానే వెంటనే చిరంజీవి గురించి కూడా అంతా మాట్లాడుతుంటారు. సుమన్ తన కెరీర్ లో ఎదుర్కొన్న వివాదానికి కారణం చిరంజీవి అంటూ చాలా ఏళ్లపాటు ఫేక్ ప్రచారం ఒకటి నడిచింది. స్వయంగా సుమన్ ఆ విషయంలో క్లారిటీ ఇవ్వడంతో రూమర్స్ కి చెక్ పడినట్లు అయింది. తాను జైలు పాలు కావడానికి తమిళనాడులో కొంత మంది కారణం అని సుమన్ తెలిపారు. ఆ టైంలో చిరంజీవి, నేను పోటా పోటీగా సినిమాలు చేస్తుండడం వల్ల ఆయన పేరుని అనవసరంగా ఈ వివాదంలోకి లాగారు అని సుమన్ క్లారిటీ ఇచ్చారు. 

DID YOU
KNOW
?
మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యం ఉన్న హీరో
హీరో సుమన్ కి మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం ఉంది. కరాటే, ఇతర మార్షల్ ఆర్ట్స్ తెలిసిన అతి కొద్దిమంది హీరోల్లో సుమన్ ఒకరు. 
25
నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు అన్నారు
Image Credit : Facebook/Suman

నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు అన్నారు

సుమన్ జైలు పాలు కాకుంటే చిరంజీవికి గట్టి పోటీ ఇచ్చేవారని అప్పట్లో ఇండస్ట్రీలో చాలా మంది భావించారు. సుమన్ కి కూడా ఈ విషయాన్ని చాలా మంది చెప్పారట. నువ్వు ఉండాల్సిన చోటు ఇది కాదు, ఎక్కడో ఉండాల్సినోడివి అని అంటుంటారు. వారి మాటలతో నేను ఏకీభవించను. ఎందుకంటే నేను ఇండస్ట్రీలోకి ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చాను. కాబట్టి నేను ఇన్నేళ్ళపాటు ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడమే గొప్ప విషయం. 

Related Articles

Related image1
కొత్తగా ప్రయత్నించిన చిరు, ఆ మూవీ కలెక్షన్స్ చూసి కృష్ణ ఏమన్నారో తెలుసా.. మెగాస్టార్ ఫుల్ హ్యాపీ
Related image2
ఆ వంశంలో 63వ తరం వీరుడిగా మహేష్.. రాజమౌళి మూవీ టైటిల్ లీక్, స్టోరీ కూడా వైరల్ ?
35
మా ఇద్దరి మధ్య కాంపిటీషన్
Image Credit : Facebook/Suman

మా ఇద్దరి మధ్య కాంపిటీషన్

నేను, చిరంజీవి దాదాపు ఒకేసారి ఇండస్ట్రీలోకి రావడం వల్ల మా మధ్య కాంపిటీషన్ సృష్టించారు. కానీ నేను ఎప్పుడు కూడా చిరంజీవికి పోటీ అని ఫీల్ అవ్వలేదు. డ్యాన్సులు, ఫైట్స్ చిరంజీవిగారు అద్భుతంగా చేస్తారు. అందులో అనుమానం లేదు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజతో జరిగిన ఇంటర్వ్యూలో సుమన్ ఈ విషయాలు వివరించారు. 

45
చిరంజీవి డ్యాన్స్ చూడరా అని సుమన్ కి చెప్పిన డైరెక్టర్
Image Credit : Facebook / Megastar Chiranjeevi

చిరంజీవి డ్యాన్స్ చూడరా అని సుమన్ కి చెప్పిన డైరెక్టర్

తమ్మారెడ్డి, సుమన్ కాంబినేషన్ లో కొన్ని చిత్రాలు వచ్చాయి. ఆ టైంలో తమ్మారెడ్డి గారే తనతో.. చిరంజీవి డ్యాన్స్ చూడరా, ఆ ఫుట్ మూమెంట్ గమనించు అని చెప్పేవారని సుమన్ గుర్తు చేసుకున్నారు. చిరంజీవిని మించిపోవాలని నేను ఎప్పుడూ ప్రయత్నించలేదు. కనీసం ఆయన లెవల్ కి మ్యాచ్ అయ్యేలా ఉండాలని ట్రై చేసినట్లు సుమన్ తెలిపారు. ఇప్పటికి కూడా డ్యాన్స్ లో చిరంజీవి ఫుట్ వర్క్ , గ్రేస్ ఉన్నట్లు ఇంకెవరికీ ఉండదు అని సుమన్ ప్రశంసించారు. 

55
అది నా అదృష్టం
Image Credit : Facebook/Suman

అది నా అదృష్టం

నాకు మొదట్లో తెలుగు భాష రాదు. కానీ కష్టపడి నేర్చుకున్నా. తెలుగులోనే 100 సినిమాల్లో హీరోగా నటించానంటే మామూలు విషయం కాదని సుమన్ అన్నారు. ఆ తర్వాత క్యారెక్టర్ రోల్స్ చేస్తున్నప్పుడు అన్నమయ్య చిత్రంలో వెంకటేశ్వర స్వామి పాత్ర,శ్రీరామదాసులో రాముడి పాత్ర చేయడం తన అదృష్టం అని సుమన్ అన్నారు. 

About the Author

TD
Tirumala Dornala
ఏడేళ్లుగా డిజిటల్, వెబ్ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా సినిమా, ఎంటర్టైన్మెంట్ విభాగాల్లో పని చేసిన అనుభవం ఉంది. గతంలో కొన్ని మీడియా సంస్థల్లో సబ్ ఎడిటర్ గా రాణించారు. ప్రస్తుతం 2021 నుంచి ఏసియా నెట్ లో ఎంటర్టైన్మెంట్ విభాగంలో సీనియర్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. సినిమాకి సంబంధించిన వార్తలు, విశ్లేషణలు అందించడంలో అనుభవం ఉంది.
తెలుగు సినిమా
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Illu Illalu Pillalu Today Episode Feb 13: రామరాజు ఇంట్లో రోజుకో పంచాయితీ, ఈసారి ప్రేమ ఎస్ఐ పరీక్ష గురించి..
Recommended image2
రామ్ చరణ్ , ఉపాసన తమ కవల పిల్లలకు పెట్టిన పేర్లు ఏంటో తెలుసా? నిజం ఎంత?
Recommended image3
Gunde Ninda Gudi Gantalu: రవి లైఫ్ లోకి మరో అమ్మాయి, శ్రుతికి పోటీ..మీనా తమ్ముడు తెచ్చిన మరో తంటా
Related Stories
Recommended image1
కొత్తగా ప్రయత్నించిన చిరు, ఆ మూవీ కలెక్షన్స్ చూసి కృష్ణ ఏమన్నారో తెలుసా.. మెగాస్టార్ ఫుల్ హ్యాపీ
Recommended image2
ఆ వంశంలో 63వ తరం వీరుడిగా మహేష్.. రాజమౌళి మూవీ టైటిల్ లీక్, స్టోరీ కూడా వైరల్ ?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved