Washington Sundar: లార్డ్స్‌లో వాషింగ్టన్ సుందర్ దుమ్మురేపాడు
Washington Sundar: లార్డ్స్ టెస్టులో వాషింగ్టన్ సుందర్ అద్భుతమైన బౌలింగ్ తో రెండో ఇన్నింగ్స్ లో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాడు. వాషింగ్టన్ సుందర్ కు తోడుగా బుమ్రా, సిరాజ్ రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది.

వాషింగ్టన్ సుందర్ విజృంభణ
లార్డ్స్ మైదానంలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ మూడవ టెస్టు నాలుగో రోజు భారత్ పట్టు బిగించింది. భారత్‌కు విజయం కోసం 193 పరుగుల లక్ష్యం ఉంచింది ఇంగ్లాండ్. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శనతో మ్యాచును భారత్ వైపు తిప్పేశాడు.
వాషింగ్టన్ సుందర్ తో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ రెచ్చిపోవడంతో ఇంగ్లాండ్ 192 పరుగులకే ఆలౌట్ అయింది.
ఇంగ్లాండ్‌ను రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 192 పరుగులకే ఆలౌట్
ఇంగ్లాండ్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 192 పరుగులకే ఆలౌటైంది. మొదటి ఇన్నింగ్స్‌లో ఇరు జట్లు 387 పరుగులు సాధించగా, మ్యాచ్ సమంగా కొనసాగింది. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లు కలిసి కట్టుగా రాణించడంతో పై చేయి సాధించింది. విజయానికి భారత్ ముందు ఈజీ టార్గెట్ ఉంది.
స్పిన్‌తో వాషింగ్టన్ సుందర్ స్పెషల్ షో
భారత బౌలింగ్ దళంలో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ అద్భుత ప్రదర్శన చేశాడు. 12.1 ఓవర్లలో కేవలం 22 పరుగులు ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. అతని వికెట్లలో జో రూట్ (40), బెన్ స్టోక్స్ (33), జేమీ స్మిత్ (8), షోయబ్ బషీర్ (0) లు ఉన్నారు.
లార్డ్స్ లాంటి ఫాస్ట్ పిచ్‌పై ఒక స్పిన్నర్ నాలుగు వికెట్లతో అదరగొట్టి అందరినీ ఆశ్చర్య పరిచాడు. మ్యాచ్‌కు ముందు అతని ఎంపికపై కొన్ని విమర్శలు వచ్చినా, ఆటలో మాత్రం సుందర్ తను జట్టుకు ఎందుకు ముఖ్యమూ నిరూపించుకున్నాడు.
ఇంగ్లాండ్ బ్యాటింగ్ లో జో రూట్ టాప్ స్కోరర్
ఇంగ్లాండ్ బ్యాటింగ్‌లో జో రూట్ 40 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అతను మొదటి ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన ప్లేయర్. రెండో ఇన్నింగ్స్ లో కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. కెప్టెన్ బెన్ స్టోక్స్ 33 పరుగులు చేయగా, హ్యారీ బ్రూక్ (23), జాక్ క్రాలీ (22), బెన్ డకెట్ (12), క్రిస్ వోక్స్ (10) మాత్రమే డబుల్ డిజిట్ స్కోరు సాధించారు. మిగతా ఆటగాళ్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు.
బుమ్రా, సిరాజ్ అదరగొట్టారు
సుందర్‌తో పాటు జస్ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్ కూడా బౌలింగ్ లో అదరగొట్టారు. చెరో రెండు వికెట్లు తీశారు. యువ ఫాస్ట్ బౌలర్ ఆకాశ్ దీప్‌కు ఒక వికెట్ లభించింది. భారత బౌలింగ్ దళం సమిష్టిగా అద్భుత ప్రదర్శన చేయడంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ పూర్తిగా కుప్పకూలింది.
Innings Break!
Outstanding bowling display from #TeamIndia! 👏 👏
4⃣ wickets for Washington Sundar
2⃣ wickets each for Mohammed Siraj & Jasprit Bumrah
1⃣ wicket each for Akash Deep & Nitish Kumar Reddy
India need 193 runs to win!
Updates ▶️ https://t.co/X4xIDiSmBg… pic.twitter.com/1BRhfPzynv— BCCI (@BCCI) July 13, 2025