MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • ధోనీ రికార్డు బద్దలుకొట్టిన సంజూ శాంసన్

ధోనీ రికార్డు బద్దలుకొట్టిన సంజూ శాంసన్

Sanju Samson breaks Dhoni's record: ఆసియా కప్ 2025 లో ఒమన్‌ తో జరిగిన మ్యాచ్ లో సంజూ శాంసన్ హాఫ్ సెంచరీ నాక్ తో మెరిశాడు. ఈ క్రమంలోనే లెజెండరీ ప్లేయర్ ఎంఎస్ ధోని రికార్డును సంజూ బద్దలు కొట్టాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 20 2025, 06:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఒమన్‌పై హాఫ్ సెంచరీతో మెరిసిన సంజూ శాంసన్
Image Credit : Getty

ఒమన్‌పై హాఫ్ సెంచరీతో మెరిసిన సంజూ శాంసన్

ఆసియా కప్ 2025 గ్రూప్ దశలో ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన కనబరిచాడు. మూడో స్థానంలో క్రీజ్‌లోకి వచ్చిన సంజూ.. కేవలం 45 బంతుల్లోనే 56 పరుగులు నాక్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో మూడు బౌండరీలు, మూడు సిక్సర్లు బాదాడు. 

సంజూ కీలక నాక్ తో భారత్ 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. టార్గెట్ ను అందుకునే క్రమంలో ఒమన్ 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 167 పరుగులకే పరిమితమైంది. ఫలితంగా భారత్ 21 పరుగుల తేడాతో విజయం సాధించింది.

25
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సంజూ శాంసన్
Image Credit : ANI

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా సంజూ శాంసన్

అద్భుతమైన బ్యాటింగ్ తో మెరిసిన సంజూ శాంసన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. దీంతో టీ20 ఫార్మాట్‌లో మూడు సార్లు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు గెలిచిన తొలి భారత వికెట్ కీపర్‌గా సంజూ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకు దినేశ్ కార్తీక్, ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ ఒక్కసారి మాత్రమే టీ20 క్రికెట్ లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నారు.

Related Articles

Related image1
భారత్ vs ఒమన్: ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించిన హార్దిక్ పాండ్యా
Related image2
స్టార్ బౌలర్లు అవుట్.. సూపర్ 4లో పాకిస్తాన్ తో తలపడే భారత జట్టు ఇదే
35
ధోనీ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్
Image Credit : Getty

ధోనీ రికార్డును బ్రేక్ చేసిన సంజూ శాంసన్

ఒమన్ తో జరిగిన ఈ మ్యాచ్‌లో సంజూ శాంసన్ మరో అరుదైన రికార్డు సృష్టించాడు. టీ20 క్రికెట్‌లో ఎక్కువ సిక్సర్లు బాదిన భారత ఆటగాళ్ల జాబితాలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని అధిగమించాడు. 

సంజూ శాంసన్ ఇప్పటివరకు 307 మ్యాచ్‌ల్లో 353 సిక్సర్లు బాదాడు. ఇక ఎంఎస్ ధోని 405 మ్యాచ్‌ల్లో 350 సిక్సర్లు మాత్రమే బాదాడు. ఈ రికార్డుతో సంజూ శాంసన్ ఈ లిస్టులో నాల్గోస్థానంలోకి చేరాడు.

45
టీ20 అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు వీరే
Image Credit : ANI

టీ20 అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్లు వీరే

టీ20 క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్ల జాబితాలో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ అగ్రస్థానంలో ఉన్నాడు. అతను 463 మ్యాచ్‌లలో 547 సిక్సర్లు బాదాడు. రెండో స్థానంలో విరాట్ కోహ్లీ ఉన్నాడు. ఆయన 414 మ్యాచ్‌లలో 435 సిక్సర్లు బాదాడు. మూడో స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. ఆయన 328 మ్యాచ్‌ల్లో 328 సిక్సర్లు బాదాడు. సూర్య తర్వాత సంజూ శాంసన్ ఉన్నాడు.

55
ఆసియా కప్ సూపర్ 4 లో పాకిస్తాన్ తో భారత్ బిగ్ ఫైట్
Image Credit : ANI

ఆసియా కప్ సూపర్ 4 లో పాకిస్తాన్ తో భారత్ బిగ్ ఫైట్

ఒమన్‌పై విజయంతో భారత్ ఆసియా కప్ 2025లో గ్రూప్ ఏ లో వరుసగా మూడు విజయాలు సాధించింది. దీంతో గ్రూప్ ఏ లో టాప్ లో నిలిచి ఆసియా కప్ 2025 సూపర్ 4 దశలోకి అడుగుపెట్టింది. 

సెప్టెంబర్ 21న జరగనున్న మ్యాచ్‌లో పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది. లీగ్ దశలో భారత్ పాకిస్తాన్ జట్లు ఒకసారి పోటీ పడ్డాయి. పాక్ ను టీమిండియా చిత్తుగా ఓడించింది. మరోసారి అదే రిపీట్ చేయాలని వ్యూహాలు సిద్ధం చేసుకుంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఆసియా కప్ 2025
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
IND vs PAK : బాయ్‌కాట్ లేదు.. బొక్కా లేదు.. గ్రౌండ్‌లోకి రావాల్సిందే ! పాక్ యూటర్న్
Recommended image2
BCCI Central Contracts : డబ్బులు కట్.. గ్రేడ్ కట్.. రోహిత్, కోహ్లీలకు బీసీసీఐ ఊహించని దెబ్బ
Recommended image3
Cricket Unique Records : వన్డేలో 404 పరుగులు.. 50 ఫోర్లు, 22 సిక్సర్లతో విధ్వంసం
Related Stories
Recommended image1
భారత్ vs ఒమన్: ఓడిపోయే మ్యాచ్ ను గెలిపించిన హార్దిక్ పాండ్యా
Recommended image2
స్టార్ బౌలర్లు అవుట్.. సూపర్ 4లో పాకిస్తాన్ తో తలపడే భారత జట్టు ఇదే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved