MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • Joe Root: జో రూట్ సెంచరీల సునామీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ‌ద్ద‌లు

Joe Root: జో రూట్ సెంచరీల సునామీ.. సచిన్ టెండూల్కర్ రికార్డు బ‌ద్ద‌లు

Joe Root: జో రూట్ తన 38వ టెస్టు సెంచరీతో సచిన్ టెండూల్కర్‌ను అధిగమించాడు. టెస్టు చరిత్రలో రెండో అత్యధిక పరుగుల ఆటగాడిగా కూడా రికార్డు సాధించాడు.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jul 25 2025, 11:59 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
జోరూట్ సెంచరీల జోరు
Image Credit : Getty

జోరూట్ సెంచరీల జోరు

మాంచెస్టర్‌లో జరుగుతున్న భారత్ vs ఇంగ్లాండ్ నాలుగో టెస్టులో జో రూట్ తన 38వ టెస్టు సెంచరీ సాధించి చరిత్రను తిరగరాశాడు. భారత్‌పై ఆతిథ్య జట్టు ఆధిపత్యం కొనసాగించిన మూడో రోజు, రూట్ తన అత్యుత్తమ బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. 

120 పరుగులు పూర్తి చేసిన క్ర‌మంలో జో రూట్.. రికీ పాంటింగ్ టెస్టు పరుగుల రికార్డును అధిగమించాడు. దీంతో టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానానికి చేరుకున్నాడు. టాప్ లో సచిన్ టెండూల్కర్ ఉన్నారు.

25
హోం టెస్ట్ సెంచరీల పరంగా సచిన్‌ను అధిగమించిన జో రూట్
Image Credit : ANI

హోం టెస్ట్ సెంచరీల పరంగా సచిన్‌ను అధిగమించిన జో రూట్

ఈ సెంచరీ రూట్‌కు ఇంగ్లాండ్ గడ్డపై 23వ టెస్టు సెంచ‌రీ కావ‌డం విశేషం. దీంతో టెస్టు చరిత్రలో అత్యధిక హోం సెంచరీల పరంగా సచిన్ టెండూల్కర్ (22 సెంచరీలు), కుమార్ సంగక్కరలను జోరూట్ అధిగమించాడు. ప్రస్తుతం జో రూట్ 23 హోం సెంచరీలతో మాహేళ జయవర్ధనె, జాక్ కాలిస్, రికీ పాంటింగ్‌తో సమానంగా ఉన్నాడు.

అత్యధిక హోం టెస్ట్ సెంచరీలు కొట్టిన టాప్ 5 ప్లేయ‌ర్లు

  • జో రూట్ – 23 (84 మ్యాచులు)
  • మాహేళ జయవర్ధనె – 23 (81)
  • జాక్ కాలిస్ – 23 (88)
  • రికీ పాంటింగ్ – 23 (92)
  • సచిన్ టెండూల్కర్ – 22 (94)

Related Articles

Related image1
India vs England: 10 ఏళ్ల తర్వాత భారత్ చెత్త రికార్డు
Related image2
India UK Trade Deal: ధరలు తగ్గుతాయ్.. మందుబాబుల‌కు గుడ్ న్యూస్.. కార్ ల‌వ‌ర్స్ కు పండ‌గే !
35
జోరూట్ ఖాతాలో భారత్‌పై అత్యధిక సెంచరీల రికార్డు
Image Credit : Getty

జోరూట్ ఖాతాలో భారత్‌పై అత్యధిక సెంచరీల రికార్డు

జో రూట్ తన 12వ టెస్టు సెంచరీతో భారత్‌పై అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో కూడా చోటు సంపాదించాడు. అలాగే, స్టీవ్ స్మిత్ 11 సెంచరీల రికార్డును అధిగమించాడు.

ఒకే ప్రత్యర్థిపై అత్యధిక టెస్టు సెంచరీలు

  • డాన్ బ్రాడ్‌మన్ – 19 (vs ఇంగ్లాండ్)
  • సునీల్ గవాస్కర్ – 13 (vs వెస్టిండీస్)
  • జాక్ హాబ్స్ – 12 (vs ఆస్ట్రేలియా)
  • స్టీవ్ స్మిత్ – 12 (vs ఇంగ్లాండ్)
  • జో రూట్ – 12 (vs ఇండియా)

డాన్ బ్రాడ్‌మన్ హోం గ్రౌండ్‌లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక సెంచరీల రికార్డును కూడా రూట్ అధిగమించాడు. బ్రాడ్‌మన్ ఇంగ్లాండ్‌పై 8 హోం సెంచరీలు చేయ‌గా, రూట్ భారత్‌పై 9 హోం సెంచరీలు కొట్టాడు.

45
ద్రావిడ్, కాలిస్‌ను అధిగమించిన జో రూట్
Image Credit : Getty

ద్రావిడ్, కాలిస్‌ను అధిగమించిన జో రూట్

ఈ మ్యాచ్‌కు ముందు జో రూట్ 13,259 పరుగులతో టెస్టు అత్య‌ధిక ప‌రుగుల లిస్టులో మూడవ స్థానంలో ఉన్నాడు. మూడవ రోజున ఆరంభ గంటలోనే 31 పరుగులు చేయడంతో రాహుల్ ద్రావిడ్ (13,288 ప‌రుగులు), జాక్ కాలిస్ (13,289) రికార్డులను అధిగమించాడు.

జో రూట్ ప్రస్తుతం 13,379 పరుగులతో రికీ పాంటింగ్‌ను కూడా వెనక్కి నెట్టాడు. సచిన్ టెండూల్కర్ (15,921) తర్వాత అత్య‌ధిక ప‌రుగులు చేసిన ప్లేయ‌ర్ గా కొనసాగుతున్నాడు.

55
అత్యధిక టెస్టు పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు
Image Credit : Getty

అత్యధిక టెస్టు పరుగులు చేసిన టాప్ 5 ఆటగాళ్లు

1. సచిన్ టెండూల్కర్ – 15,921

2. జో రూట్ – 13,379*

3. రికీ పాంటింగ్ – 13,378

4. జాక్ కాలిస్ – 13,289

5. రాహుల్ ద్రావిడ్ – 13,288

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?
Recommended image2
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Recommended image3
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Related Stories
Recommended image1
India vs England: 10 ఏళ్ల తర్వాత భారత్ చెత్త రికార్డు
Recommended image2
India UK Trade Deal: ధరలు తగ్గుతాయ్.. మందుబాబుల‌కు గుడ్ న్యూస్.. కార్ ల‌వ‌ర్స్ కు పండ‌గే !
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved