MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • IND vs PAK: కాలిన‌ట్లుంది.. ఓట‌మిని త‌ట్టుకోలేక పాక్ కెప్టెన్ ఏం చేశాడో చూశారా.? వైరల్ వీడియో

IND vs PAK: కాలిన‌ట్లుంది.. ఓట‌మిని త‌ట్టుకోలేక పాక్ కెప్టెన్ ఏం చేశాడో చూశారా.? వైరల్ వీడియో

IND vs PAK: ఆసియా క‌ప్‌లో భార‌త్ అద్భుత విజ‌యాన్ని అందుకుంది. ఐదు వికెట్ల తేడాతో గెలిచి స‌రికొత్త చ‌రిత్ర సృష్టించింది. ఇక ప‌హ‌ల్గామ్ దాడి త‌ర్వాత రెండు దేశాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త వాతావ‌ర‌ణం స్టేడియంలోనూ క‌నిపించింది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Sep 29 2025, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
9వ సారి ఆసియా క‌ప్ విజేత‌గా
Image Credit : X/@sony_tark_

9వ సారి ఆసియా క‌ప్ విజేత‌గా

2025 ఆసియా కప్ ఫైనల్‌లో టీం ఇండియా పాకిస్థాన్‌పై ఐదు వికెట్ల తేడాతో గెలిచి చరిత్ర సృష్టించింది. భార‌త్ ఆసియా క‌ప్‌ను సొంతం చేసుకోవ‌డం ఇది 9వ సారి కావ‌డం విశేషం. టోర్నమెంట్ అంతా పాకిస్థాన్ ఆటగాళ్లు నిరాశకు గురయ్యారు. ప్రతి మ్యాచ్‌లో భారత్ చేతిలో ఓడిపోవడం వారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసింది. ఫైనల్లో కూడా ఆ ఒత్తిడి స్పష్టంగా కనిపించింది.

25
రన్నరప్ చెక్‌ను విసిరేసిన పాక్ కెప్టెన్
Image Credit : 𝙸𝚝𝚊𝚌𝚑𝚒/X

రన్నరప్ చెక్‌ను విసిరేసిన పాక్ కెప్టెన్

మ్యాచ్ అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవంలో పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘా తన కోపాన్ని దాచలేకపోయాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) ప్రతినిధి అమీనుల్ ఇస్లాం చేతిలో నుంచి రన్నరప్ చెక్కును తీసుకున్నా, వెంటనే తిరిగి దానిని నేలపైకి విసిరేశాడు. ఈ ఘటన చూసి ప్రేక్షకులు బిగ్గరగా కేకలు వేశారు. ఆఘా ప్రవర్తన పాకిస్థాన్ జట్టు పరిస్థితిని స్పష్టంగా తెలిపింది.

Salman agha gadiki ekkado kalinattu vundi lucha gadu🤣🤣🤣 #INDvPAKpic.twitter.com/GkEn7deKZj

— 𝙸𝚝𝚊𝚌𝚑𝚒 ❟❛❟ (@itachiistan1) September 28, 2025

Related Articles

Related image1
Viral Video: న‌వ్వి, న‌వ్వి పొట్ట చెక్క‌లైతే మాకు సంబంధం లేదు.. వైర‌ల్ అవుతోన్న వీడియో
Related image2
Projector: రూ. 6 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. అమెజాన్‌లో 73 శాతం డిస్కౌంట్‌
35
ఓటమిపై సల్మాన్ అఘా స్పందన
Image Credit : X/@airnewsalerts

ఓటమిపై సల్మాన్ అఘా స్పందన

తన జట్టు ప్రదర్శనపై నిరాశ వ్యక్తం చేస్తూ సల్మాన్ అఘా మీడియాతో మాట్లాడిన ఆయ‌న.. "ఇప్పుడు ఈ ఓటమిని జీర్ణించుకోవడం చాలా కష్టం. బ్యాటింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ మేము ఆశించిన స్థాయిలో ఆడలేకపోయాం. అందుకే ఫలితం మాకు అనుకూలంగా రాలేదు" అని చెప్పాడు. ఫైనల్లో ఓటమి తట్టుకోలేకపోయిన అతని ప్రవర్తన అభిమానుల్లో చర్చనీయాంశమైంది.

45
ట్రోఫీని తిర‌స్క‌రించిన‌ భారత్ కెప్టెన్
Image Credit : X/LoyalSachinFan

ట్రోఫీని తిర‌స్క‌రించిన‌ భారత్ కెప్టెన్

భారత్ విజేతగా నిలిచినా, ట్రోఫీని స్వీకరించడం చుట్టూ వివాదం చెలరేగింది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడు, పాకిస్థాన్ హోం మంత్రి మొహ్సిన్ నఖ్వీ నుంచి ట్రోఫీని తీసుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. దీనిపై కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ.. "గెలిచిన జట్టు గుర్తుండిపోతుంది, ట్రోఫీ కాదు. నాకు నిజమైన ట్రోఫీ నా ఆటగాళ్లు మాత్ర‌మే" అని స్పష్టం చేశాడు.

55
ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణంలోనే
Image Credit : XBCCI

ఉద్రిక్త‌త వాతావ‌ర‌ణంలోనే

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ కారణంగా టోర్నమెంట్ మొత్తం భారత్-పాక్ జట్ల మధ్య ఉద్రిక్తతలు అధికంగా ఉన్నాయి. టోర్నమెంట్‌లో భారత్ పాకిస్థాన్‌తో మూడు మ్యాచ్‌లు ఆడి మూడింటినీ గెలిచింది. మ్యాచ్‌లలో కరచాలనం చేయకపోవడం ద్వారా కూడా భారత జట్టు తమ ధోరణిని స్పష్టం చేసింది. మొత్తం పాకిస్థాన్‌కు టీమిండియా స‌రైన బుద్ధి చెప్పిందంటూ ఫ్యాన్స్ సోష‌ల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
క్రీడలు
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
Arjun Tendulkar Wedding : అర్జున్ టెండూల్కర్ పెళ్లి.. మోదీ ఇంటికి సచిన్.. డేట్, వెన్యూ డీటెయిల్స్ ఇవే
Recommended image2
దబాంగ్.. దబాంగ్.. దొబ్బేయ్.. దొబ్బేయ్.. PCBకి ఇచ్చిపడేసిన ఐసీసీ, బీసీసీఐ..
Recommended image3
ఆ ఒక్క ఇన్నింగ్స్‌లోనే స్కైలో ఇద్దరు దిగ్గజ ప్లేయర్స్ కనిపించారు.. వారెవరంటే.?
Related Stories
Recommended image1
Viral Video: న‌వ్వి, న‌వ్వి పొట్ట చెక్క‌లైతే మాకు సంబంధం లేదు.. వైర‌ల్ అవుతోన్న వీడియో
Recommended image2
Projector: రూ. 6 వేల‌తో మీ ఇంటిని థియేట‌ర్‌గా మార్చేయండి.. అమెజాన్‌లో 73 శాతం డిస్కౌంట్‌
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved