MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • టీమిండియాలో మూడు ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్.. టీ20 ప్రపంచకప్ ముందు గంభీర్ బిగ్ ప్లాన్

టీమిండియాలో మూడు ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్.. టీ20 ప్రపంచకప్ ముందు గంభీర్ బిగ్ ప్లాన్

Gautam Gambhir Big plan: టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమిండియాలో పెద్ద మార్పులు చేయడానికి కోచ్ గౌతమ్ గంభీర్ సన్నాహాలు చేస్తున్నారు. ఇందులో మూడు ఫార్మాట్లకూ ఒకే కెప్టెన్ ప్రణాళిక కూడా ఉంది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Aug 17 2025, 08:06 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
టీ ప్రపంచకప్ ముందు గంభీర్ పెద్ద ప్లాన్
Image Credit : Getty

టీ ప్రపంచకప్ ముందు గంభీర్ పెద్ద ప్లాన్

2026లో భారత్, శ్రీలంకలలో జరగనున్న టీ20 ప్రపంచకప్‌కు ముందు టీమిండియా టీ20 జట్టులో పెద్ద ఎత్తున మార్పులు తీసుకురావడానికి ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్ సన్నాహాలు చేస్తున్నారు. ఐపీఎల్‌లో కెప్టెన్‌గా, మెంటార్‌గా, కోచ్‌గా పనిచేసిన అనుభవం ఆధారంగా గంభీర్ భారత టీ20 జట్టును రీబ్రాండ్ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం.

ఆసియా కప్, ఆ తర్వాత జరిగే ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్‌లలో కొత్త విధానం ప్రకారం ఆటగాళ్లను ఎంపిక చేసే అవకాశం ఉందని ప‌లు రిపోర్టులు పేర్కొంటున్నాయి. ఇప్పుడు భార‌త క్రికెట్ స‌ర్కిల్ లో కూడా ఇదే హాట్ టాపిక్ గా మారింది.

DID YOU
KNOW
?
టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా రికార్డు
భారత జట్టు ఇప్పటివరకు రెండు సార్లు టీ20 ప్రపంచకప్ గెలుచుకుంది. 2007లో ధోనీ సారథ్యంలో పాకిస్తాన్‌పై విజయం సాధించగా, 2024లో రోహిత్ శర్మ నాయకత్వంలో దక్షిణాఫ్రికాపై గెలిచి భారత్ రెండోసారి టైటిల్‌ను అందుకుంది.
25
భార‌త జ‌ట్టు మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్
Image Credit : Getty

భార‌త జ‌ట్టు మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్

గంభీర్ కోచ్‌గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచే మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ ఉండే విధానాన్ని ప్రవేశపెట్టాలని ప్రయత్నిస్తున్నట్లు స‌మాచారం. తాజాగా ప‌లు రిపోర్టులు సైతం ఇదే విష‌యాన్ని వెల్ల‌డించాయి. ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో రోహిత్ శర్మ కెప్టెన్‌గా కొనసాగుతున్నారు. గిల్ టెస్టు కెప్టెన్ గా ఉండ‌గా, సూర్య కుమార్ యాద‌వ్ భార‌త టీ20 జ‌ట్టుకు కెప్టెన్ గా ఉన్నారు.

ఆసియా కప్ ముగిసిన తర్వాత శుభ్ మ‌న్ గిల్‌ను టీ20 జట్టు కెప్టెన్‌గా ప్రకటించే అవకాశం ఉందని స‌మాచారం. దీంతో సూర్యకుమార్ యాదవ్ స్థానంలో గిల్ కొత్త నాయకత్వం చేపట్టవచ్చని సూచనలు వెలువడుతున్నాయి.

Related Articles

Related image1
సెలక్షన్ కమిటీకి కొత్త తలనొప్పి.. ఆసియా కప్ 2025 భారత జట్టులో ఉండేది ఎవరు?
Related image2
ప్రపంచ కప్‌లో పరుగుల వరద పారించిన టాప్ 5 భారత మహిళా క్రికెటర్లు
35
భార‌త జ‌ట్టులో ఫినిషర్ రోల్‌కి వీడ్కోలు
Image Credit : ANI

భార‌త జ‌ట్టులో ఫినిషర్ రోల్‌కి వీడ్కోలు

భార‌త జట్టులో ఇకపై ప్రత్యేక ఫినిషర్ పాత్ర ఉండదని సమాచారం. ప్రతి ఆటగాడికి తన ప్రతిభను బట్టి పాత్ర ఇవ్వాలని గంభీర్ నిర్ణయించుకున్నారని సంబంధిత క్రికెట్ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

శివమ్ దుబే లాంటి బ్యాట్స్‌మెన్‌ను కేవలం ఫినిషర్ పాత్రలో మాత్రమే పరిమితం చేయకుండా, అవసరమైతే ముందుగానే బ్యాటింగ్ ఆర్డర్‌లోకి పంపే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆసియా కప్ నుంచే ఈ మార్పులు ప్రారంభం కావచ్చని సమాచారం.

45
సూర్యకుమార్ కెప్టెన్సీ భవిష్యత్తు ఏంటి?
Image Credit : Getty

సూర్యకుమార్ కెప్టెన్సీ భవిష్యత్తు ఏంటి?

గత ఏడాది ప్రపంచకప్ తర్వాత రోహిత్ శర్మ టీ20 నుంచి రిటైర్ కావడంతో సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్సీ వచ్చింది. అతని నాయకత్వంలో భారత్ 22 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించింది.

అయితే, అన్ని ఫార్మాట్లకు ఒకే కెప్టెన్ విధానం అమలు చేస్తే టీ20లలో మాత్రమే ఆడుతున్న సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీ కోల్పోయే అవకాశముంది. ఆసియా కప్‌కి ముందు ఫిట్‌నెస్ టెస్ట్ పాస్ అయితే సూర్యకుమార్ తిరిగి కెప్టెన్‌గా కొనసాగుతారని అంచనాలు ఉన్నా, మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ప్ర‌స్తుతం సూర్య కుమార్ యాద‌వ్ ఫిట్ గా ఉన్నారు.. ఆసియా క‌ప్ లో 2025 భార‌త జ‌ట్టును ముందుకు న‌డిపిస్తారని బీసీసీఐ వ‌ర్గాలు పేర్కొంటున్నాయి.

55
భార‌త జ‌ట్టులో కొత్త ఆటగాళ్లకు మ‌రిన్ని అవకాశాలు
Image Credit : Getty

భార‌త జ‌ట్టులో కొత్త ఆటగాళ్లకు మ‌రిన్ని అవకాశాలు

టీ20 ఫార్మాట్‌కి ప్రత్యేకంగా తగిన ఆటగాళ్లను గుర్తించి వారికి నిరంతరం అవకాశాలు ఇవ్వాలని గంభీర్ భావిస్తున్నారని రిపోర్టులు వెల్లడించాయి. ఐపీఎల్‌లో మెరుపులు మెరిపించిన బ్యాట్స్‌మెన్, బౌలర్లకు ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది.

ఆసియా కప్‌లో సూర్యకుమార్ యాదవ్ జట్టుని నడిపించే అవకాశం ఉండ‌గా, శుభ్ మ‌న్ గిల్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్ల ఎంపిక ఎలా ఉండబోతుందనేది ఉత్కంఠగా మారింది. గిల్ టీ20 జట్టులో ఉంటే బ్యాటింగ్ కాంబినేషన్‌లో మార్పులు వచ్చే అవకాశం ఉంది. సూప‌ర్ ఫామ్ లో ఉన్న జైస్వాల్ వ‌చ్చినా బ్యాటింగ్ ఆర్డ‌ర్ లో మార్పులు ఉంటాయి.

మొత్తంగా గంభీర్ ఆధ్వర్యంలో టీమిండియాలో పెద్ద మార్పులు జరుగనున్నాయని సంకేతాలు స్పష్టమవుతున్నాయి. 2026 ప్రపంచకప్‌కు ముందు టీ20 జట్టులోనే కాకుండా, మూడు ఫార్మాట్లలోనూ ఒకే కెప్టెన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా కొత్త దిశలో అడుగులు వేయనున్నట్లు భార‌త‌ క్రికెట్ స‌ర్కిల్ లో టాక్ బ‌లంగానే వినిపిస్తోంది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
క్రికెట్
క్రీడలు
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
శుభ్‌మన్ గిల్
రోహిత్ శర్మ

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?
Recommended image2
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Recommended image3
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Related Stories
Recommended image1
సెలక్షన్ కమిటీకి కొత్త తలనొప్పి.. ఆసియా కప్ 2025 భారత జట్టులో ఉండేది ఎవరు?
Recommended image2
ప్రపంచ కప్‌లో పరుగుల వరద పారించిన టాప్ 5 భారత మహిళా క్రికెటర్లు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved