MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Sports
  • Cricket
  • India vs England: 5 సెంచరీలు కొట్టినా ఓడిన భారత్

India vs England: 5 సెంచరీలు కొట్టినా ఓడిన భారత్

India vs England: భారత్ ఉంచిన 371 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ 5 వికెట్లు మాత్రమే కోల్పోయి చేధించింది. దీంతో బెన్ స్టోక్స్ టీమ్ ఐదు మ్యాచ్ ల టెస్ట్ సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది.

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jun 24 2025, 11:37 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
లీడ్స్ టెస్టులో భారత్ కు బిగ్ షాక్.. 5 వికెట్లతో ఇంగ్లాండ్ గెలుపు
Image Credit : social media

లీడ్స్ టెస్టులో భారత్ కు బిగ్ షాక్.. 5 వికెట్లతో ఇంగ్లాండ్ గెలుపు

India vs England : లీడ్స్‌లోని హెడ్డింగ్లీ మైదానంలో ముగిసిన తొలి టెస్టులో భారత్ కు బిగ్ షాక్ తగిలింది. ఐదు సెంచరీలు కొట్టినా భారత్ విజయాన్ని అందుకోలేకపోయింది. భారత్ ఉంచిన 371 పరుగుల భారీ లక్ష్యాన్ని ఇంగ్లాండ్ కేవలం 5 వికెట్లు కోల్పోయి చేధించింది. దీంతో ఐదు టెస్టుల సిరీస్‌ను 1-0తో ప్రారంభించింది. భారత జట్టు ఓటమిలో ఫీల్డింగ్ తప్పిదాలు, బౌలింగ్ పనిచేయకపోవడం, టాపార్డర్ బ్యాటింగ్ లో రాణించినా టెయిలెండర్లు రాణించకపోవడంతో భారత్ ఓటమిని నుంచి తప్పించుకోలేకపోయింది. 

26
భారత్ తొలి ఇన్నింగ్స్: మూడు సెంచరీలతో 471 పరుగులు
Image Credit : social media

భారత్ తొలి ఇన్నింగ్స్: మూడు సెంచరీలతో 471 పరుగులు

టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్, భారత్‌కు బ్యాటింగ్ ఆఫర్ చేశాడు. దీంతో మొదట బ్యాటింగ్ కు దిగిన కెప్టెన్ శభ్ మన్ గిల్ నేతృత్వంలోని భారత జట్టుకు మెరుగైన ఆరంభం లభించింది. యశస్వి జైస్వాల్ (101 పరగులు), శుభ్ మన్ గిల్ (147 పరుగులు), రిషభ్ పంత్ (134 పరుగులు) సెంచరీలు కొట్టారు.

మొదటి వికెట్‌కు కేఎల్ రాహుల్ (42 పరుగులు) - యశస్వి జైస్వాల్ మధ్య 91 పరుగుల భాగస్వామ్యం నిలిచింది. కానీ మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ పరుగులు చేయడంలో విఫలమైంది. డెబ్యూట్ చేస్తున్న సాయి సుదర్శన్ డకౌట్ కాగా, జడేజా 11, శార్దూల్, ప్రసిద్ధ్ ఒక్కో పరుగు మాత్రమే చేశారు. కరుణ్ నాయర్ నిరాశపరిచాడు. జోష్ టంగ్, బెన్ స్టోక్స్ ఇద్దరు చెరో నాలుగు వికెట్లు తీశారు.

Related Articles

Related image1
ENG vs IND: మొద‌లైన తొలి టెస్ట్‌.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌. సిరీస్‌ ఎవ‌రు గెలుస్తారో ముందే చెప్పేసిన స‌చిన్
Related image2
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టులో ప్లేయర్లు ఎందుకు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు కట్టుకున్నారు?
36
ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: ఓలీ పోప్ సెంచరీ.. బుమ్రాకు ఐదు వికెట్లు
Image Credit : ANI

ఇంగ్లాండ్ ఫస్ట్ ఇన్నింగ్స్: ఓలీ పోప్ సెంచరీ.. బుమ్రాకు ఐదు వికెట్లు

ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్‌లో 465 పరుగులు చేసింది. ఓలీ పోప్ 106 పరుగులు, హ్యారీ బ్రూక్ 99 పరుగులు, బెన్ డకెట్ 62 పరుగులు, జేమీ స్మిత్ 40 పరుగులు చేశారు. భారత్ తరఫున బుమ్రా 5 వికెట్లు తీసి మెరిశారు. ప్రసిద్ధ్ 3, సిరాజ్ 2 వికెట్లు తీసినా, ఫీల్డింగ్ లో పొరపాట్లు భారత్‌పై ప్రభావం చూపాయి. జైస్వాల్ పలు క్యాచ్‌లు, జడేజా ఒక క్యాచ్ వదిలారు.

46
భారత్ రెండో ఇన్నింగ్స్: పంత్, రాహుల్ సెంచరీలతో మరోసారి మెరిశారు
Image Credit : ANI

భారత్ రెండో ఇన్నింగ్స్: పంత్, రాహుల్ సెంచరీలతో మరోసారి మెరిశారు

భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 364 పరుగులు చేసింది. రిషబ్ పంత్ మరోసారి (118 పరుగులు) సెంచరీతో అదరగొట్టాడు. కేఎల్ రాహుల్ (137 పరుగులు) అద్భుతమైన సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. కానీ మరోసారి లోయర్ ఆర్డర్ విఫలమైంది. దీంతో ఇంగ్లాండ్‌ ముందు 371 పరుగుల లక్ష్యాన్ని ఉంచగలిగింది భారత్.

56
ఇంగ్లాండ్ ఛేజ్: బెన్ డకెట్ 149 దుమ్మురేపాడు
Image Credit : Getty

ఇంగ్లాండ్ ఛేజ్: బెన్ డకెట్ 149 దుమ్మురేపాడు

ఇంగ్లాండ్ ఛేజ్‌లో బెన్ డకెట్ 170 బంతుల్లో 149 పరుగుల సూపర్ నాక్ ఆడాడు. బెన్ డకెట్, క్రాలీ (65) మొదటి వికెట్‌కు 188 పరుగుల భాగస్వామ్యం అందించారు. ప్రసిద్ధ్ కృష్ణ క్రాలీ, పోప్‌లను ఔట్ చేయగా, శార్దూల్ డకెట్, బ్రూక్‌లను వరుస బంతుల్లో వెనక్కి పంపి భారత్‌కు అవకాశమిచ్చాడు. అయితే జో రూట్ (53* పరుగులు), బెన్ స్టోక్స్ (33 పరుగులు) నిలకడగా ఆడి ఇంగ్లాండ్ కు విజయాన్ని అందించారు.

66
చివరి రోజు థ్రిల్: ఫీల్డింగ్ పొరపాట్లు భారత్ కొంపముంచాయి
Image Credit : ANI

చివరి రోజు థ్రిల్: ఫీల్డింగ్ పొరపాట్లు భారత్ కొంపముంచాయి

యశస్వి జైస్వాల్ బెన్ డకెట్‌ ఇచ్చిన క్యాచ్ వదలడంతో భారత్ పై ఒత్తిడిని పెంచింది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు అనేక స్థాయిలలో నిర్లక్ష్యం వహించింది. యశస్వి జైస్వాల్ కీలక క్యాచ్‌ను వదిలేయడం, కుల్దీప్ యాదవ్ లాంటి లెగ్ స్పిన్నర్‌ను జట్టులోకి తీసుకోకపోవడం భారత ఓటమికి దారితీసింది. బుమ్రా ఒక్కడే ప్రయత్నించినప్పటికీ, ఇతర బౌలర్ల నుంచి సరైన మద్దతు లేకపోవడం స్పష్టంగా కనిపించింది.

చివర్లో వర్షం ఆటను ఆపినప్పటికీ ఇంగ్లాండ్ దూకుడును కోల్పోలేదు. టీ బ్రేక్ తర్వాత 102 పరుగులు అవసరంగా ఉండగా, ఇంగ్లాండ్ 373/5 స్కోరు వద్ద లక్ష్యాన్ని చేరుకుంది. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి వెళ్ళింది.

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
భారత దేశం
భారత జాతీయ క్రికెట్ జట్టు
క్రీడలు
ఏషియానెట్ న్యూస్
క్రికెట్

Latest Videos
Recommended Stories
Recommended image1
T20 World Cup 2026 నుంచి స్టార్ ఆల్‌రౌండర్లు ఔట్.. బ్రేస్‌వెల్, హసరంగకు ఏమైంది?
Recommended image2
T20 World Cup 2026 : సంజూ కు ఛాన్స్.. బుమ్రా ఈజ్ బ్యాక్.. కానీ గంభీర్ టెన్షన్ తగ్గట్లేదు
Recommended image3
Abhishek Sharma : టీమిండియాకు బిగ్ షాక్.. నమీబియాతో మ్యాచ్‌కు స్టార్ ఓపెనర్ దూరం?
Related Stories
Recommended image1
ENG vs IND: మొద‌లైన తొలి టెస్ట్‌.. టాస్ గెలిచిన ఇంగ్లాండ్‌. సిరీస్‌ ఎవ‌రు గెలుస్తారో ముందే చెప్పేసిన స‌చిన్
Recommended image2
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టెస్టులో ప్లేయర్లు ఎందుకు బ్లాక్ ఆర్మ్‌బ్యాండ్లు కట్టుకున్నారు?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved