MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఈ బ్యాంకులో రుణం తీసుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు

ఈ బ్యాంకులో రుణం తీసుకుంటే మీకు ఎలాంటి ఛార్జెస్ ఉండవు

మీకు అర్జెంట్ గా లోన్ కావాలా? పంజాబ్ నేషనల్ బ్యాంకు ఓ ప్రత్యకమైన ఆఫర్ తీసుకొచ్చింది. దీని ప్రత్యేకత ఏంటంటే.. మీరు తీసుకున్న లోన్ ఎలాంటిదైనా ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఫీజులు ఉండవు. పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇస్తున్న ఈ ఆఫర్ గురించి పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

2 Min read
Author : Naga Surya Phani Kumar
Published : May 08 2025, 01:19 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా చాలామంది లోన్లు తీసుకోవాలనుకుంటారు. కాని వడ్డీల భారం మోయలేక వెనుకాడతారు. వడ్డీలకు తోడు ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఫీజులు ఇలా ఇతర ఛార్జీలు కూడా ఎక్కువగా ఉండటంతో అదనపు భారం భరించలేక లోన్ తీసుకోవడానికే ఆసక్తి చూపరు. అందుకే పంజాబ్ నేషనల్ బ్యాంకు ఇతర ఛార్జీలు వేయకుండా లోన్స్ ఇచ్చేందుకు ముందుకొచ్చింది.

25

పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), వినియోగదారులపై భారం తగ్గించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ‘PNB నిర్మాన్ 2025’ పేరిట ఒక నూతన సేవలను ప్రకటించింది. ఈ సేవల ప్రకారం హోమ్ లోన్, కార్ లోన్, పర్సనల్ లోన్, డిజి గోల్డ్ లోన్‌లపై ఎలాంటి ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు వసూలు చేయకూడదని నిర్ణయించింది.

Related Articles

Related image1
లైసెన్స్ అక్కర్లేకుండానే నడిపే స్కూటర్ కావాలా? ధర కేవలం రూ.42 వేలే..
Related image2
home business ideas: ఇంట్లో ఉండే ఇన్ని రకాల బిజినెస్‌లు చేయొచ్చా?
35

‘PNB నిర్మాన్ 2025’ స్కీమ్ ఏప్రిల్ 23న ప్రారంభమైంది. ఈ ఆఫర్ ద్వారా హోమ్ లోన్ తీసుకున్న వారు లీగల్, వాల్యుయేషన్ ఫీజులపై సబ్సిడీ లభిస్తుంది. అంతేకాకుండా వెహికల్, హోమ్, ఎడ్యుకేషన్ రుణాలపై ఎలాంటి ఇతర ప్రాసెసింగ్ ఫీజులు ఉండవు. పైగా ఈ లోన్స్  వడ్డీ రేటుపై 5 బేసిక్ పాయింట్లు రాయితీ కూడా ఇస్తోంది. 

45

‘PNB నిర్మాన్ 2025’ స్కీమ్ జూన్ 20, 2025 వరకు మాత్రమే అమల్లో ఉండనుంది. అంటే జూన్ 20 వరకు అప్లై చేసిన వారికి పై పేర్కొన్న అన్ని లోన్‌లపై ఛార్జీలు ఉండవు. ఇది లోన్ అర్జెంట్ అయిన వారికి భారీ ఊరట అనే చెప్పొచ్చు. బ్యాంక్ ప్రకటన ప్రకారం ఈ స్కీమ్ ద్వారా వినియోగదారులు మరింత చౌకగా లోన్ పొందవచ్చు.

55

PNB వెల్లడించిన వివరాల ప్రకారం హోమ్ లోన్, పర్సనల్ లోన్, కార్ లోన్, డిజి గోల్డ్ లోన్స్ పై ప్రాసెసింగ్ ఫీజు, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవని బ్యాంక్ స్పష్టం చేసింది. పైగా ఈ సేవలన్నీ దేశవ్యాప్తంగా ఉన్న పీఎన్‌బీ శాఖలన్నింటిలోనూ అందుబాటులో ఉంటాయని పేర్కొంది. వినియోగదారులు తమకు దగ్గరలో ఉన్న పీఎన్‌బీ శాఖకు వెళ్లి లేదా అధికారిక వెబ్‌సైట్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. ఈ అవకాశం వాడుకుని అవసరమైన లోన్‌ సేవలను ఛార్జీల లేని ఈ స్కీమ్ ద్వారా పొందవచ్చు.

About the Author

NS
Naga Surya Phani Kumar
ఫణి కుమార్ తొమ్మిదేళ్లకు పైగా జర్నలిజంలో ఉన్నారు. అనేక సంస్థల్లో పొలిటికల్, బిజినెస్, లైఫ్ స్టైల్ విభాగాల్లో పనిచేశారు. ‘ఈనాడు’ సంస్థలో తొమ్మిదేళ్లుగా రాజకీయ వార్తలను కవర్ చేశారు. ప్రస్తుతం ‘ఆసియా నెట్ న్యూస్ తెలుగు’లో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. బిజినెస్, లైఫ్ స్టైల్ వార్తలను రాస్తున్నారు. ఈయనకు జ్యోతిష్యం, జాతకం, ఆధ్యాత్మికం తదితర రంగాల్లోనూ ప్రావీణ్యం ఉంది.
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్
పర్సనల్ పైనాన్స్
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Best Car: ఆటోమేటిక్ లేదా మాన్యువల్.. ఎలాంటి కారు కొంటే మంచిది?
Recommended image2
Copper: రాగి ధ‌ర‌లు పెరుగుతున్నాయి స‌రే.. ఇంత‌కీ రాగిని ఎలా కొనుగోలు చేయాలో తెలుసా.?
Recommended image3
Business Ideas : తెలుగు మహిళలకు ఫ్రీగా రూ.50,000 .. పెట్టుబడి, సరుకులు ఉచితమే..!
Related Stories
Recommended image1
లైసెన్స్ అక్కర్లేకుండానే నడిపే స్కూటర్ కావాలా? ధర కేవలం రూ.42 వేలే..
Recommended image2
home business ideas: ఇంట్లో ఉండే ఇన్ని రకాల బిజినెస్‌లు చేయొచ్చా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved