MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Loan: 72 గంట‌ల్లో రూ. 5 ల‌క్ష‌ల లోన్‌.. బ్యాంక్‌కి వెళ్లాల్సిన ప‌ని కూడా లేదు.

Loan: 72 గంట‌ల్లో రూ. 5 ల‌క్ష‌ల లోన్‌.. బ్యాంక్‌కి వెళ్లాల్సిన ప‌ని కూడా లేదు.

Loan: లోన్ కావాలంటే మంచి సిబిల్ స్కోర్ ఉండాల‌ని తెలిసిందే. ఆ త‌ర్వాత బ్యాంకుల చుట్టూ తిర‌గాలి. అయితే అలాంటిదేం లేకుండా ఫోన్‌లో ఒక సింగిల్ క్లిక్‌తో డ‌బ్బులు మీ ఖాతాలోకి వ‌స్తే భ‌లే ఉంటుంది క‌దూ! అలాంటి ఓ ఫీచ‌ర్‌నే ఫోన్‌పే తీసుకొచ్చింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jan 25 2026, 02:00 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఫోన్‌పే నుంచి లోన్.. బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు
Image Credit : Getty

ఫోన్‌పే నుంచి లోన్.. బ్యాంక్ చుట్టూ తిరగాల్సిన పనిలేదు

అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు బ్యాంకుల వద్ద తిరగడం చాలామందికి పెద్ద తలనొప్పి. డాక్యుమెంట్లు, గ్యారంటీలు అంటూ ఆలస్యం అవుతుంది. ఈ పరిస్థితికి ఫోన్‌పే ఇప్పుడు సులభమైన పరిష్కారం చూపిస్తోంది. రోజూ డిజిటల్ చెల్లింపుల కోసం వాడే ఫోన్‌పే యాప్ నుంచే లోన్ తీసుకునే అవకాశం అందిస్తోంది.

25
ఎంత వరకు లోన్ పొందవచ్చు?
Image Credit : Getty

ఎంత వరకు లోన్ పొందవచ్చు?

ఫోన్‌పే వివిధ బ్యాంకులు, NBFCలతో కలిసి పర్సనల్ లోన్స్ అందిస్తోంది. వినియోగదారుడి క్రెడిట్ ప్రొఫైల్ ఆధారంగా రూ.10 వేల నుంచి గరిష్టంగా రూ.5 లక్షల వరకు లోన్ లభిస్తుంది. ఇవి అన్‌సెక్యూర్డ్ లోన్స్ కావడంతో ఎలాంటి బంగారం లేదా ఆస్తి తాకట్టు అవసరం ఉండదు. చిన్న వ్యాపార ఖర్చులు, వైద్య అవసరాలు, కుటుంబ అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది.

Related Articles

Related image1
Gold: అస‌లు బంగారం ఎలా పుట్టింది.? ఎందుకంతా విలువైందిగా మారింది.?
Related image2
Zodiac sign: ఈ రాశి వారికి వ‌చ్చే వారం అనుకూలం.. ఊహించ‌ని లాభాలు ఖాయం
35
వడ్డీ రేట్లు, రీపేమెంట్ గడువు
Image Credit : our own

వడ్డీ రేట్లు, రీపేమెంట్ గడువు

లోన్ ఆమోదం పొందిన తరువాత డబ్బు గరిష్టంగా 72 గంటల్లో బ్యాంక్ ఖాతాలో జమ అవుతుంది. రీపేమెంట్ కాలాన్ని 12 నెలల నుంచి 60 నెలల వరకు ఎంచుకోవచ్చు. వడ్డీ రేట్లు ఏడాదికి సుమారు 11.30 శాతం నుంచి ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజు, EMI వివరాలు ముందే స్పష్టంగా చూపిస్తారు.

45
ఎవరు అర్హులు? అవసరమైన అర్హతలు
Image Credit : our own

ఎవరు అర్హులు? అవసరమైన అర్హతలు

ఈ లోన్ కోసం అప్లై చేయాలంటే వయస్సు 21 నుంచి 60 ఏళ్ల మధ్య ఉండాలి. నెలవారీ ఆదాయం కనీసం రూ.15,000 అవసరం. సిబిల్ స్కోర్ 650 కంటే ఎక్కువగా ఉంటే ఆమోదం వచ్చే అవకాశాలు పెరుగుతాయి. స్థిరమైన ఆదాయం ఉన్నవారికి ప్రాధాన్యం ఇస్తారు.

55
అప్లై చేసే విధానం, కావాల్సిన పత్రాలు
Image Credit : our own

అప్లై చేసే విధానం, కావాల్సిన పత్రాలు

ఈ లోన్ ప్రక్రియ మొత్తం డిజిటల్ పద్ధతిలోనే జరుగుతుంది. ఆధార్ కార్డు, పాన్ కార్డు, గత ఆరు నెలల బ్యాంక్ స్టేట్‌మెంట్, శాలరీ స్లిప్స్ ఉంటే సరిపోతుంది. అప్లై చేయాలంటే ముందుగా ఫోన్‌పే యాప్ ఓపెన్ చేయాలి. అనంత‌రం లోన్స్ విభాగంలోకి వెళ్లాలి, త‌ర్వాత వ్యక్తిగత వివరాలు నమోదు చేయాలి. లోన్ మొత్తం, కాలపరిమితి ఎంచుకోవాలి చివ‌రికి అవసరమైన పత్రాలు అప్‌లోడ్ చేయాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
DA Hike : ఉద్యోగులకు పండగ ముందే అదిరిపోయే గిఫ్ట్.. జీతాలు పెరగనున్నాయ్
Recommended image2
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image3
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Related Stories
Recommended image1
Gold: అస‌లు బంగారం ఎలా పుట్టింది.? ఎందుకంతా విలువైందిగా మారింది.?
Recommended image2
Zodiac sign: ఈ రాశి వారికి వ‌చ్చే వారం అనుకూలం.. ఊహించ‌ని లాభాలు ఖాయం
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved