MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • Mobile: ఈ ప్రభుత్వ యాప్ మీ ఫోన్లో ఉంటే మొబైల్ పోయినా కనిపెట్టేయచ్చు, అలాగే బ్లాక్ చేయచ్చు కూడా

Mobile: ఈ ప్రభుత్వ యాప్ మీ ఫోన్లో ఉంటే మొబైల్ పోయినా కనిపెట్టేయచ్చు, అలాగే బ్లాక్ చేయచ్చు కూడా

మొబైల్ పోవడం (Mobile) అనేది ఇప్పుడు ఎంతోమందికి ఎదురవుతున్న సమస్య. అలా ఫోన్ పోయినప్పుడు ఆ ఫోన్ ఎక్కడుందో తెలుసుకోవడానికి, బ్లాక్ చేయడానికి ఒక యాప్ ఉంది. ఇది కేంద్రప్రభుత్వానికి చెందినది. పేరు సంచార్ సాథి యాప్. 

2 Min read
Author : Haritha Chappa
Published : Oct 19 2025, 12:12 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మొబైల్ పోవడం సహజం
Image Credit : Freepik

మొబైల్ పోవడం సహజం

నేటి ప్రపరంచంలో మొబైల్ పోవడం సహజమైపోయింది. ఒకరితో ఒకరు ఫోన్ లో కనెక్ట్ అయేందుకు మాత్రమే కాదు సోషల్ మీడియా, డబ్బు పంపకాలు, ఆన్ లైన్ షాపింగ్ వంటి వాటికోసం మొబైల్ కచ్చితంగా ఉండాల్సిందే. చేతిలో ఫోన్ లేకపోతే ఏదో కోల్పోయినట్టు కనిపిస్తారు కొంతమంది. కానీ ఒక్కోసారి మొబైల్ పోతూ ఉంటుంది. మొబైల్ పోవడం అనేది సహజమైన విషయంగా మారిపోయింది.

25
కేంద్రప్రభుత్వ యాప్ ఇదిగో
Image Credit : Freepik

కేంద్రప్రభుత్వ యాప్ ఇదిగో

పోయిన మొబైల్ ను కనిపెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక యాప్ అందుబాటులోకి తెచ్చింది. కేంద్ర టెలికమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ 'సంచార్ సాథి' అనే వెబ్‌సైట్, మొబైల్ యాప్‌ను ప్రారంభించింది. ఈ యాప్ లో మీ ఫోన్లో ఉంటే పోయిన ఫోన్‌ను ఇతరులు వాడకుండా వెంటనే బ్లాక్ చేయొచ్చు. తర్వాత దాన్ని పోలీసులు ట్రేస్ చేసి పట్టుకోగలరు.

Related Articles

Related image1
Hyundai Creta: మీ జీతం నెలకు రూ.50,000 అయితే హ్యుండాయ్ క్రెటా కారును ఇలా సులువుగా కొనేయవచ్చు
Related image2
iPhone 17: ఐఫోన్ 17 కొనేకన్నా... ఆ ఖర్చుతో వీసా లేకుండా ఈ దేశాలు తిరిగొచ్చేయచ్చు
35
ఈ వివరాలు అవసరం
Image Credit : our own

ఈ వివరాలు అవసరం

మీ ఫోన్ పోయినప్పుడు పోలీసులకు కంప్లయింట్ ఇవ్వాలంటే మీరు కొన్ని వివరాలు ఇవ్వాలి. అందుకే ఫోన్ కొనగానే దాని వివరాలు ఒకచోట రాసుకోవాలి. పోలీసులకు మీ ఫోన్ నెంబర్,   IMEI నంబర్,  ఫోన్ పోయిన తేదీ, సమయం, ప్రదేశం, మీ వ్యక్తిగత వివరాలు వంటివి ఇవ్వాలి. మీ పేరుపై ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో కూడా ఈ యాప్‌లో చూడొచ్చు. మీకు తెలియకుండా ఎవరైనా మీ పేరుతో సిమ్ తీసుకుంటే దాన్ని కూడా బ్లాక్ చేసుకోవచ్చు.

45
ఎన్ని ఫోన్లు దొరికాయె తెలుసా?
Image Credit : our own

ఎన్ని ఫోన్లు దొరికాయె తెలుసా?

కేంద్రప్రభుత్వానికి చెందిన సంచార్ సాథి యాప్ ఎన్నో ఫోన్లను వెతికి ఇచ్చింది. ఈ యాప్ ద్వారా అనుమానాస్పద కాల్స్, SMS, వాట్సాప్ కాల్స్‌పై కూడా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పటివరకు ఈ యాప్ సాయంతో 5 లక్షలకు పైగా పోయిన ఫోన్లు దొరికాయి. కోటికి పైగా అనధికార కనెక్షన్లు తొలగించారు. ఇంతకన్నా ఈ యాప్ గొప్పతనం గురించి ఏం చెప్పాలి.

55
ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి
Image Credit : Getty

ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి

భారతీయ పౌరుల గురించి తయారు చేసిన ముఖ్యమైన యాప్ ఇది. మీ ఫోన్లో ఇప్పుడే దీన్ని డౌన్ లోడ్ చేసుకోవడం ఉత్తమం. ఫోన్ ఒకవేళ్ల పోయినా కూడా బాధపడాల్సిన అవసరం లేదు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
వ్యాపారం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Income Tax : కొత్త ఆదాయపు పన్ను చట్టం.. మీకు కలిగే లాభాలివే
Recommended image2
Condoms: కండోమ్‌ల వాడకం మామూలుగా లేదుగా, ఆ దేశమే టాప్.. మనదేశం కూడా తక్కువేమీ కాదు
Recommended image3
Gold Mine: ప్రపంచంలోనే అతిపెద్ద బంగారు గని, గోల్డ్ తీసుకెళ్లేందుకు సొంత ఎయిర్ పోర్టు కూడా
Related Stories
Recommended image1
Hyundai Creta: మీ జీతం నెలకు రూ.50,000 అయితే హ్యుండాయ్ క్రెటా కారును ఇలా సులువుగా కొనేయవచ్చు
Recommended image2
iPhone 17: ఐఫోన్ 17 కొనేకన్నా... ఆ ఖర్చుతో వీసా లేకుండా ఈ దేశాలు తిరిగొచ్చేయచ్చు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved