MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • ఫోన్‌లోనే పీఎఫ్ డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.. ఎంత‌ ఈజీ ప్రాసెసో తెలుసా.?

ఫోన్‌లోనే పీఎఫ్ డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు.. ఎంత‌ ఈజీ ప్రాసెసో తెలుసా.?

EPFO: ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గ‌నైజేష‌న్ ద్వారా ఉద్యోగుల జీతంలో నుంచి ప్రతి నెల PF డబ్బు జమ అవుతుంది. చాలా మంది ఉద్యోగులు ఈ డబ్బు ఎలా తీసుకోవాలో తెలియక ఇబ్బంది ప‌డుతుంటారు. అయితే ఫోన్‌లోనే పీఎఫ్ డ‌బ్బు విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 20 2025, 02:34 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
EPFO పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి
Image Credit : Asianet News

EPFO పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి

* PF డబ్బు తీసుకోవాలంటే ఫోన్‌లోనే EPFO మెంబర్ పోర్టల్‌కి వెళ్లాలి.

* ఇందుకోసం ముందుగా EPFO Member Sewa పోర్టల్‌లోకి వెళ్లాలి.

* అక్కడ UAN Number, Password ఎంటర్ చేయాలి.

* వెంట‌నే ఒక క్యాప్చా వ‌స్తుంది. దానిని ఎంట‌ర్ చేసి లాగిన్ అవ్వాలి.

* ఒక‌వేళ UAN లేకుంటే మీ కంపెనీలోని HR డిపార్ట్‌మెంట్ ద్వారా తెలుసుకోవచ్చు.

* ఒక‌వేళ పాస్‌వ‌ర్డ్ మ‌ర్చిపోయినా "Forgot Password" ఆప్షన్ ద్వారా సులభంగా రీసెట్ చేసుకోవచ్చు.

25
ఆన్‌లైన్ సర్వీస్‌లోకి వెళ్లాలి
Image Credit : Asianet News

ఆన్‌లైన్ సర్వీస్‌లోకి వెళ్లాలి

అనంత‌రం ఆన్‌లైన్ స‌ర్వీస్‌లోకి వెళ్లాలి. క్లైమ్ సెక్ష‌న్‌లోకి వెళ్లాలి. లాగిన్ అయ్యాక హోమ్‌పేజ్‌లోనూ టాప్ మెను కనిపిస్తుంది. ఇందులో క‌నిపించే Online Services → Claim (Form-31, 19, 10C) ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఇందులో..

Form-31 → PF partial withdrawal (medical, education, marriage, house repair మొదలైనవి)

Form-19 → PF పూర్తి మొత్తం

Form-10C → Pension withdrawal

మీ అవసరానికి తగ్గట్టు సిస్టమ్ ఆటోమేటిక్‌గా సరైన ఫామ్‌ అందిస్తుంది.

Related Articles

Related image1
100 గజాల స్థ‌లం ఉన్నా చాలు.. వేల రూపాయ‌లు సంపాదించ‌వ‌చ్చు. బిందాస్ బిజినెస్‌..
Related image2
బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం, అంత‌లోనే వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు
35
ఆధార్‌, బ్యాంక్ వివ‌రాలు స‌రిచూసుకోవాలి:
Image Credit : Asianet News

ఆధార్‌, బ్యాంక్ వివ‌రాలు స‌రిచూసుకోవాలి:

స్క్రీన్‌పై ఆధార్ నెంబ‌ర్‌, బ్యాంక్ కౌంట్ నెంబ‌ర్‌, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ వివ‌రాలు స‌రి చూసుకోవాలి. వీటిలో ఏదైనా తప్పు ఉంటే క్లెయిమ్ పూర్తిగా ఆగిపోతుంది. అందుకే సమర్పించే ముందు ఇవి పూర్తిగా సరిగ్గా ఉన్నాయా అని చూసుకోవాలి. Aadhaar-PF లింక్ అయి ఉండాలి, Bank–PF లింక్ అయి ఉండాలి. ఒక‌వేళ లింకింగ్ లేకుంటే.. కంపెనీ/HR ద్వారా లేదా EPFO ద్వారా అప్డేట్ చేయాలి.

45
విత్‌డ్రా ఫామ్ ఫిల్ చేయాలి:
Image Credit : Asianet News

విత్‌డ్రా ఫామ్ ఫిల్ చేయాలి:

తర్వాత Withdraw ఫారం వస్తుంది. ఇందులో ఎంత మొత్తం తీసుకోవాలని ఉంది, ఏ అవసరానికి తీసుకుంటున్నారు లాంటి వివ‌రాలు ఎంట‌ర్ చేయాలి. ఇంటి అడ్ర‌స్‌తో పాటు పాన్ వివ‌రాలు ఫిల్ చేయాలి. పీఎఫ్ మొత్తాన్ని మెడికల్ ఖర్చులు, ఇంటి రిపేర్స్, హౌస్ లోన్ చెల్లింపు, పిల్లల విద్య, పెళ్ళి ఖర్చులు, ఉద్యోగం వదిలేసినప్పుడు పూర్తి PF తీసుకోవ‌చ్చు. EPFO ప్రతి కారణానికి వేరువేరు రూల్స్ అమలు చేస్తుంది.

55
3 రోజుల్లో ఖాతాలోకి డబ్బు
Image Credit : Social media

3 రోజుల్లో ఖాతాలోకి డబ్బు

అన్ని వివ‌రాలు ఎంట‌ర్ చేసి ఫామ్‌ సబ్మిట్ చేసిన వెంటనే. మీ మొబైల్‌కి ఒక ఓటీపీ వ‌స్తుంది. దానిని ఎంటర్ చేసి Verify చేయాలి. ఆపై మీ క్లెయిమ్‌ను EPFO కార్యాలయానికి పంపిస్తారు. పూర్తి వివ‌రాలు స‌రిగ్గా ఉంటే 3 వ‌ర్కింగ్ డేస్‌లో PF డబ్బు మీ బ్యాంక్ ఖాతాలో క్రెడిట్ అవుతుంది. ఆధార్ - యూఏఎన్, బ్యాంక్‌-యూఏఎన్ మిస్ మ్యాచ్ అయినా.. పాన్ వివ‌రాలు లేక‌పోవ‌డం, కంపెనీ కేవైసీ అప్రూవ‌ల్ చేయ‌క‌పోవ‌డం వంటి కార‌ణాల వ‌ల్ల ప్ర‌క్రియ ఆల‌స్య‌మ‌య్యే అవ‌కాశాలు ఉంటాయి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం
బ్యాంకింగ్ మరియు ఫైనాన్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో హాయిగా ట్రావెల్ చేయండిలా.. ఈ ఆప్షన్ ఓ సారి ట్రై చేయండి..
Recommended image2
ఉన్న ఊర్లోనే రిస్క్ లేని వ్యాపారాలు.. మంచి ఆదాయం కూడా.. అవేంటంటే.?
Recommended image3
Business Ideas: 4 నెల‌లు క‌ష్ట‌ప‌డితే ల‌క్షాధికారి కావొచ్చు.. ఈ బిజినెస్‌తో స‌మ్మ‌ర్‌లో సిరులు కురుస్తాయి
Related Stories
Recommended image1
100 గజాల స్థ‌లం ఉన్నా చాలు.. వేల రూపాయ‌లు సంపాదించ‌వ‌చ్చు. బిందాస్ బిజినెస్‌..
Recommended image2
బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం, అంత‌లోనే వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved