MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Business
  • 100 గజాల స్థ‌లం ఉన్నా చాలు.. వేల రూపాయ‌లు సంపాదించ‌వ‌చ్చు. బిందాస్ బిజినెస్‌..

100 గజాల స్థ‌లం ఉన్నా చాలు.. వేల రూపాయ‌లు సంపాదించ‌వ‌చ్చు. బిందాస్ బిజినెస్‌..

Business Idea: ఉన్న ఊరిలో ఉంటూ వ్యాపారం చేయాల‌ని చాలా మందికి ఉంటుంది. ఇందుకోసం ర‌క‌ర‌కాల మార్గాల‌ను వెతుకుంటారు. అయితే కేవ‌లం 100 గ‌జాల స్థ‌లం ఉన్నా మంచి లాభాలు ఆర్జించే ఇలాంటి ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 19 2025, 05:36 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
కొత్తిమీర సాగుతో భారీ లాభాలు
Image Credit : Generated by google gemini AI

కొత్తిమీర సాగుతో భారీ లాభాలు

త‌క్కువ పెట్టుబ‌డితో ఎక్కువ లాభాలు వ‌చ్చే బెస్ట్ వ్యాపారాల్లో కొత్తిమీర పెంపకం ఒక‌టి. నిత్య‌వ‌స‌ర కూర‌గాయల్లో కొత్తిమీర ఒక‌ట‌నే విష‌యం తెలిసిందే. కొత్తిమీరలో ఫైబర్, కాల్షియం, ఐరన్, విటమిన్లు, కేరోటిన్ వంటి పోషకాలు ఉంటాయి. దీంతో దేశ‌మంతా కొత్త‌మీర‌కు డిమాండ్ ఉంటుంది. దీంతో ఎక్క‌డ సాగు చేసినా బిజినెస్‌కు ఎలాంటి ఢోకా ఉండ‌దు. కొత్తిమీర పంట పూర్తిగా సిద్ధం కావడానికి 2.5–3 నెలలు ప‌డుతుంది. అయితే విత్త‌నాలు వేసిన 30–40 రోజులకు ఆకులను కోసి అమ్మడం ద్వారా వెంటనే ఆదాయం మొదలవుతుంది.

25
ఎక్కడ సాగు చేస్తే మంచిది.?
Image Credit : Generated by google gemini AI

ఎక్కడ సాగు చేస్తే మంచిది.?

కొత్తిమీరకు సమశీతోష్ణ వాతావరణం చాలా అనుకూలం. తేలికపాటి రేతి నేల, ఎరువు కలిసిన ఎర్ర నేల రెండూ సరిగ్గా పనిచేస్తాయి. శీతాకాలం, వేసవి ప్రారంభం—ఈ రెండు సీజన్లు అధిక దిగుబడి ఇచ్చే కాలాలుగా చెప్పొచ్చు. చలికాలంలో పొగమంచు రాకుండా, వేసవిలో నేరుగా గాఢ ఎండ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే పంట నాణ్యత బాగుంటుంది.

Related Articles

Related image1
న‌వంబ‌ర్ 20 మార్గ‌శిర అమావాస్య‌.. ఈ రాశుల వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే..
Related image2
బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం, అంత‌లోనే వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు
35
100 గజాల్లో కొత్తిమీర సాగు ఎలా చేయాలి?
Image Credit : Pinterest

100 గజాల్లో కొత్తిమీర సాగు ఎలా చేయాలి?

100 గజాలు అంటే సుమారు 900 చ.అడుగులు. ఇంత స్థలంలో చిన్న స్థాయి వ్యవసాయం ప్రారంభించాలనుకునే వారికి ఇది పర్ఫెక్ట్ మోడల్. ఇందుకోసం ముందుగా నేలను బాగా దున్నుకోవాలి. ఆ త‌ర్వాత స‌హ‌జ ఎరువులు లేదా కంపోస్ట్‌ల‌ను ఉప‌యోగించాలి. అనంత‌రం కొత్తిమీర విత్త‌నాల‌ను శుద్ధి చేసి వరుసలుగా విత్తాలి. రోజూ కొద్దికొద్దిగా నీళ్లు ప‌ట్టాలి. పురుగుల నివారణకు నేచురల్ స్ప్రేలు ఉప‌యోగిస్తే మంచిది.

45
100 గజాలకు ఖర్చు ఎంత?
Image Credit : Getty

100 గజాలకు ఖర్చు ఎంత?

విత్త‌నాల‌కు సుమారు రూ. 150 నుంచి రూ. 200 వ‌ర‌కు అవుతుంది. ఎరువుల‌కు రూ. 500 వ‌ర‌కు అవుతుంది. ఇత‌ర ఖ‌ర్చుల‌కు రూ. 300 అవుతుంది. ఇలా మొత్తంగా చెప్పాలంటే 100 గ‌జాల్లో కొత్త‌మీర సాగు చేయాలంటే రూ. 1000 వ‌ర‌కు అవుతుంది.

55
లాభం ఎంత వస్తుంది?
Image Credit : YouTube

లాభం ఎంత వస్తుంది?

100 గజాల్లో కొత్తిమీర సాధారణంగా 60–90 కిలోల వరకు దిగుబడి ఇస్తుంది. అయితే సీజన్, నిర్వహణ ఆధారంగా లాభం మారుతూ ఉంటుంది. కొత్తిమీర ధ‌ర విష‌యానికొస్తే.. కిలో కొత్తి మీర సుమారు రూ. 50 నుంచి రూ. 100 వ‌ర‌కు ఉంటుంది. స‌గ‌టున చూసుకుంటే 70 కిలోల‌కు రూ. 5 వేల వ‌ర‌కు ఆదాయం పొందొచ్చు. ఏడాదికి రూ. 60 వేల వ‌ర‌కు సంపాదించ వ‌చ్చు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
వ్యాపారం

Latest Videos
Recommended Stories
Recommended image1
Investments: నెల‌కు రూ. 500తో మీ పిల్ల‌లకు బంగారు భ‌విష్య‌త్తు ఇవ్వొచ్చు.. ఈ రోజే ప్రారంభించండి
Recommended image2
స్లీపర్ క్లాస్ టికెట్‌తో ఏసీలో హాయిగా ట్రావెల్ చేయండిలా.. ఈ ఆప్షన్ ఓ సారి ట్రై చేయండి..
Recommended image3
ఉన్న ఊర్లోనే రిస్క్ లేని వ్యాపారాలు.. మంచి ఆదాయం కూడా.. అవేంటంటే.?
Related Stories
Recommended image1
న‌వంబ‌ర్ 20 మార్గ‌శిర అమావాస్య‌.. ఈ రాశుల వారు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. లేదంటే..
Recommended image2
బంగాళాఖాతంలో మ‌రో అల్ప‌పీడ‌నం, అంత‌లోనే వాయుగుండం.. ఈ ప్రాంతాల్లో దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved