Amazon Prime Day 2025 : అమెజాన్ ప్రైమ్ డే 2025.. టాప్ 10 స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇవే
Amazon Prime Day Smartphone Deals: అమెజాన్ ప్రైమ్ డే 2025లో OnePlus Nord 5 నుండి Galaxy S24 Ultra వరకు టాప్ స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ ప్రైమ్ డే 2025 సేల్ లో బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ చాలానే ఉన్నాయి.

అమెజాన్ ప్రైమ్ డే 2025లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్
Top 10 Amazon Prime Day 2025 Smartphone Deals: అమెజాన్ ప్రైమ్ డే 2025లో లావా స్టార్మ్ లైట్ నుండి సామ్ సంగ్ గెలాక్సీ S24 Ultra వరకు టాప్ 10 బెస్ట్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ అందుబాటులో ఉన్నాయి.
OnePlus Nord 5, Galaxy S24 Ultra వంటి హైఎండ్ ఫోన్లు నుంచి, iQOO Z10x వంటి బడ్జెట్ ఫోన్ల వరకు బంపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. అమెజాన్ కూపన్లు, బ్యాంక్ డిస్కౌంట్లను కలుపుకొని తక్కువ ధరలో ఈ సేల్ లో అందుబాటులో ఉన్న టాప్ 10 స్మార్ట్ ఫోన్ డీల్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
1. Lava Storm Lite 5G
• రెగ్యులర్ ధర రూ. 10,999
• ప్రైమ్ డే ధర రూ. 7,199
బడ్జెట్ వినియోగదారులకు ఉత్తమమైన 5G ఫోన్. 6.75-అంగుళాల 120Hz IPS స్క్రీన్, Dimensity 6400 చిప్‌సెట్, 50MP కెమెరా, 5000mAh బ్యాటరీ తో వస్తోంది. బ్రాండ్ 700+ సర్వీస్ సెంటర్లతో ఉచిత హోమ్ సర్వీస్ కూడా ఇస్తోంది.
2. iQOO Z10x 5G
• రెగ్యులర్ ధర రూ. 17,499
• ప్రైమ్ డే ధర రూ. 12,749
ఈ ఫోన్ ఏప్రిల్ 2025లో విడుదలయ్యింది. 6,500mAh భారీ బ్యాటరీతో, 44W ఛార్జింగ్, Dimensity 7300 చిప్‌సెట్, 6.72" 120Hz IPS స్క్రీన్‌తో వస్తోంది. బేస్ వేరియంట్ 6GB RAM + 128GB స్టోరేజ్ తో అందుబాటులో ఉంది.
3. Samsung Galaxy M36 5G
• రెగ్యులర్ ధర రూ. 22,999
• ప్రైమ్ డే ధర రూ. 16,499
సామ్ సంగ్ నుంచి వచ్చిన కొత్త మోడల్ ఇది. 6.7" Super AMOLED స్క్రీన్, Exynos 1380 ప్రాసెసర్, 50MP ట్రిపుల్ కెమెరా సెటప్, 5000mAh బ్యాటరీతో వస్తోంది. సర్కిల్ సెర్చ్, జెమిని లైవ్ ఏఐ వాయిస్ అసిస్టెంట్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి.
4. OnePlus Nord CE 5
• రెగ్యులర్ ధర రూ. 24,999
• ప్రైమ్ డే ధర రూ. 22,999
మిడ్‌రేంజ్ వినియోగదారులకు సరైన ఎంపిక ఉంటుంది. 6.77" Super AMOLED 120Hz స్క్రీన్, Dimensity 8350 చిప్‌సెట్, 50MP కెమెరా, 7100mAh బ్యాటరీతో 80W ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది.
5. OnePlus Nord 5
• రెగ్యులర్ ధర రూ. 34,999
• ప్రైమ్ డే ధర రూ 29,999
144Hz 6.83" AMOLED స్క్రీన్, Snapdragon 8s Gen 3 ప్రాసెసర్, 50MP రియర్, సెల్ఫీ కెమెరాలు, 6800mAh బ్యాటరీతో 80W ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
6. realme GT 7
• రెగ్యులర్ ధర రూ. 39,999
• ప్రైమ్ డే ధర రూ. 36,999
7.68" LTPO AMOLED స్క్రీన్, Dimensity 9400e ప్రాసెసర్, 50MP డ్యూయల్ కెమెరాలు, 7000mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీ, 120W SUPERVOOC ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
7. iPhone 16e
• రెగ్యులర్ ధర రూ. 53,600
• ప్రైమ్ డే ధర రూ. 49,249
iOS ఎకోసిస్టమ్‌కు అనువైన రెండవ ఫోన్. ఒక్క కెమెరాతోనే వచ్చినా, Apple Intelligence మద్దతుతో వస్తోంది. బేసిక్ యూజ్‌కి సరైన ఎంపిక. తక్కువ ధరలో ఐఫోన్ కొనుక్కోవాలనుకునే వారికి సరైన ఎంపిక. పవర్ ఫుల్ చిప్ సెట్ ను కలిగి ఉంది.
8. OnePlus 13s
• రెగ్యులర్ ధర రూ. 54,999
• ప్రైమ్ డే ధర రూ. 49,999
కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్. 6.32" LTPO AMOLED, Snapdragon 8 Elite ప్రాసెసర్, డ్యూయల్ 50MP కెమెరాలు, 5850mAh బ్యాటరీ, 80W ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
10. Samsung Galaxy S24 Ultra
• రెగ్యులర్ ధర రూ. 89,999
• ప్రైమ్ డే ధర రూ. 74,999
సామ్ సంగ్ నుంచి వచ్చిన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్. 256GB వేరియంట్. 6.8" LTPO AMOLED, Snapdragon 8 Gen 3, 200MP క్వాడ్ కెమెరా సెటప్, Galaxy AI ఫీచర్లు ఉన్నాయి. ఇది ఫ్లాగ్‌షిప్ మార్కెట్‌లో అత్యుత్తమ డీల్‌గా నిలుస్తోంది.
9. Xiaomi 15
• రెగ్యులర్ ధర రూ. 64,999
• ప్రైమ్ డే ధర రూ. 59,999
6.36" LTPO OLED స్క్రీన్, Snapdragon 8 Elite ప్రాసెసర్, 5240mAh బ్యాటరీ, ట్రిపుల్ 50MP కెమెరాలు, 90W వైర్డ్, 50W వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తోంది.
ఈ ధరలు అమెజాన్ కూపన్లు, బ్యాంకు, ఇతర డిస్కౌంట్లు కలిపి పేర్కొన్నవి.