MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Zodiac sign: డిసెంబ‌ర్ 7 నుంచి ఈ 5 రాశుల వారికి ల‌క్కే ల‌క్కు.. ధ‌నుస్సులోకి కుజుడు ప్రవేశం

Zodiac sign: డిసెంబ‌ర్ 7 నుంచి ఈ 5 రాశుల వారికి ల‌క్కే ల‌క్కు.. ధ‌నుస్సులోకి కుజుడు ప్రవేశం

Zodiac sign: డిసెంబర్ 7న కుజుడు ధనుస్సు రాశిలోకి అడుగుపెడుతున్నాడు.  వృశ్చికం నుంచి ధనుస్సులోకి మారుతున్న క్షణం అనేక రాశులకు కొత్త అవకాశాలను తెరుస్తుందని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం.కొన్ని రాశుల వారికి ఈ మార్పు ప్రత్యేకమైన ఫలితాలను అందించనుంది. 

2 Min read
Author : Narender Vaitla
Published : Dec 06 2025, 07:07 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
మేషం – ధనలాభాలు, నెర‌వేర‌నున్న కోరిక‌లు
Image Credit : Generated by google gemini AI

మేషం – ధనలాభాలు, నెర‌వేర‌నున్న కోరిక‌లు

కుజ ప్రభావం మేష రాశి 9వ స్థానాన్ని తాకుతుంది. ఈ మార్పు కారణంగా అనుకున్న ఆస్తి, వాహన కొనుగోలు అవకాశాలు ఏర్పడతాయి. ఆదాయం పెరుగుతుంది, వ్యాపారానికి కొత్త దారులు తెరుచుకుంటాయి. కుటుంబ అవసరాలు తీర్చేందుకు సరిపోయే ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది. హోటలింగ్, వసతి రంగంలో పనిచేసేవారికి పదోన్నతి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకునే వారికి రుణాలు, ఆర్థిక సహాయం ల‌భించే అవకాశం కూడా ఉంది.

25
మిథునం – అదృష్టం తలుపు తడుతోంది
Image Credit : our own

మిథునం – అదృష్టం తలుపు తడుతోంది

ఈ గోచారం మిథున రాశి వారి ధనస్థానాన్ని చురుగ్గా మార్చుతుంది. దీని ఫలితంగా పెండింగ్ పనులు త్వరగా పూర్తవుతాయి. ఉద్యోగ స్థాయిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. ఆధ్యాత్మిక ప్రయాణాల‌కు అవకాశం ఉంది. విదేశాల్లో ఉన్నవారు కుటుంబంతో మళ్లీ కలిసే సూచనలు ఉన్నాయి. చదువు కోసం విదేశాలకు వెళ్లాలని చూస్తున్న వారికి అవకాశాలు లభిస్తాయి. పోటీ పరీక్షలలో విజయం పొందే అవ‌కాశం ఉంది.

Related Articles

Related image1
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Related image2
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
35
సింహం – శుభకార్యాలు, వ్యాపారంలో పెరుగుదల
Image Credit : our own

సింహం – శుభకార్యాలు, వ్యాపారంలో పెరుగుదల

కుజుడు సింహ రాశి 5వ స్థానాన్ని చైతన్యవంతం చేస్తాడు. దీంతో ఇంటిలో శుభకార్యాలు జరుగుతాయి. తోబుట్టువుల కోరికలు నెరవేరే అవకాశాలు ఉన్నాయి. కొత్త వ్యాపార ఆలోచనలకు అనుకూల వాతావరణం ఉంది. వస్త్ర వ్యాపారం, రియల్ ఎస్టేట్ రంగాలకు ఊపందుతుంది. పెట్టుబడులపై మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. అయితే పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం.

45
ధనుస్సు – ఆనందం, ఆరోగ్యం, కెరీర్ పురోగతి
Image Credit : Asianet News

ధనుస్సు – ఆనందం, ఆరోగ్యం, కెరీర్ పురోగతి

కుజ ప్రవేశం నేరుగా ఈ రాశి 1వ స్థానాన్ని ప్రభావితం చేస్తుంది. దీని వల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యంలో మెరుగ‌య్యే అవ‌కాశాలు ఉన్నాయి. పనిలో మీ అభిప్రాయాలకు గౌరవం ల‌భిస్తుంది. కొత్త అవకాశాలు, ప్రయాణాలు చేసే అవ‌కాశం ఉంది. వ్యాపారంలో విస్తరణకు మంచి సమయం. దాంపత్య జీవితంలో సంతోష‌క‌ర‌మై వాతావర‌ణం ఏర్ప‌డే అవ‌కాశాలు ఉన్నాయి. ఆర్థిక స్థిరత్వం ఉంటుంది.

55
మీనం – కష్టానికి గుర్తింపు, పదోన్నతులు
Image Credit : our own

మీనం – కష్టానికి గుర్తింపు, పదోన్నతులు

కుజ ప్రభావం కార్మిక స్థానాన్ని బలపరుస్తుంది. దీంతో కార్యాలయంలో మీ పనికి గుర్తింపు ల‌భిస్తుంది. ఉన్నత పదవి, బహుమతి అవకాశం ఉంది. ఒప్పందాలు సులభంగా పూర్తికావడం, కొలిగ్స్‌ సపోర్ట్ ల‌భిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్ర‌య‌త్నించే వారు శుభ‌వార్త వింటారు. అయితే ఖర్చులను తగ్గించుకుంటే ఆర్థిక భద్రత పెరుగుతుంది. మీ ప్రతిభ వెలుగులోకి వచ్చే సమయం ఇది.

గమనిక: పైన తెలిపిన వివరాలను పలువురు జ్యోతిష్య పండితులు తెలిపిన అంశాలు, ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Recommended image2
Numerology: ఈ తేదీల్లో పుడితే చిన్న వయసులోనే కోటీశ్వరులు అవుతారట
Recommended image3
Surya Gochar: మార్చిలో 4 సార్లు మారనున్న సూర్య గమనం, ఈ 3 రాశులకు లాటరీ తగిలినట్టే!
Related Stories
Recommended image1
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే
Recommended image2
Safe Countries for Women: ఈ దేశాల్లో మ‌హిళ‌లు వెరీ సేఫ్‌.. అత్యంత సుర‌క్షిత‌మైన కంట్రీస్ ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved