MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

ఈ వారం ఓ రాశివారు మంచి మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు!

Weekly Horoscope: ఈ వార ఫలాలు 2.11.2025 నుంచి 8.11.2025 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

3 Min read
Author : Kavitha G
Published : Nov 02 2025, 07:00 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
113
ఈ వారం రాశి ఫలాలు
Image Credit : Getty

ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు
Image Credit : Asianet News

మేష రాశి ఫలాలు

ముఖ్యమైన పనులలో జాప్యం కలిగినా నిదానంగా పూర్తిచేస్తారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు డబ్బు అందుతుంది. దూరపు బంధువుల రాక ఆనందం కలిగిస్తుంది. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. స్ధిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఊరట పొందుతారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు హోదాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో దైవ దర్శనాలు చేసుకుంటారు. వారం మధ్యలో ఖర్చులు పెరుగుతాయి. 

Related Articles

Related image1
నవంబర్ 2025 మాస ఫలాలు: ఈ 5 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది!
Related image2
ఈ 4 రాశుల వారికి కోపం చాలా ఎక్కువ.. ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు!
313
వృషభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృషభ రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అవరోధాలు తొలగుతాయి. ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఆర్థికంగా పురోగతి సాధిస్తారు. చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో చాలా కాలంగా పడుతున్న శ్రమ ఫలిస్తుంది. కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. సమాజంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నిరుద్యోగులకు సానుకూల ఫలితాలుంటాయి. వారం చివరిలో శ్రమ అధికమవుతుంది. 

413
మిథున రాశి ఫలాలు
Image Credit : Asianet News

మిథున రాశి ఫలాలు

కొన్ని వ్యవహారాలలో మీరు తీసుకున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. పాత విషయాలు గుర్తు చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులు మంచి మాట తీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. వారం ప్రారంభంలో కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.

513
కర్కాటక రాశి ఫలాలు
Image Credit : Asianet News

కర్కాటక రాశి ఫలాలు

నిరుద్యోగుల కలలు సాకారం అవుతాయి. సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది. గృహ, వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబ సభ్యులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం దిశగా సాగుతాయి. వ్యాపారాలు లాభాల బాటలో సాగుతాయి. వారం ప్రారంభంలో బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు నిరుత్సాహపరుస్తాయి. 

613
సింహ రాశి ఫలాలు
Image Credit : Asianet News

సింహ రాశి ఫలాలు

సన్నిహితులతో వివాదాలు పరిష్కారం చేసుకుంటారు. వృత్తి,  ఉద్యోగాలలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. దీర్ఘకాలిక సమస్యలు తొలగుతాయి. ఆర్థికంగా మరింత అనుకూల వాతావరణం ఉంటుంది. పాత మిత్రులతో కొన్ని విషయాలు చర్చిస్తారు. ఇంటా బయటా ఆదరణ పెరుగుతుంది. వారం మధ్యలో ఒక సంఘటన ఆశ్చర్యం కలిగిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు పొందుతారు. వారం మధ్యలో కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి.  

713
కన్య రాశి ఫలాలు
Image Credit : Asianet News

కన్య రాశి ఫలాలు

ముఖ్యమైన వ్యవహారాలు వాయిదా పడతాయి. కొన్ని విషయాలలో బంధువులతో అకారణంగా విభేదాలు కలుగుతాయి. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. చేపట్టిన పనులలో శ్రమ పెరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. పాతమిత్రులను కలుసుకొని కీలక విషయాలు చర్చిస్తారు. వృత్తి, వ్యాపారాలలో కొన్ని సమస్యలు బాధిస్తాయి. స్థిరాస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. ఉద్యోగులకు ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. వారం మధ్యలో మిత్రుల నుంచి శుభవార్తలు అందుతాయి.  

813
తుల రాశి ఫలాలు
Image Credit : Asianet News

తుల రాశి ఫలాలు

అవసరానికి డబ్బు అందుతుంది. ఆప్తులు నుంచి శుభవార్తలు వింటారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. సంఘంలో పరిచయాలు మరింత విస్తృతమవుతాయి. చిన్ననాటి మిత్రులతో కీలక విషయాలు చర్చిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో లాభాలు పొందుతారు. ఉద్యోగాలలో పని ఒత్తిడి నుంచి బయట పడతారు. వారం చివరిలో శ్రమ పెరుగుతుంది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది.  

913
వృశ్చిక రాశి ఫలాలు
Image Credit : Asianet News

వృశ్చిక రాశి ఫలాలు

నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆర్థికంగా కొంత మెరుగైన వాతావరణం ఉంటుంది. కుటుంబ వ్యవహారాలలో మీ ఆలోచనలు అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు కలిసివస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఉన్న సమస్యలు సర్దుమణుగుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఉద్యోగులు శాలరీ విషయంలో శుభవార్తలు వింటారు. కొన్ని రంగాల వారికి ఊహించని అవకాశాలు లభిస్తాయి. వారం ప్రారంభంలో వృథా ఖర్చులు పెరుగుతాయి. 

1013
ధనుస్సు రాశి ఫలాలు
Image Credit : Asianet News

ధనుస్సు రాశి ఫలాలు

చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. పాత మిత్రులతో దూర ప్రయాణాలు చేస్తారు. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. పిల్లల చదువు విషయాలపై దృష్టి సారిస్తారు. దీర్ఘకాలిక రుణ బాధలు తొలగుతాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలలో నష్టాలను అధిగమిస్తారు. ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించి అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వారం చివరిలో బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు వస్తాయి.

1113
మకర రాశి ఫలాలు
Image Credit : Asianet News

మకర రాశి ఫలాలు

చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది. సేవా కార్యక్రమాలకు డబ్బు సహాయం చేస్తారు. వ్యాపారులకు నూతన అవకాశాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో వివాదాల నుంచి బయటపడతారు. సోదరుల నుంచి స్థిరాస్థి లాభాలు అందుకుంటారు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఉద్యోగులకు పని ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం చివరిలో శ్రమ అధికమవుతుంది. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. 

1213
కుంభ రాశి ఫలాలు
Image Credit : Asianet News

కుంభ రాశి ఫలాలు

ఇంట్లో కొన్ని సంఘటనలు చికాకు కలిగిస్తాయి. అదనపు ఆదాయం ఉత్సాహాన్నిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆస్తి వివాదాల పరిష్కారానికి అవకాశాలు లభిస్తాయి. ప్రముఖుల నుంచి ఊహించని ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో కొత్త ఆలోచనలు అమలు చేస్తారు. ఉద్యోగులకు అదనపు బాధ్యతల నుంచి ఉపశమనం లభిస్తుంది. వారం చివరిలో గృహ నిర్మాణ ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.  

1313
మీన రాశి ఫలాలు
Image Credit : Asianet News

మీన రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. పాత అప్పులు తీర్చుతారు. చేపట్టిన వ్యవహారాలు సజావుగా పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. సోదరులతో స్థిరాస్తి వివాదాలు రాజీ అవుతాయి. పిల్లల వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ప్రయాణాలలో నూతన వ్యక్తులతో పరిచయాలు ఆనందం కలిగిస్తాయి. వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లాభాలు పొందుతారు. ఉద్యోగులకు కష్టానికి తగిన గుర్తింపు లభిస్తుంది. వారం ప్రారంభంలో ఆర్థిక ఇబ్బందులు తప్పవు. మిత్రులతో ఊహించని వివాదాలు కలుగుతాయి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
జ్యోతిష్యం
రాశి ఫలాలు
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image2
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు
Recommended image3
Birth Date: మొదటి సంతానం ఆడపిల్ల ఈ తేదీల్లో పుడితే..తండ్రికి లక్ష్మీ కటాక్షమే..!
Related Stories
Recommended image1
నవంబర్ 2025 మాస ఫలాలు: ఈ 5 రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది!
Recommended image2
ఈ 4 రాశుల వారికి కోపం చాలా ఎక్కువ.. ఎప్పుడూ గొడవ పడుతూనే ఉంటారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved