Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టిన వారు మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు..!
ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 6 కిందకే వస్తారు. వీరికి శుక్రుడు అధిపతి. శుక్రుడి ప్రభావం వీరిపై ఎప్పుడూ ఉంటుంది.

పుట్టిన తేదీ..
న్యూమరాలజీ మన జీవితాన్ని చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మనం పుట్టిన తేదీని ఆధారంగా చేసుకొని మన భవిష్యత్తును తెలుసుకోవచ్చు. ఈ రోజు మూడు ముఖ్యమైన తేదీల్లో పుట్టిన వారి గురించి తెలుసుకుందాం..
నెంబర్ 6..
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 6వ తేదీలో పుట్టిన వారు చాలా అదృష్టవంతులు అవుతారు. ఏ నెలలో అయినా 6, 15, 24 తేదీల్లో జన్మించిన వారంతా నెంబర్ 6 కిందకే వస్తారు. వీరికి శుక్రుడు అధిపతి. శుక్రుడి ప్రభావం వీరిపై ఎప్పుడూ ఉంటుంది. అందుకే, ఈ మూడు తేదీల్లో పుట్టినవారు ఎప్పుడూ లగ్జరీ లైఫ్ లీడ్ చేస్తారు. పుట్టినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నా, వీరు పెద్దగా అయ్యే సరికి ఐశ్వర్య వంతులు అవుతారు.
ఆకర్షణీయమైన వ్యక్తిత్వం
న్యూమరాలజీ ప్రకారం నెంబర్ 6 కి చెందిన వారి వ్యక్తిత్వం చాలా చాలా ఆకర్షణీయంగా, సౌమ్యంగా ఉంటుంది. జనాలు వీళ్ళతో త్వరగా ప్రభావితులవుతారు. వీరి మాట్లాడే మాటలు అందరికీ బాగా నచ్చేస్తాయి.
లగ్జరీ లైఫ్..
6వ నంబర్ వాళ్ళు లగ్జరీ లైఫ్ ని ఇష్టపడతారు. మంచి భోజనం, అందమైన దుస్తులు, సౌకర్యవంతమైన జీవనశైలిని ఇష్టపడతారు. అందమైన వస్తువులకు ఆకర్షితులవుతారు, అవి దుస్తులైనా, ఇంటి అలంకరణ వస్తువులైనా, కళలైనా.. వారు ఇష్టపడినట్లే.. వారికి లగ్జరీ లైఫ్ దొరుకుతుంది కూడా..
అంతేకాదు.. ఈ తేదీల్లో పుట్టిన వారు బంధాలకు ఎక్కువ విలువ ఇస్తారు. ఒక్కసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా అంగీకరిస్తే, వారికి పూర్తిగా అంకితమవుతారు.
సంగీతం, కళలు, నటనపై ఆసక్తి
ఈ తేదీల్లో పుట్టిన వారికి సృజనాత్మక రంగాలపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. కళాకారులు, నటీనటులు అవ్వడానికి ఆసక్తి చూపిస్తారు. అంతేకాకుండా.. వీరు మృదు స్వభావులు. ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. వీరు ఎవరితోనూ గొడవలు పడరు. ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడతారు. అందరూ అలానే ఉండాలి అని కోరుకుంటారు. ఎప్పుడూ సంతోషంగా ఉంటారు. తమ చుట్టూ ఉన్నవారిని కూాడా సంతోషంగా ఉంచాలని అనుకుంటూ ఉంటారు.