Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు పొరపాటున కూడా మద్యం ముట్టుకోకూడదు..!
కొన్ని తేదీల్లో జన్మించిన వారు మద్యం అస్సలు ముట్టుకోకూడదట. ఆ అలవాటు అలవరుచుకున్నారా.. వారికి భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

న్యూమరాలజీ ఏం చెబుతోంది?
జోతిష్యశాస్త్రంలో మనం పుట్టిన తేదీ, మన గ్రహ స్థితులు ఆధారంగా మన భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. అదే విధంగా న్యూమరాలజీ ప్రకారం కూడా మన వ్యక్తిత్వం, మన అభిరుచులు కూడా తెలుసుకోవచ్చు. అయితే, కొన్ని అలవాట్లు మన భవిష్యత్తుకు బంగారు బాట వేస్తే, మరికొన్ని చాలా నష్టాలు తెస్తాయి. అందుకే కొన్నింటిని వదులుకోవాలి. ప్రస్తుత కాలంలో మద్యం అలవాటు ఉన్నవారు చాలా మందే ఉండి ఉండొచ్చు. అయితే, న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో జన్మించిన వారు మద్యం అస్సలు ముట్టుకోకూడదట. ఆ అలవాటు అలవరుచుకున్నారా.. వారికి భవిష్యత్తులో చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంది. మరి, ఏ తేదీల్లో పుట్టిన వారు మందు ముట్టుకోకూడదో తెలుసుకుందామా...
పుట్టిన తేదీ ప్రకారం..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 2,7,9,11,16, 18, 20, 25, 27, 29 తేదీల్లో జన్మించిన వారు పొరపాటున కూడా మద్యం జోలికి వెళ్లకూడదు. వీరికి మద్యం వల్ల కలిగే నష్టం చాలా ఎక్కువ. ఉదాహరణకు 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారిపై చంద్రుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు చాలా ఎమోషనల్ గా, చాలా సున్నితంగా ఉంటారు. ఇలాంటివారు మద్యం తాగితే.. వారికి చిన్న విషయం కూడా చాలా పెద్దదిగా కనపడుతుంది. ఎవరైనా చిన్న మాట అన్నా, దానిని చాలా పెద్ది చేసి.. గొడవలు పడే అవకాశం ఎక్కువ.
కుజుడి ప్రభావం..
ఇక,7,16, 25 తేదీల్లో జన్మించిన వారిపై కేతువు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వీరు సహజంగా ఆత్మ పరిశీలన చేసుకునే స్వభావం కలిగి ఉంటారు. ఇలాంటి వారు మద్యం తాగడం వల్ల మరింత గందరగోళానికి గురౌతారు. స్థిరంగా ఆలోచించరు. దీని వల్ల చాలా ప్రమాదాలు కొని తెచ్చుకునే అవకాశం ఉంది.
ఇక, 9, 18, 27 తేదీల్లో జన్మించిన వారిపై కుజుడు ప్రభావం ఉంటుంది. దీని కారణంగా వీరు సహజంగా ఉత్సాహంగా ఉంటారు. ఇక.. మద్యం తాగితే వీరి ప్రవర్తన తట్టుకోవడం ఎవరి వల్లా కాదు. దీని వల్ల వీరికి విరోధాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.
శని ప్రతికూలంగా ఉన్నప్పుడు..
జన్మతేదీలతో పాటు, జన్మ చక్రంలో గ్రహ స్థితులూ కీలకంగా పనిచేస్తాయి. ఉదాహరణకు, బలహీనంగా ఉన్న చంద్రుడు భావోద్వేగ అస్థిరతకు దారితీస్తాడు. రాహువు కొన్ని ఇళ్లలో ఉన్నప్పుడు వ్యసనాల పట్ల ఆకర్షణను పెంచుతుంది. శని ప్రతికూలంగా ఉన్నప్పుడు ఒంటరితన భావన ఎక్కువగా పెరిగి.. దాని నుంచి బయటపడేందుకు మద్యం వైపు మొగ్గు ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో కూడా మద్యానికి లొంగకుండా ఉండాలి.
ఏ వారాల్లో మద్యం తాగకూడదు?
వేద జ్యోతిషం ప్రకారం మంగళవారం, శనివారం మద్యం సేవించకూడదని చెబుతారు. ఈ రోజులు కుజుడు, శనిగ్రహాలకు సంబంధించినవిగా పరిగణిస్తారు. ఈ గ్రహాల ప్రతికూల శక్తులను రెచ్చగొట్టకుండా ఉండేందుకు, ఆహారపు నియమాల్లో మద్యం, మాంసాహారం నివారించమని సూచిస్తారు.