MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Birth Month: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఏ రంగంలో అడుగుపెట్టినా నంబర్ వన్‌గా ఎదిగిపోతారు

Birth Month: ఈ నెలలో పుట్టిన వ్యక్తులు ఏ రంగంలో అడుగుపెట్టినా నంబర్ వన్‌గా ఎదిగిపోతారు

Birth Month: న్యూమరాలజీ ప్రకారం కొన్ని నెలల్లో పుట్టిన వారికి ప్రత్యేకమైన లక్షణాలు, అదృష్టం వంటివి దక్కుతాయి. అలాంటి వాటిల్లో జూన్ నెల ఒకటి. ఈ నెలలో పుట్టిన వారి జీవితం ఎలా ఉంటుందో తెలుసుకోండి. 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 06 2026, 09:58 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
న్యూమరాలజీ ప్రకారం
Image Credit : Gemini AI

న్యూమరాలజీ ప్రకారం

జ్యోతిష్య శాస్త్రంలో భాగంగా చెప్పుకునే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని నెలల్లో పుట్టిన వారి జీవితం చాలా ఆనందంగా ఉంటుంది. అంతేకాదు అదృష్టం, విజయం కూడా వీరికే కలిసి వస్తాయి. ఎలాంటి ఫీల్డ్ లో అడుగుపెట్టినా కచ్చితంగా నెంబర్ వన్ పొజిషన్ కి వచ్చే వారు ఉంటారు. అలాంటి నెల జూన్. న్యూమరాలజీ ప్రకారం జూన్ నెలలో పుట్టిన వారు జాతకరీత్యా విపరీతమైన అదృష్టాన్ని కలిగి ఉంటారు. 12 నెలల్లో జూన్ ఆరవ నెల. ఈ నెలలో పుట్టిన వారిలో నూటికి 90 మంది ఖచ్చితంగా ఏదో ఒక రంగంలో విజయాన్ని సాధించే తీరుతారు.

24
తెలివైన వారు
Image Credit : Getty

తెలివైన వారు

జూన్ నెలలో పుట్టిన వారు స్వతహాగానే తెలివైన వారు. ఏదైనా పనిని చురుకుగా చేస్తారు. ఏ విషయాన్ని అయినా త్వరగా అర్థం చేసుకుంటారు. అందరితో కలిసిపోయి మర్యాదగా ఉంటారు. వీరి ప్రవర్తన ఎదుటివారికి ఇట్టే నచ్చేస్తుంది. దీనివల్ల వారిని అందరూ ఇష్టపడతారు. అంతేకాదు వారు చెప్పే విషయాలను వింటారు. వారికి తోడుగా ఉండేందుకు సిద్ధంగా ఉంటారు. కాబట్టి జూన్ నెలలో ఉన్న వారికి స్నేహితులు, బంధువుల వల్ల కూడా అన్ని రకాలుగా కలిసివస్తుంది.

Related Articles

Related image1
Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ
Related image2
Salt Water Bath: నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే ఇన్ని లాభాలా? అయితే చేయాల్సిందే
34
ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి?
Image Credit : Getty

ఎలాంటి కెరీర్ ఎంచుకోవాలి?

జూన్ నెలలో పుట్టిన వారు తమ తెలివితేటల వల్ల మంచి కెరీర్ ను ఎంచుకుంటారు. వీరికి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా అధికంగా ఉంటాయి. ముఖ్యంగా సింగింగ్, రైటింగ్, నటన, జర్నలిజం, సోషల్ మీడియా వంటి రంగాల్లో వీరు అద్భుతంగా రాణించే అవకాశం ఉంది. అలాగే కౌన్సిలర్లుగా, టీచర్లుగా, ప్రొఫెసర్లుగా కూడా వీరు మంచి స్థాయికి చేరుకుంటారు. వీరికి మాటకారితనం ఎక్కువ. కాబట్టి ఇలాంటి రంగాల్లో వీరు అద్భుతంగా రాణించి నెంబర్ వన్ స్థాయికి సులువుగా చేరుకుంటారు. వీరికి నాయకత్వ బాధ్యతలు కూడా అప్పగిస్తే మరింత సమర్థవంతంగా పనిచేస్తారు.

44
ఈ విషయంలో జాగ్రత్త
Image Credit : Getty

ఈ విషయంలో జాగ్రత్త

జూన్ నెలలో పుట్టిన వారు మానసికంగా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు త్వరగా ఒత్తిడికి లోనవుతారు. ఎప్పుడైతే ఒత్తిడికి లోనవుతామో మానసికంగా, శారీరకంగా బలహీనంగా మారుతాము. కాబట్టి జూన్ నెలలో పుట్టిన వారు ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒత్తిడిని తగ్గించుకోవడానికి యోగా, ధ్యానం వంటివి చేయాలి. చిన్న చిన్న విషయాలకే భావోద్వేగాలకు లోనవ్వకూడదు. ఎప్పుడూ కూడా దృఢమైన మనసుతో అడుగు ముందుకు వేయాలి. ఇలా చేస్తే జూన్ నెలలో పుట్టిన వారు ఏ రంగంలో అడుగుపెట్టినా కూడా అదృష్టం వారి వెంటే ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జ్యోతిష్యం
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Jupiter Mars Blessings: త్వరలో ఈ 5 రాశులవారికి తిరగనున్న దశ.. వీరే ఇక డబ్బుకు కేరాఫ్ అడ్రెస్
Recommended image2
Zodiac signs: ఈ అమ్మాయిలు అత్తారింట్లో అడుగుపెట్టగానే.. వారి కష్టాలన్నీ తీరిపోతాయి,ఐశ్వర్యం పెరుగుతుంది
Recommended image3
Astrology: ఈ 3 రాశుల వారు 40 ఏళ్ల వయసు దాటాక భారీగా సంపాదించే అవకాశం
Related Stories
Recommended image1
Illu Illalu Pillalu April 6 Episode: మళ్లీ రామరాజు ఇంటికి పెద్ద కోడలు వల్లి, చందు తప్పతాగి రచ్చ
Recommended image2
Salt Water Bath: నీటిలో ఉప్పు కలుపుకుని స్నానం చేస్తే ఇన్ని లాభాలా? అయితే చేయాల్సిందే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved