Birth Date: ఈ 3 తేదీల్లో పుట్టిన అమ్మాయిలు ఎక్కుడున్నా మహారాణులే!
సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివైనవారట. బుధ గ్రహ ప్రభావం వల్ల వీరు జీవితంలో విజయం సాధిస్తారట. మహా రాణిలా జీవిస్తారట. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఇలా ఉంటారో ఇక్కడ చూద్దాం.

ఏ తేదీల్లో పుట్టినవారు తెలివైనవారు?
సంఖ్యాశాస్త్రం ఆధారంగా వ్యక్తుల భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీ, టైం వారి స్వభావంపై ప్రభావం చూపుతుంది. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా తెలివిగా ఉంటారట. వారు అనుకున్నది సాధించేవరకు నిద్రపోరట. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఈ లక్షణాలను కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.
మూల సంఖ్య 5 కలిగిన అమ్మాయిలు
సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 5, 14 లేదా 23 తేదీల్లో పుట్టిన అమ్మాయిల మూల సంఖ్య 5 అవుతుంది. ఈ సంఖ్య బుధ గ్రహానికి సంబంధించింది. మూలసంఖ్య 5ని మాటలు, తెలివితేటలకు ప్రతీకగా భావిస్తారు. మూల సంఖ్య 5 కలిగిన అమ్మాయిలపై బుధ గ్రహం ప్రభావం ఉంటుంది. దీనివల్ల వారు చాలా తెలివిగా ఉంటారు. మంచి మాటతీరును కలిగి ఉంటారు. మహారాణిలా జీవిస్తారు.
వీరిలోని ప్రత్యేక గుణాలు..
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూలసంఖ్య 5 కలిగిన అమ్మాయిలు చిన్నప్పటి నుంచే ప్రతి పనిలో ముందుంటారు. అది చదువు కావచ్చు లేదా ఏదైనా సృజనాత్మకతకు సంబంధించింది కావచ్చు. వీరు ఉన్నత చదువులు పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాలు చేయవచ్చు. లేదా ఏదైనా కంపెనీలో మంచి హోదా సంపాదించవచ్చు.
కుటుంబ పెద్దగా..
ఈ తేదీల్లో పుట్టినవారు ఒకవేళ హౌజ్ వైఫ్ అయినా కూడా.. మొత్తం కుటుంబం వారి చేతుల్లోనే ఉంటుంది. వారు ఏం కోరుకుంటారో కుటుంబంలో అదే జరుగుతుంది. కుటుంబ జీవితంలో కూడా వీరు విజయం సాధిస్తారు. భర్త, పిల్లలు వీరికి విధేయులుగా ఉంటారు.
ఎలాంటి సమస్యనైనా..
ఈ తేదీల్లో పుట్టిన మహిళలు తెలివితేటల్లో అసమానులు. వారు పెద్ద సమస్యలను కూడా సులభంగా పరిష్కరిస్తారు. వీరు ఆత్మగౌరవంతో జీవిస్తారు. ఎవరితో సంబంధం కొనసాగించాలో.. ఎవరితో దూరంగా ఉండాలో వీరికి బాగా తెలుసు.
డబ్బు సమస్య ఉండదు!
ఈ తేదీల్లో పుట్టిన అమ్మాయిలు చాలా చురుకుగా ఉంటారు. ఏ విషయాన్ని అయినా చక్కగా గుర్తుపెట్టుకుంటారు. వీరి జీవితంలో ఎప్పుడూ డబ్బు కొరత ఉండదు. పేదింట్లో పుట్టినా.. ధనవంతులైన కుటుంబానికి కోడలిగా వెళ్తారు.
గమనిక:
ఈ సమాచారం.. పాఠకుల ఆసక్తి మేరకు పలువురు జ్యోతిష్య నిపుణులు తెలిపిన అంశాల ఆధారంగా అందించింది మాత్రమే.