Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారు భార్య మాట అస్సలు వినరు! ఎందుకో తెలుసా?
సంఖ్యాశాస్త్రం ప్రకారం పుట్టిన తేదీ, సమయం ఆధారంగా వ్యక్తుల స్వభావాన్ని అంచనా వేయచ్చు. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భార్య మాట అస్సలు వినరట. అన్నీ తమకే తెలుసనే భావనలో ఉంటారట. మరి ఏ తేదీల్లో పుట్టినవారు వైఫ్ మాట వినరో ఇక్కడ చూద్దాం.

ఏ తేదీల్లో పుట్టినవారు భార్య మాట వినరు?
పెళ్లి చాలా పవిత్రమైనది. ఇద్దరు వ్యక్తులు జీవింతాంతం కలిసి ఉండాలంటే వారి మధ్య సఖ్యత చాలా అవసరం. ఒకరి భావాలను మరొకరు అర్థం చేసుకోవడం ముఖ్యం. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని తేదీల్లో పుట్టిన అబ్బాయిలు.. భార్య మాట అస్సలు వినరట. వారు చెప్పిన మాటను పక్కన పెట్టడమే పనిగా పెట్టుకుంటారట. మరి ఏ తేదీల్లో పుట్టినవారు భార్య మాట అస్సలు వినరో ఇక్కడ చూద్దాం.
1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారు..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన అబ్బాయిలు.. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. వీరు స్వతంత్రంగా ఆలోచిస్తారు. ఎవరి దగ్గర తలవంచడానికి ఇష్టపడరు. వారికి నచ్చినట్లు జీవిస్తారు. భార్య మాట అస్సలు వినరు. భార్య ఏదైనా సలహా ఇస్తే.. నాకన్నీ తెలుసు. నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు అన్నట్లుగా చూస్తారు.
8, 17, 26 తేదీల్లో పుట్టినవారు..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో జన్మించిన వారిపై శనిగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టినవారు కాస్త గంభీరంగా ఉంటారు. భార్య చెప్పిన మాట విన్నట్లే ఉంటారు. కానీ.. మనసులో మాత్రం, ఆమె మాట వినడం అవసరమా? అని ఆలోచిస్తారు. చివరికి వారు అనుకున్నదే చేస్తారు. వారికి నచ్చిన నిర్ణయమే తీసుకుంటారు.
5, 14, 23 తేదీల్లో పుట్టినవారు..
ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారిపై బుధుడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. బుధ గ్రహ ప్రభావంతో వీరు చురుకుగా, జాగ్రత్తగా ఉంటారు. ఈ తేదీల్లో పుట్టినవారు ఎక్కువగా మాట్లాడతారు. భార్య ఏదైనా మాట్లాడితే మధ్యలోనే అడ్డుకుంటారు. నిజానికి భార్య మాట వినాలని వీరికి అస్సలే ఉండదు. తమకే అన్ని తెలుసనే భావనలో ఉంటారు.
4, 13, 22, 31 తేదీల్లో జన్మించిన వారు..
న్యూమరాలజీ ప్రకారం ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారు మకరరాశికి చెంది ఉంటారు. వీరు క్రమశిక్షణ కలిగి ఉంటారు. గంభీరంగా కనిపిస్తారు. భార్య చెప్పే విషయాలను వీరు అస్సలే పట్టించుకోరు. భార్య చెప్పే ఏ విషయానికైనా ముందుగా "కాదు" అని చెప్పడం వీరి నైజం.
గమనిక
ఈ సమాచారం.. పాఠకుల ఆసక్తి మేరకు పలువురు జ్యోతిష్య నిపుణుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించింది మాత్రమే.