Black thread: పెళ్లైన ఆడవాళ్లు నల్లదారం కట్టుకోవచ్చా? జ్యోతిష్యం ఏం చెబుతోంది?
ఆడ, మగ, చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రస్తుతం అందరు కాలికి లేదా చేతికి నల్లదారం కట్టుకోవడం మనం చూస్తునే ఉన్నాం. సాధారణంగా ఈ నల్లదారం చెడు దృష్టి పడకుండా కాపాడుతుందని నమ్మకం. అయితే పెళ్లైన ఆడవాళ్లు నల్లదారం కట్టుకుంటే ఏమవుతుందో మీకు తెలుసా? దీని గురించి జ్యోతిష్యం ఏం చెబుతుందో ఇక్కడ తెలుసుకుందాం.

జ్యోతిష్య శాస్త్రంలో నలుపు రంగుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దుష్ట కన్ను నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలన్నా లేదా ప్రతికూల శక్తి నుంచి దూరంగా ఉండాలన్నా నల్లదారం కట్టుకోవాలని పెద్దలు చెబుతుంటారు. అయితే నల్లదారం అందరు కట్టుకోవచ్చా? మరీ ముఖ్యంగా పెళ్లైన ఆడవాళ్లు. వారు కట్టుకుంటే ఏమైనా సమస్యలు వస్తాయా? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతోందో ఇక్కడ చూద్దాం.
నల్లదారం ఎవరు కట్టుకోవద్దు?
కొందరు నల్ల దారం కట్టుకోవద్దని, నల్ల దారం వారికి అశుభమని జ్యోతిష్యంలో చెప్పబడింది. వివాహిత స్త్రీలు నల్ల దారం కట్టుకోవచ్చా లేదా అనే ప్రశ్న చాలామందిలో ఉంటుంది. ఎందుకంటే పెళ్లైన ఆడవాళ్లకు నలుపు రంగు అశుభంగా భావిస్తుంటారు. కొన్ని చోట్ల అయితే పెళ్లైన ఆడవాళ్లు నలుపు రంగు దుస్తులు కూడా వేసుకోవద్దని.. దానివల్ల చెడు జరుగుతుందని నమ్ముతారు. మరి అలాంటి పరిస్థితుల్లో వివాహిత స్త్రీలు నల్ల దారం కట్టుకోవచ్చా లేదా అనే విషయం ఇక్కడ తెలుసుకుందాం.
పెళ్లైన ఆడవాళ్లు నల్లదారం కట్టుకోవచ్చా?
వాస్తవానికి నలుపు రంగు శని భగవానుడికి చాలా ఇష్టమైందిగా చెబుతారు. నల్ల దారం కట్టుకుంటే, శని భగవానుడి ఆశీస్సులు అలాగే ఉంటాయట. అంతేకాకుండా సడే సతి, ఇతర ప్రతికూల పరిస్థితుల నుంచి ఉపశమనం లభిస్తుందట. కాబట్టి కొన్ని నియమాలతో వివాహిత స్త్రీలు తప్పకుండా నల్ల దారం కట్టుకోవచ్చు. దీనివల్ల వారి జాతకంలో శని దోషం ఉండదు.
ఈ నియమాలు పాటించాలి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని నియమాలతో మాత్రమే వారు నల్లదారాన్ని ధరించాలి. నల్లదారాన్ని కాలికి కట్టడానికి బదులుగా, చేతికి కట్టుకోవడం మంచిదని జ్యోతిష్యం చెబుతోంది. వివాహమైన స్త్రీ చేతిలో బృహస్పతి నివసిస్తాడట. బృహస్పతితో శని రావడం శుభంగా పరిగణించబడుతుందట.