MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • Jupiter Transit: పునర్వసు నక్షత్రంలోకి గురు గ్రహం.. ఈ రాశుల తలరాత మారడం ఖాయం..!

Jupiter Transit: పునర్వసు నక్షత్రంలోకి గురు గ్రహం.. ఈ రాశుల తలరాత మారడం ఖాయం..!

Jupiter Transit: గురు గ్రహం తన సొంత నక్షత్రంలోకి వక్రగమనంలోకి ప్రవేశించాడు. గురు గ్రహం ఈ నక్షత్ర మార్పు.. కొన్ని రాశుల వారి జీవితాన్ని పూర్తిగా మార్చేయనుంది. ఆర్థికంగా ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 01 2026, 11:01 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
Jupiter Transit
Image Credit : istock

Jupiter Transit

గురు గ్రహం వక్రగమనంలో ప్రయాణించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో తన సొంత నక్షత్రమైన పునర్వసులో అడుగుపెట్టాడు. దీని కారణంగా కొన్ని రాశుల తలరాత పూర్తిగా మారిపోనుంది. గురు గ్రహం జనవరి 30న ఈ నక్షత్రంలోకి అడుగుపెట్టగా.. ఏప్రిల్ 20 వ తేదీ వరకు ఇదే నక్షత్రంలో ఉండనున్నాడు. దీని కారణంగా.. నాలుగు రాశుల జీవితం అద్భుతంగా మారుతుంది. సంపద పెరగడంతో పాటు.. కీర్తి ప్రతిష్ఠలు కూడా పెరుగుతాయి. మరి, ఆ రాశులేంటో చూద్దాం..

25
మిథున రాశి..
Image Credit : Asianet News

మిథున రాశి..

గురు గ్రహం పునర్వసు నక్షత్రంలోకి సంచారం చేయడం మిథున రాశివారికి చాలా శుభప్రదంగా ఉంటుంది. గురు సంచారం కారణంగా, మిథున రాశివారు శారీరకంగా, మానసికంగా దృఢంగా కనిపిస్తారు. ప్రతి పనిలోనూ చాలా చురుకుగా ఉంటారు. ఈ సమయం ఉద్యోగం, వ్యాపారంలో లాభాల అవకాశాలను పెంచుతుంది. చాలా కాలంగా ఒక ఆగిపోయిన పనులు ఇప్పుడు జరుగుతాయి. ఆర్థికంగా మంచి స్థాయికి వెళతారు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకుంటుంది. గురు గ్రహం ఆశీర్వాదం కారణంగా.. ఈ రాశివారికి కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు.

Related Articles

Related image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మాట మీద నిలపడతారు, నమ్మకానికి మారుపేరు..!
Related image2
Mercury Jupiter Transit: బుధ-గురు గ్రహాల సంయోగం.. ఈ 3 రాశులకు డబుల్ జాక్ పాట్
35
కర్కాటక రాశి..
Image Credit : Asianet News

కర్కాటక రాశి..

పునర్వసు నక్షత్రంలో గురు గ్రహ సంచారం కర్కాటక రాశివారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కర్కాటక రాశివారి వ్యక్తిగత, వృత్తి జీవితంలో పూర్తి అదృష్టం లభిస్తుంది. మీరు ప్రణాళిక వేసుకున్న అన్ని పనులు సులభంగా పూర్తి అవుతాయి. విద్య, వృత్తి, వ్యక్తిగతంగా మంచి అభివృద్ధి సాధించగలరు. ఉన్నత విద్య లేదా పోటీ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులు.. తమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి.ఊహించని విధంగా చేతికి డబ్బు అందుతుంది.

45
తుల రాశి..
Image Credit : Asianet News

తుల రాశి..

పునర్వసు నక్షత్రంలోకి గురు గ్రహ సంచారం చేయడం తుల రాశివారికి చాలా శుభప్రదంగా మారుతుంది. అదృష్టం పెరుగుతుంది. వ్యాపారాల్లో విపరీతంగా లాభాలు అందుకుంటారు. కొత్త ఉద్యోగ లేదా వ్యాపారంలో అవకాశాలు పొందుతారు. కుటుంబంలో శాంతి, ఆనందం నెలకొంటాయి. గురు గ్రహ ఆశీర్వాదంతో తుల రాశివారికి ఆర్థిక లాభాలు,కెరీర్ లో పురోగతి సాధిస్తారు. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు పొందుతారు.

55
మీన రాశి...
Image Credit : Asianet News

మీన రాశి...

పునర్వసు నక్షత్రంలోకి గురు గ్రహ సంచారం మీన రాశివారికి అనేక లాభాలను తీసుకువస్తుంది. ఏవైనా పెద్ద సమస్యలు ఉంటే.. అవి ఈ సమయంలో తగ్గిపోతాయి. కొత్త ప్రాజెక్టులు చేసే అవకాశాలు వస్తాయి. ఆర్థిక లాభాలు తెరుచుకుంటాయి. అప్పుల బాధ తీరుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. చేసే పనుల్లో విజయం సాధిస్తారు. సమాజంలో ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. మీ బాధ్యతలన్నీ సవ్యంగా నెరవేర్చగలుగుతారు. పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఏషియానెట్ న్యూస్
జ్యోతిష్యం

Latest Videos
Recommended Stories
Recommended image1
Zodiac Compatibility: ఏ రాశి పురుషులు ఏ రాశి మహిళలను పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు?
Recommended image2
Today Rasi Phalalu: నేడు ఓ రాశివారు డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు!
Recommended image3
AI Horoscope: ఓ రాశివారు ఈ రోజు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు
Related Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టినవారు మాట మీద నిలపడతారు, నమ్మకానికి మారుపేరు..!
Recommended image2
Mercury Jupiter Transit: బుధ-గురు గ్రహాల సంయోగం.. ఈ 3 రాశులకు డబుల్ జాక్ పాట్
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved