MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Astrology
  • ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో నిజాయతీగా ఉంటారు.. అస్స‌లు మోసం చేయ‌రు

ఈ తేదీల్లో పుట్టిన వారు ప్రేమలో నిజాయతీగా ఉంటారు.. అస్స‌లు మోసం చేయ‌రు

Birth Date: న్యూమరాలజీ ప్రకారం మనం పుట్టిన తేదీ ఆధారంగా మన స్వభావం, ఆలోచనలు ఉంటాయని చెబుతుంటారు. రాడిక్స్ నెంబర్ ఆధారంగా మన వ్యక్తిత్వాన్ని అంచనా వేస్తుంటారు. న్యూమరాలజీ ప్రకారం రాడిక్స్ నెంబర్ 1 వారిలో ఉండే లక్ష‌ణాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Nov 16 2025, 09:15 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
రాడిక్స్ నెంబ‌ర్ ఎలా లెక్కిస్తారు.?
Image Credit : Asianet News

రాడిక్స్ నెంబ‌ర్ ఎలా లెక్కిస్తారు.?

1, 10, 19, 28 తేదీల్లో జన్మించిన వారి మూలాంకం 1గా భావిస్తారు. అంటే మీరు జ‌న్మించిన తేదీలోని నెంబ‌ర్స్‌ను యాడ్ చేస్తే వ‌చ్చే నెంబ‌ర్‌ను రాడిక్స్ నెంబ‌ర్ అంటారు. రాడిక్స్ నెంబ‌ర్ 1కు అధిపతి గ్రహం సూర్యుడు. సూర్యుడు అంటే నాయకత్వం, ధైర్యం, గౌరవం, విజయం, శక్తి వంటి లక్షణాల సూచిక. అందుకే ఈ తేదీల్లో పుట్టినవారి వ్యక్తిత్వంలో సహజంగా ఆత్మవిశ్వాసం, ఆధిపత్య లక్షణాలు ఉంటాయి.

25
వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?
Image Credit : Pixabay

వీరి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది?

ఆత్మవిశ్వాసం ఎక్కువ: వీరు ఎలాంటి పని చేసినా ధైర్యంగా ముందుకు వెళ్తారు. ఇతరులపై ఆధారపడటం వీరి స్వభావం కాదు.

స్వతంత్రంగా నిర్ణయాలు: తదేకంగా ఆలోచించి, స్పష్టమైన నిర్ణయాలు తీసుకుంటారు. వారికి స్వేచ్ఛ, ఆలోచనల స్వాతంత్రం చాలా ముఖ్యం.

గౌరవం, నాయకత్వం: ఎక్కడ ఉన్నా నాయకత్వం తీసుకునే ధైర్యం వీరిలో సహజంగా ఉంటుంది. ఇవ్వాళ చిన్న స్థాయిలో ఉన్నా, భవిష్యత్తులో ఎదిగే అవకాశాలు బలంగా ఉంటాయి.

Related Articles

Related image1
ఈ రాశి వారు వ‌చ్చే వారం జాగ్ర‌త్త‌గా ఉండాలి.. బంధాలు దెబ్బ‌తినే అవ‌కాశాలు
Related image2
ఏపీలో ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం.. రూ. 1201 కోట్లతో భారీ సంస్థకు శంకుస్థాప‌న
35
పనిలో, రోజువారీ జీవితంలో కీలక లక్షణాలు:
Image Credit : stockPhoto

పనిలో, రోజువారీ జీవితంలో కీలక లక్షణాలు:

పనిలో పరిపూర్ణత: ఏ పని చేసినా శ్రద్ధగా, పూర్తి సిద్ధతతో చేస్తారు. చిన్న పనైనా, పెద్ద పనైనా వీరికి నాణ్యత చాలా ముఖ్యం.

సమస్యలు వచ్చినా భయపడరు: ఇబ్బందులు వచ్చినప్పుడు తొందరపడకుండా ప్రశాంతంగా ఆలోచిస్తారు.  ప్రారంభంలో కష్టాలు ఎక్కువైనా, చివరకు విజయం సాధించడం వీరి ప్రత్యేకత.

45
ప్రేమ జీవితం ఎలా ఉంటుంది.?
Image Credit : Pixabay

ప్రేమ జీవితం ఎలా ఉంటుంది.?

ప్రేమిస్తే నిజాయితీగా ప్రేమిస్తారు: వీరు ఒకరిని ప్రేమిస్తే దానిని జీవితాంతం సీరియస్‌గా తీసుకుంటారు. మోసం, అబద్ధం, నమ్మకద్రోహం లాంటివి అస్సలు సహించరు.

భాగస్వామికి స్వేచ్ఛ ఇస్తారు: బంధాల్లో బలవంతపు నియమాలు పెట్టరు. ఎవరినైనా కట్టిపడేయడం వీరి స్టైల్ కాదు.

గౌరవం ఇస్తారు: మీ భాగ‌స్వామి వ్యక్తిగత జీవితాన్ని గౌరవిస్తారు. వారికి స్వంతమైన సమయం కావాలంటే ప్రశాంతంగా అంగీకరిస్తారు.

55
బంధం బ‌లంగా ఉండాలంటే..
Image Credit : Getty

బంధం బ‌లంగా ఉండాలంటే..

రాడిక్స్ నెంబ‌ర్‌ 1 గలవారిలో చిన్న అహంకారం, తమ నిర్ణయాలపై అధిక పట్టుదల ఉంటుంది. అది కొన్నిసార్లు సంబంధంలో దూరాలు తీసుకురాగలదు. అందుకే కొంచెం వినయంతో వ్యవహరించడం మంచిది. భాగస్వామి అభిప్రాయానికి విలువ ఇవ్వడం, భావోద్వేగాలను స్పష్టంగా చెప్పడం, ఇలా చేస్తే ప్రేమ జీవితం మరింత అందంగా మారుతుంది.

గమనిక: పైన తెలిపిన విషయాలను కేవలం ఇంటర్నెట్ వేదికగా అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
జ్యోతిష్యం
ఆధ్యాత్మిక విషయాలు

Latest Videos
Recommended Stories
Recommended image1
Birth Stars: ఈ నక్షత్రాల్లో పుట్టిన వారికి ఒక కష్టం తీరగానే.. మరో కష్టం వచ్చేస్తుంది..!
Recommended image2
Rahu Zodiac signs: మాఘ మాసంలో రాహువు దయతో ఈ 4 రాశులకు డబ్బుల వర్షమే
Recommended image3
Maha Shivratri 2026 : శివ పురాణంలో చెప్పిన ధనలాభ ఉపాయాలు.. ఈ శివరాత్రికి ట్రై చేశారో ధనవంతులే
Related Stories
Recommended image1
ఈ రాశి వారు వ‌చ్చే వారం జాగ్ర‌త్త‌గా ఉండాలి.. బంధాలు దెబ్బ‌తినే అవ‌కాశాలు
Recommended image2
ఏపీలో ఈ ప్రాంత రూపురేఖ‌లు మార‌డం ఖాయం.. రూ. 1201 కోట్లతో భారీ సంస్థకు శంకుస్థాప‌న
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved