- Home
- Astrology
- Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు, టాలెంట్ తో ఆకట్టుకుంటారు..!
Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారు లైఫ్ లో కచ్చితంగా ఫేమస్ అవుతారు, టాలెంట్ తో ఆకట్టుకుంటారు..!
Birth Date: న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టినవారు అయస్కాంతం లాంటి వ్యక్తిత్వం కలిగి ఉంటారు.మరికొందరు..తమ అద్భుతమైన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకర్షిస్తారు. మరి, ఏ తేదీల్లో పుట్టినవారు లైఫ్ లో తొందరగా సక్సెస్ అవుతారో చూద్దాం...

పుట్టిన తేదీ 1..
ఏ నెలలో అయినా 1వ తేదీలో పుట్టిన వారు సహజంగానే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఈ తేదీని గ్రహాల రాజు అయిన సూర్యుడు పాలిస్తాడు. సూర్యుడు ఉన్నత చైతన్యానికి, అధికారానికి ప్రతీక.
ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కడికి వెళ్లినా ఒక ప్రత్యేకమైన వెలుగును ప్రసరింపజేస్తారు. వీరు సాధించే వరకు శ్రమించే పట్టుదల కలిగి ఉంటారు. మీరు వీరిని ఇష్టపడినా, ఇష్టపడకపోయినా.. వీరికి ఉన్న బలమైన వ్యక్తిత్వాన్ని చూసి ఆకర్షితులు కాకుండా ఉండలేరు. వీరి ఆత్మవిశ్వాసమే వీరిని వెలుగులోకి తెస్తుంది. లైఫ్ లో మంచి స్థాయికి వెళతారు.
పుట్టిన తేదీ 7..
ఏ నెలలో అయినా 7వ తేదీలో పుట్టిన వారు కూడా జీవితంలో మంచి స్థాయికి వెళతారు. లైఫ్ లో గొప్ప స్థాయికి వెళతారు. ముఖ్యంగా ఫేమస్ అవుతారు. వీరు నిశ్శబ్దంగా ఉంటూనే ప్రపంచాన్ని ప్రభావితం చేస్తారు.ఈ తేదీలో పుట్టిన వారికి గ్రహాల ప్రభావం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది.
ఈ తేదీల్లో పుట్టిన వారిలో ఒక తెలియని అయస్కాంతం ఉంటుంది. ప్రజలు వీరిని చూడగానే తమకు బాగా తెలిసిన వారిలా లేదా తమ కలల ప్రపంచంలోని వ్యక్తిలా భావిస్తారు. వీరి కవితాత్మక దృక్పథం, భావోద్వేగ పూరితమైన ఆలోచనలు కోట్లాది మంది హృదయాలను హత్తుకుంటాయి. వీరు మౌనంగా ఉంటూనే ప్రపంచాన్ని జయిస్తారు.
15వ తేదీ..
ఏ నెలలో అయినా 15వ తేదీలో పుట్టిన వారు చాలా ఆకర్షణీయంగా, అందంగా ఉంటారు. రాజసం ఉట్టిపడేలా ఉంటారు. ఈ తేదీలో పుట్టిన వారికి శుక్ర గ్రహం అధిపతి.
వ్యక్తిత్వం: వీరి మాటల్లో, చూపుల్లో ఒక మంత్రముగ్ధమైన ఆకర్షణ ఉంటుంది. ఇతరులు వీరిలా ఉండాలని లేదా వీరితో స్నేహం చేయాలని కోరుకుంటారు. వీరిలోని దౌత్య స్వభావం , మర్యాదపూర్వక ప్రవర్తన కారణంగా.. ఇతరులకు సాధ్యం కాని క్లిష్టమైన పనులు కూడా వీరికి సులభంగా జరిగిపోతాయి. కీర్తి వీరికి అలంకారంలా మారుతుంది.
23వ తేదీ..
ఏనెలలో అయినా 23వ తేదీలో జన్మించిన వారు అద్భుతమైన కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉంటారు. మాటలతోనే అందరినీ ఆకట్టుకుంటారు. వీరిని బుధ గ్రహం పాలిస్తూ ఉంటుంది. అందుకే... వీరికి తెలివితేటలు చాలా ఎక్కువగా ఉంటాయి.
వ్యక్తిత్వం: వీరు చాలా సరదాగా ఉంటారు. వీరితో మాట్లాడటం ఎవరికైనా చాలా సులభంగా అనిపిస్తుంది. ఏ సందర్భానికైనా త్వరగా అలవాటు పడే గుణం వీరిలో ఉంటుంది. ఈ ప్రత్యేకమైన నైపుణ్యం వల్ల వీరు సరైన సమయంలో సరైన వ్యక్తులను కలిసి, అదృష్ట అవకాశాలను అందిపుచ్చుకుంటారు. వీరి చుట్టూ ఎప్పుడూ ఒక సందడి ఉంటుంది.

