MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • Talliki vandanam: ఒకే కుటుంబానికి రూ. 1.56 ల‌క్ష‌ల త‌ల్లికి వందనం నిధులు..

Talliki vandanam: ఒకే కుటుంబానికి రూ. 1.56 ల‌క్ష‌ల త‌ల్లికి వందనం నిధులు..

ఎన్నిక‌ల ముందు ఇచ్చిన హామీ మేర‌కు కూట‌మి ప్ర‌భుత్వం ఒక్కో హామీని నెర‌వేరుస్తూ వ‌స్తోంది. ఈ క్ర‌మంలోనే ప్ర‌భుత్వం ఏర్ప‌డి ఏడాది గ‌డుస్తోన్న సంద‌ర్భంగా త‌ల్లికి వంద‌నం ప‌థ‌కాన్ని ప్రారంభించింది. 

2 Min read
Author : Narender Vaitla
| Updated : Jun 16 2025, 11:41 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తల్లికి వందనం
Image Credit : iTDP Official @ X

తల్లికి వందనం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 'తల్లికి వందనంస‌ పథకాన్ని తీసుకొచ్చింది. ఆర్థిక ఇబ్బందుల కార‌ణంగా విద్య ఆగ‌కూడ‌ద‌న్న ల‌క్ష్యంతో ప్రారంభించారు. ఒక్కో విద్యార్థికి రూ. 13,000 చొప్పున నేరుగా త‌ల్లి ఖాతాలో డ‌బ్బు జ‌మ చేశారు. నిజానికి రూ. 15 వేలు కాగా, రూ. 2 వేలు స్కూలు నిర్వ‌హ‌ణ‌కు అందించారు.

25
ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత మందికి
Image Credit : iTDP Official @ X

ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత మందికి

గ‌తంలో వైసీపీ అమ్మ ఒడి పేరుతో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేసిన విష‌యం తెలిసిందే. అయితే ఆ స‌మ‌యంలో ఇంట్లో ఒక బిడ్డ‌కు మాత్ర‌మే డ‌బ్బులు అందించారు. కానీ చంద్ర‌బాబు నాయుడు తాము అధికారంలోకి వ‌స్తే ఎంత మంది పిల్ల‌లు ఉంటే అంత మందికి డ‌బ్బులు ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేర‌కు ఇప్పుడు చ‌దువుకునే పిల్ల‌లంద‌రికీ డ‌బ్బు జ‌మా చేశారు.

Related Articles

Related image1
Tirumala: హైద‌రాబాద్ టూ తిరుమ‌ల ఫ్లైట్ జర్నీ.. ఒక్క రోజులో శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకొని రావొచ్చు. బెస్ట్ టూర్ ప్యాకేజీ
Related image2
Saving scheme: ప్ర‌తీ నెల‌ మీ జీతంలో రూ. 2 వేలు ప‌క్క‌న పెట్టండి చాలు.. రూ. 11 ల‌క్ష‌లు పొందొచ్చు.
35
ఒకే ఇంటిలో 12 మంది ల‌బ్ధిదారులు
Image Credit : lokeshforpeople_official @ instagram

ఒకే ఇంటిలో 12 మంది ల‌బ్ధిదారులు

అన్నమయ్య జిల్లాలోని కలకడ గ్రామానికి చెందిన ఓ ఉమ్మడి కుటుంబంలో ఒక్కసారిగా 12 మంది పిల్లలకు నగదు జమ కావడం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. కలకడకు చెందిన హసీనుల్లాకు నలుగురు కొడుకులు కాగా ఉమ్మడి కుటుంబంలో ఉన్న నలుగురు తల్లుల సంతానం 12 మందికి తల్లికి వందనం కింద రూ.1.56 లక్షలు లభించాయి. నసీన్, బి.ముంతాజ్, ఇరానీ, ఆసియా అనే తల్లుల ఖాతాల్లో డబ్బు జమ కావడంతో వారి కుటుంబంలో ఆనందం వెల్లివిరిసింది.

45
వైర‌ల్ అవుతోన్న వీడియో
Image Credit : iTDP Official @ X

వైర‌ల్ అవుతోన్న వీడియో

ఇలా ఒకే కుటుంబానికి రూ. 1.56 ల‌క్ష‌లు రావ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. అయితే వీరు ఉమ్మ‌డి కుటుంబం కావ‌డంతో అన్ని నిధులు ఒకే ఇంటికి వెళ్లిన‌ట్లు అనిపిస్తోంది. వేరు వేరు కుటుంబాల‌కు కూడా ఇలాగే ల‌బ్ధిచేకూరిందంటూ కొంద‌రు నెటిజ‌న్లు కామెంట్స్ చేస్తున్నారు.

55
టీడీపీ సోష‌ల్ మీడియాలో పోస్టులు
Image Credit : I&PR AP

టీడీపీ సోష‌ల్ మీడియాలో పోస్టులు

ఇక తెలుగు దేశం పార్టీ అధికారిక X (Twitter) ఖాతాలో ఈ సంఘటనలకు సంబంధించిన వీడియోలను పోస్టు చేస్తూ ప్రచారం ముమ్మరం చేస్తోంది. ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు పిల్లలకు తల్లికి వందనం కింద డబ్బులు వచ్చాయని తెలిపే మరో వీడియో కూడా నెట్టింట వైర‌ల్ అవుతోంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
అమరావతి
విజయవాడ
ఆంధ్ర ప్రదేశ్
తెలుగుదేశం పార్టీ
నారా చంద్రబాబు నాయుడు
నారా లోకేష్

Latest Videos
Recommended Stories
Recommended image1
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Recommended image2
ఆంధ్ర ప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ.. ఇక్కడ చదివితే లక్షల జీతంతో జాబ్ పక్కా..!
Recommended image3
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related Stories
Recommended image1
Tirumala: హైద‌రాబాద్ టూ తిరుమ‌ల ఫ్లైట్ జర్నీ.. ఒక్క రోజులో శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకొని రావొచ్చు. బెస్ట్ టూర్ ప్యాకేజీ
Recommended image2
Saving scheme: ప్ర‌తీ నెల‌ మీ జీతంలో రూ. 2 వేలు ప‌క్క‌న పెట్టండి చాలు.. రూ. 11 ల‌క్ష‌లు పొందొచ్చు.
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved