MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Districts News
  • Hyderabad
  • Tirumala: హైద‌రాబాద్ టూ తిరుమ‌ల ఫ్లైట్ జర్నీ.. ఒక్క రోజులో శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకొని రావొచ్చు. బెస్ట్ టూర్ ప్యాకేజీ

Tirumala: హైద‌రాబాద్ టూ తిరుమ‌ల ఫ్లైట్ జర్నీ.. ఒక్క రోజులో శ్రీవారి ద‌ర్శ‌నం చేసుకొని రావొచ్చు. బెస్ట్ టూర్ ప్యాకేజీ

క‌లియుగ ప్ర‌త్య‌క్షదైవం తిరుమ‌ల వెంక‌టేశ్వ‌ర స్వామిని ద‌ర్శించుకోవాల‌ని ప్ర‌తీ ఒక్క‌రూ కోరుకుంటారు. అయితే ఒక్క రోజులో ద‌ర్శ‌నం చేసుకుని తిరిగి రావ‌డం క‌ష్టం. అలాంటి వారి కోస‌మే తెలంగాణ టూరిజం ప్ర‌త్యేక టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. 

1 Min read
Author : Narender Vaitla
Published : Jun 15 2025, 11:49 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ
Image Credit : Asianet News

తెలంగాణ టూరిజం స్పెషల్ ప్యాకేజీ

తెలంగాణ రాష్ట్రంలోని తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. టూరిజం శాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజులో తిరుమల వెళ్లి, స్వామివారిని దర్శించుకుని అదే రోజు తిరిగి వచ్చే ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. సాధారణంగా రెండు రోజుల సమయం తీసుకునే ఈ యాత్రను తెలంగాణ టూరిజం ఒక్క రోజులోనే పూర్తి చేయనుంది.

25
టూర్ వివరాలు ఇలా ఉంటాయి
Image Credit : Getty

టూర్ వివరాలు ఇలా ఉంటాయి

ఈ ప్యాకేజీ ప్రకారం, ప్రయాణం ఉదయం 6.55 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ప్రారంభమవుతుంది. ప్రయాణికులు రేణిగుంటకు ఫ్లయిట్‌లో చేరి, అక్కడి నుంచి కారులో తిరుపతి హోటల్‌కు తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెషప్ అయ్యాక తిరుమలకు వెళ్లి మధ్యాహ్నం 1 గంటలోపు శ్రీవారి దర్శనాన్ని పూర్తి చేస్తారు. తిరిగి తిరుపతికి చేరుకుని హోటల్‌లో విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది.

Related Articles

Related image1
Saving scheme: ప్ర‌తీ నెల‌ మీ జీతంలో రూ. 2 వేలు ప‌క్క‌న పెట్టండి చాలు.. రూ. 11 ల‌క్ష‌లు పొందొచ్చు.
Related image2
Air India Crash: విమానం క్రాష్ అయ్యే వీడియోను ఎవ‌రు తీశారు.? పోలీసుల విచార‌ణ‌లో ఏం తేలిందంటే
35
పద్మావతి అమ్మవారి దర్శనం
Image Credit : our own

పద్మావతి అమ్మవారి దర్శనం

తిరుమల దర్శనం అనంతరం ప్రయాణికులు తిరుచానూర్‌కు వెళ్లి పద్మావతి అమ్మవారిని దర్శించుకునే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమం ముగిశాక తిరిగి రేణిగుంట విమానాశ్రయానికి తీసుకెళ్లి సాయంత్రం 6.35కు హైదరాబాదు రిటర్న్ ఫ్లైట్‌కు ఎక్కిస్తారు. రాత్రి 7.45కి హైదరాబాద్ చేరుకుంటారు.

45
ప్యాకేజీ ధరలు
Image Credit : our own

ప్యాకేజీ ధరలు

ఈ వన్ డే టూర్ ధర ఒక్కొక్కరికి రూ. 12,499గా నిర్ణయించారు. ఇందులో విమాన టికెట్, కారులో ప్రయాణం, తిరుమల, తిరుచానూర్‌లో ప్రత్యేక దర్శనాల ఏర్పాట్లు, హోటల్ ఫ్రెషప్ ఫెసిలిటీ అన్నీ ఉంటాయి. భక్తుల సమయాన్ని ఆదా చేయడంతో పాటు కంఫర్ట్‌ను కూడా అందించడమే ఈ ప్యాకేజీ ప్రత్యేకత.

55
రెండు రోజుల టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో
Image Credit : our own

రెండు రోజుల టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో

వన్ డే టూర్‌తో పాటు, రెండు రోజుల టూర్ ప్యాకేజీ కూడా అందుబాటులో ఉంది. ఈ ప్యాకేజీ ఖర్చు రూ. 15,499గా నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌ను సంద‌ర్శించండి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ప్రయాణం
ఆధ్యాత్మిక విషయాలు
హైదరాబాద్
తెలంగాణ

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ వీకెండ్ హైదరబాదీలకు కష్టాలు తప్పవు... బయటకు వెళ్లారో బుక్ అయినట్లే..!
Recommended image2
Vegetables Price : ఈ వారాంతం సంతల్లో కూరగాయల ధరలివే.. పూర్తి లిస్ట్ ఇదే
Recommended image3
ఒకేచోట ప్లాట్లు, ఇళ్లు, విల్లాలు .. హైదరాబాద్ ప్రాపర్టీ షో 2026 లో మకుట డెవలపర్స్
Related Stories
Recommended image1
Saving scheme: ప్ర‌తీ నెల‌ మీ జీతంలో రూ. 2 వేలు ప‌క్క‌న పెట్టండి చాలు.. రూ. 11 ల‌క్ష‌లు పొందొచ్చు.
Recommended image2
Air India Crash: విమానం క్రాష్ అయ్యే వీడియోను ఎవ‌రు తీశారు.? పోలీసుల విచార‌ణ‌లో ఏం తేలిందంటే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved