MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త భ‌విష్య‌త్తు మార‌డం ఖాయం.. రూ. 50 వేల కోట్ల‌తో భారీ పెట్టుబ‌డి

ఆంధ్ర‌ప్ర‌దేశ్ యువ‌త భ‌విష్య‌త్తు మార‌డం ఖాయం.. రూ. 50 వేల కోట్ల‌తో భారీ పెట్టుబ‌డి

కూట‌మి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత రాష్ట్రానికి పెట్టుబ‌డులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఐటీ రంగంలో పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షిస్తోంది రాష్ట్రం. ఈ క్ర‌మంలోనే తాజాగా ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జం గూగుల్ విశాఖ‌లో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైంది.  

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 29 2025, 09:46 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
విశాఖ‌లో గూగుల్ డేటా సెంట‌ర్
Image Credit : Google Gemini AI

విశాఖ‌లో గూగుల్ డేటా సెంట‌ర్

ప్ర‌ముఖ సెర్చ్ ఇంజ‌న్ సంస్థ గూగుల్‌ ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో భారీ పెట్టుబ‌డులు పెట్టేందుకు సిద్ధ‌మైంది. సుమారు రూ. 50 వేల కోట్ల పెట్టుబడితో 1 గిగావాట్ సామర్థ్యం గల హైపర్‌స్కేల్ డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఇది ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్‌గా నిలవనుంది. అమెరికా వెలుపల గూగుల్‌ నిర్మించబోయే అతి పెద్ద కేంద్రం ఇదే కావడం విశేషం. ఇన్వెస్ట్ ఇండియా ఈ ప్రతిపాదనను “దేశానికి గేమ్‌ ఛేంజర్” అని అభివర్ణించింది.

DID YOU
KNOW
?
లాభం ఏంటంటే.?
విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుతో భారతీయ వినియోగదారుల డేటా దేశంలోనే నిల్వ అవుతుంది. దీంతో డేటా చౌర్యం లేదా విదేశాలకు డేటా లీక్ అవుతుందన్న భయం ఉండదు.
25
డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ బలోపేతం
Image Credit : Pixabay

డిజిటల్‌ ఎకోసిస్టమ్‌ బలోపేతం

ఈ డేటా సెంటర్‌ ద్వారా గూగుల్‌ క్లౌడ్‌, యూట్యూబ్‌, సెర్చ్‌, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ సేవలు మరింత శక్తివంతమవుతాయి. దేశీయ పరిశ్రమలు, స్టార్టప్‌లు, ప్రభుత్వ సేవలకు అనుగుణంగా అధునాతన AI సొల్యూషన్లు అందుబాటులోకి వస్తాయి. దీని వల్ల భారతదేశం ప్రపంచ డిజిటల్‌ మార్కెట్లో మరింత బలంగా నిలుస్తుంది.

Related Articles

Related image1
హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే మ‌రో కోకాపేట్ కానుంది.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే..
Related image2
మీ ఇంట్లో టీవీ ఉందా, అయితే మీకో గుడ్ న్యూస్‌.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం?
35
డేటా భద్రత
Image Credit : Google Gemini AI

డేటా భద్రత

విశాఖలో డేటా సెంటర్‌ ఏర్పాటుతో భారతీయ వినియోగదారుల డేటా దేశంలోనే నిల్వ అవుతుంది. దీంతో డేటా చౌర్యం లేదా విదేశాలకు డేటా లీక్ అవుతుందన్న భయం ఉండదు. అదనంగా, మూడు సబ్‌మెరైన్‌ కేబుల్స్‌ ల్యాండింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేసి అంతర్జాతీయ బ్యాండ్‌విడ్త్‌ను పెంచనున్నారు. ముంబయిలో ఇప్పటికే గూగుల్‌ సర్వర్లు ఉన్నందున, సముద్రం ద్వారా డార్క్ ఫైబర్‌ కనెక్టివిటీ తక్కువ ఖర్చుతో సాధ్యం కానుంది.

45
పెర‌గ‌నున్న ఉపాధి అవకాశాలు
Image Credit : Google Gemini AI

పెర‌గ‌నున్న ఉపాధి అవకాశాలు

ఒక్కో వ్యక్తికి ఐటీ రంగంలో ఉద్యోగం కల్పించడానికి సగటున రూ. 2 కోట్ల పెట్టుబడి అవసరమని నిపుణుల లెక్క. ఆ లెక్కన గూగుల్‌ పెట్టబోయే పెట్టుబడితో దశలవారీగా 25,000 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. పరోక్షంగా మరో 50,000 మందికి ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశం ఉంది. ఇది విశాఖలోనే కాకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఉద్యోగ మార్కెట్‌ను బలోపేతం చేస్తుంది.

55
పునరుత్పాదక విద్యుత్‌తో డేటా సెంటర్‌
Image Credit : Meta AI

పునరుత్పాదక విద్యుత్‌తో డేటా సెంటర్‌

డేటా సెంటర్‌ కూలింగ్‌, నిర్వహణ కోసం భారీ స్థాయిలో విద్యుత్ అవసరం అవుతుంది. దీని కోసం గూగుల్ రూ. 20 వేల కోట్ల పెట్టుబడితో పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయనుంది. ముఖ్యంగా సముద్రపు అలల ద్వారా చిన్న హైడ్రో ప్రాజెక్టులు నిర్మించి, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్‌ను వినియోగించనుంది. నీటి వినియోగం ఎక్కువగా ఉండటంతో గూగుల్‌ సముద్రతీర ప్రాంతాన్నే డేటా సెంటర్ ఏర్పాటుకు ఎంపిక చేసుకుంది.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
విశాఖపట్నం
ఉద్యోగాలు, కెరీర్

Latest Videos
Recommended Stories
Recommended image1
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Recommended image2
ఆంధ్ర ప్రదేశ్ లో ఏఐ యూనివర్సిటీ.. ఇక్కడ చదివితే లక్షల జీతంతో జాబ్ పక్కా..!
Recommended image3
IMD Weather Alert : అధికపీడనం ఎఫెక్ట్... ఈ తెలుగు జిల్లాలకు ఎల్లో అలర్ట్
Related Stories
Recommended image1
హైద‌రాబాద్‌లోని ఈ ప్రాంతం త్వ‌ర‌లోనే మ‌రో కోకాపేట్ కానుంది.. ఇప్పుడు పెట్టుబ‌డి పెడితే..
Recommended image2
మీ ఇంట్లో టీవీ ఉందా, అయితే మీకో గుడ్ న్యూస్‌.. కేంద్ర ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved