MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • ఏ బస్సుల్లో ఉచిత ప్ర‌యాణం పొందొచ్చు.? ఫోన్‌లో ఆధార్ చూపిస్తే స‌రిపోతుందా.?

ఏ బస్సుల్లో ఉచిత ప్ర‌యాణం పొందొచ్చు.? ఫోన్‌లో ఆధార్ చూపిస్తే స‌రిపోతుందా.?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంలో భాగంగా ఉచిత బస్సు సౌకర్యాన్ని ప్రారంభించింది. గుర్తింపు కార్డు చూపిస్తే కండక్టర్లు జీరో ఫేర్ టికెట్ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ పథకానికి సంబంధించిన కొన్ని సందేహాలు, సమాధానాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 17 2025, 12:31 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
ఎలాంటి నిబంధ‌న‌లు ఉన్నాయి.?
Image Credit : Generated by google gemini AI

ఎలాంటి నిబంధ‌న‌లు ఉన్నాయి.?

కూట‌మి ప్ర‌భుత్వం ఎన్నిక‌ల ముందు ఇచ్చిన ప్ర‌ధాన హామీల్లో ఉచిత బ‌స్సు ప్ర‌యాణం ఒక‌టి. కాస్త ఆల‌స్యంగానైనా ఆగ‌స్టు 15వ తేదీ నుంచి ఈ ప‌థ‌కాన్ని ఏపీ ప్ర‌భుత్వం అమ‌ల్లోకి తీసుకొచ్చింది. ఈ ప‌థ‌కం ఇప్ప‌టికే తెలంగాణ‌లో అమ‌ల్లో ఉన్న సంగ‌తి తెలిసిందే. దాదాపు తెలంగాణ‌లో ఎలాంటి నిబంధ‌న‌లు ఉన్నాయో, ఏపీలో కూడా అలాంటి నిబంధ‌న‌లే ఉన్నాయి. అయితే ఏపీలో కొన్ని ఘాట్ సెక్ష‌న్స్‌లో న‌డిచే బ‌స్సుల్లో ఈ ప‌థ‌కం అమ‌ల్లో లేదు. అలాగే కొన్ని ర‌కాల బ‌స్సుల్లో కూడా ఈ ప‌థ‌కం వ‌ర్తించ‌దు. అవేంటంటే..

25
ఏయే బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది.?
Image Credit : APSRTC

ఏయే బస్సుల్లో ఈ పథకం వర్తిస్తుంది.?

స్త్రీ శ‌క్తి ప‌థ‌కంలో భాగంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నివ‌సిస్తున్న మ‌హిళ‌లు ఏపీ వ్యాప్తంగా ఉచితంగా ప్ర‌యాణించ‌వ‌చ్చు. ప్ర‌ధానంగా ప‌ల్లెవెలుగులు, అల్ట్రా ప‌ల్లావెలుగులు, సిటీ ఆర్డిన‌రీ, ఎక్స్‌ప్రెస్ స‌ర్వీస్‌ల‌లో ఉచితంగా ప్ర‌యాణించే అవ‌కాశం ఉంది. కొన్ని ర‌కాల బ‌స్సుల్లో ఉచిత ప్ర‌యాణం తెలుసుకునేందుకు వీలుగా ఆర్టీసీ స్త్రీ శ‌క్తి పేరుతో ఉన్న స్టిక్క‌ర్ల‌ను అతికిస్తోంది. దీంతో ఉచిత ప‌థ‌కం అందుబాటులో ఉన్న బ‌స్సులను సుల‌భంగా గుర్తించే ఏర్పాట్లు చేశారు.

Related Articles

Related image1
ఒక్క రోజు ఓపిక పడితే చాలు.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు. శని-సూర్య సంచారంతో
Related image2
తిరుమలకు ఉచిత బస్సు వర్తిస్తుందా.? క్లారిటీ ఇచ్చిన అధికారులు
35
ఏ బ‌స్సుల్లో ప‌థ‌కం వ‌ర్తించ‌దంటే.?
Image Credit : APSRTC

ఏ బ‌స్సుల్లో ప‌థ‌కం వ‌ర్తించ‌దంటే.?

* నాన్‌స్టాప్ స‌ర్వీసులు

* అంత‌రాష్ట్ర సర్వీసులు

* కాంట్రాక్ట్ బ‌స్సులు

* ప్యాకేజీ టూర్స్

* స‌ప్త‌గిరి ఎక్స్‌ప్రెస్‌

* అల్ట్రా డీల‌క్స్‌

* సూప‌ర్ డీల‌క్స్‌

* ఏసీ బస్సులు

* స్టార్ లైన‌ర్ వంటి బ‌స్సుల్లో ఉచితం ప్ర‌యాణం వ‌ర్తించ‌దు. వీటిలో ప్ర‌యాణిస్తే క‌చ్చితంగా టికెట్లు తీసుకోవాల్సిందే.

45
ఫోన్‌లో ఆధార్ చూపిస్తే స‌రిపోతుందా.?
Image Credit : Getty

ఫోన్‌లో ఆధార్ చూపిస్తే స‌రిపోతుందా.?

డిజిలాక‌ర్ అందుబాటులోకి వ‌చ్చిన త‌ర్వాత చాలా మంది డాక్యుమెంట్స్‌ను ఇందులోనే సేవ్ చేసుకుంటున్నారు. ఉదాహ‌ర‌ణ‌కు డ్రైవింగ్ లైసెన్స్‌, ఆర్‌సీ వంటి వాటిని ఫోన్‌లోనే చూపిస్తున్నారు. దీంతో బ‌స్సులో కూడా కండ‌క్ట‌ర్‌కు ఫోన్‌లోనే ఆధార్ చూపిస్తే స‌రిపోతుంద‌ని కొంద‌రు భావిస్తున్నారు. కానీ దీనిని అధికారులు అంగీక‌రించ‌డం లేదు. తెలంగాణ‌లో కూడా ఈ విధానం లేదు. కచ్చితంగా మ‌హిళా ప్ర‌యాణికులు త‌మ ఒరిజిన‌ల్ ఆధార్ కార్డ్ హార్డ్ కాపీని వెంట పెట్టుకొని వెళ్లాల్సిందే.

55
ఆధార్ జిరాక్స్ ఉంటే స‌రిపోతుందా.?
Image Credit : Twitter

ఆధార్ జిరాక్స్ ఉంటే స‌రిపోతుందా.?

ఇక మ‌రికొంద‌రు ఆధార్ కార్డు జిరాక్స్ చూపించినా స‌రిపోతుందా.? అన్న ఆలోచ‌న‌తో ఉంటారు. అయితే దీనిని కూడా అంగీక‌రించ‌డం లేదు. క‌చ్చితంగా ఒరిజిన‌ల్ కార్డు ఉండాల్సిందే. లేక‌పోతే ఉచితంగా ప్ర‌యాణించ‌డం కుద‌ర‌దు. ఇక కొంత మంది రాష్ట్ర విభజనకు ముందు ఉన్న ఆధార్ కార్డులనే ఉపయోగిస్తున్నారు. కాబట్టి కచ్చితంగా ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకోవాలి. అందులోనూ ప్రస్తుత మీ ఫొటో ఉండేలా చూసుకోవాలి.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
అమరావతి
ఆంధ్ర ప్రదేశ్
తెలుగుదేశం పార్టీ
నారా చంద్రబాబు నాయుడు

Latest Videos
Recommended Stories
Recommended image1
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image2
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Recommended image3
టీనేజీ ప్రెగ్నెన్సీ అంటే ఏమిటి..? ఏపీలో అత్యధికం, అత్యల్పం ఎక్కడ, ఎంతో తెలుసా..?
Related Stories
Recommended image1
ఒక్క రోజు ఓపిక పడితే చాలు.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు. శని-సూర్య సంచారంతో
Recommended image2
తిరుమలకు ఉచిత బస్సు వర్తిస్తుందా.? క్లారిటీ ఇచ్చిన అధికారులు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved