MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Andhra Pradesh
  • తిరుమలకు ఉచిత బస్సు వర్తిస్తుందా.? క్లారిటీ ఇచ్చిన అధికారులు

తిరుమలకు ఉచిత బస్సు వర్తిస్తుందా.? క్లారిటీ ఇచ్చిన అధికారులు

TTD: కూట‌మి ప్ర‌భుత్వం స్త్రీశ‌క్తి పేరుతో ఉచిత బ‌స్సు ప్ర‌యాణాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మహిళలు ఫ్రీ టికెట్‌తో ప్ర‌యాణాలు కూడా ప్రారంభించారు. ఈ నేప‌థ్యంలో ఈ ప‌థ‌కం అమ‌లుకు సంబంధించి కొన్ని నిబంధ‌న‌లు తెర‌పైకి వ‌స్తున్నాయి. 

2 Min read
Author : Narender Vaitla
Published : Aug 17 2025, 09:04 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
తిరుమ‌ల‌కు ఉచిత బ‌స్సు ఉందా.?
Image Credit : APSRTC/X

తిరుమ‌ల‌కు ఉచిత బ‌స్సు ఉందా.?

ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఇటీవల ప్రారంభమైన ఉచిత బస్సు పథకం తిరుమలకు మాత్రం వర్తించదని అధికారికంగా ప్రకటించారు. తిరుపతి నుంచి కొండపైకి వెళ్లే బస్సుల్లో మహిళలకు ఫ్రీ టికెట్ స్కీమ్ అమలు చేయబోమని తిరుమల డిపో అధికారులు స్పష్టంచేశారు. అంటే కొండపైకి వెళ్లాలంటే తప్పనిసరిగా టికెట్ కొనుగోలు చేయాల్సిందే. ఈ నిర్ణయం వెనుక కొన్ని ప్రత్యేక కారణాలున్నాయని ఆర్టీసీ తెలిపింది. దీంతో తిరుమలకు వెళ్లాలనుకున్న రాష్ట్ర మహిళలకు నిరాశ తప్పలేదు.

26
తిరుమల మినహాయింపు
Image Credit : Google gemini AI

తిరుమల మినహాయింపు

ఆగస్టు 15న సీఎం చంద్రబాబు నాయుడు విజయవాడలో ఘనంగా ఉచిత బస్సు పథకాన్ని ప్రారంభించారు. మహిళలకు ప్రత్యేక టికెట్ ఇస్తూ ఈ పథకాన్ని అధికారికంగా ఆరంభించారు. అనంతరం ఆయనతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ కూడా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ స్కీమ్ అమలవుతున్నా తిరుమల మార్గం మాత్రం మిన‌హాయించ‌డం గ‌మ‌నార్హం. దీంతో కొంద‌రు భ‌క్తులు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

Related Articles

Related image1
ఒక్క రోజు ఓపిక పడితే చాలు.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు. శని-సూర్య సంచారంతో
Related image2
వర్షాలు.. అస్సలు తగ్గేదేలే. వచ్చే రెండు రోజులు ఈ ప్రాంతాల్లో కుండ‌పోతే
36
తిరుమలలో భక్తుల రద్దీ
Image Credit : AP

తిరుమలలో భక్తుల రద్దీ

ఇదిలా ఉంటే భక్తుల రద్దీ భారీగా పెరిగింది. శుక్రవారం ఒక్కరోజే 77,000 మందికి పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. హుండీ ఆదాయం రూ.3.53 కోట్లు చేరింది. ప్రస్తుతం ఆక్టోపస్ బిల్డింగ్ సర్కిల్ వరకు భక్తుల క్యూ లైన్లు సాగుతున్నాయి. టోకెన్ లేని భక్తులకు సర్వదర్శనం చేసుకోవాలంటే దాదాపు 48 గంటలు వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని టిటిడి ప్రకటించింది.

46
వసతి, దర్శనంలో ఇబ్బందులు
Image Credit : Social Media

వసతి, దర్శనంలో ఇబ్బందులు

కొండపై భక్తులకు అందుబాటులో ఉన్న 7,500 గదులు, నాలుగు పీఏసీ సెంటర్లు సరిపోకపోవడంతో వసతి కోసం భక్తులు కష్టాలు పడుతున్నారు. వరుస సెలవులు, వారాంతం కారణంగా రద్దీ మరింత పెరగవచ్చని టిటిడి అంచనా వేస్తోంది. రోజుకు గంటకు సగటున 4,500 మందికి మాత్రమే దర్శనం కల్పించగలుగుతున్న కారణంగా భక్తులు రెండు రోజులపాటు క్యూ లైన్లలో గడపాల్సి వస్తోంది.

56
సౌకర్యాలపై టిటిడి ప్రయత్నాలు
Image Credit : Social Media

సౌకర్యాలపై టిటిడి ప్రయత్నాలు

క్యూలైన్లలో ఉన్న భక్తులకు అన్న, పానీయాలు, తాగునీటి సదుపాయాలను నిరంతరం అందిస్తున్నామని టిటిడి అధికారులు చెబుతున్నారు. అయితే, వసతి సదుపాయాల కొరత, టికెట్ కౌంటర్ల వద్ద స‌రైన ఏర్పాట్లు లేక‌పోవ‌డంతో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శ్రీవాణి టికెట్ల విషయంలో సమయానికి కేటాయింపులు జరగకపోవడం గందరగోళానికి దారి తీస్తోంది.

66
భక్తులకు విజ్ఞప్తి
Image Credit : TTD website

భక్తులకు విజ్ఞప్తి

తిరుమలలో పరిస్థితి తీవ్రంగా ఉండటంతో దర్శనానికి వచ్చిన భక్తులు సహనం పాటించాలని టిటిడి విజ్ఞప్తి చేస్తోంది. ఆలయ ముందు మాడవీధుల వరకు భక్తులు నిలిచి ఉండటంతో రద్దీ తగ్గే సూచనలు కనిపించడం లేదు. వర్షం కారణంగా ఇబ్బందులు మరింత పెరిగినా, టిటిడి తరఫున అవసరమైన సౌకర్యాలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు.

About the Author

NV
Narender Vaitla
Narender Vaitla has over eight years of experience in print and digital media. He is currently working as a Senior Sub Editor at Asianet News.He began his journalism career in 2015 with the Sakshi newspaper. Later, in 2019, he worked as a Sub Editor in the digital division of Eenadu, and in 2020, he joined TV9 Telugu (Digital) as a Senior Sub Editor.He regularly writes news stories across sections such as lifestyle, technology, human interest, and related beats.
ఆంధ్ర ప్రదేశ్
తిరుపతి
నారా చంద్రబాబు నాయుడు
తెలుగుదేశం పార్టీ

Latest Videos
Recommended Stories
Recommended image1
Weather Update : ఇవేం ఎండల్రా నాయనా..! ఇప్పుడే తెలంగాణలో 34, ఏపీలో 35 డీగ్రీల టెంపరేచర్
Recommended image2
Holidays : తెలుగు ప్రేమికులకు పండగే.. లవర్స్ డే కు వరుసగా మూడ్రోజుల సెలవులు
Recommended image3
Weather Update : ఇది చలికాలమా లేక వేసవి కాలమా..? తెలుగు రాష్ట్రాల్లో వెదర్ తేడాగా ఉందే..!
Related Stories
Recommended image1
ఒక్క రోజు ఓపిక పడితే చాలు.. ఈ రాశుల వారికి ఊహించని లాభాలు. శని-సూర్య సంచారంతో
Recommended image2
వర్షాలు.. అస్సలు తగ్గేదేలే. వచ్చే రెండు రోజులు ఈ ప్రాంతాల్లో కుండ‌పోతే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved