AP EAPCET 2025 results: ఏపీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు విడుదల.. ఇక్కడ తెలుసుకోండి
AP EAPCET 2025 results: ఏపీ ఈఏపీసెట్ (AP EAMCET 2025) ఫలితాల్లో ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 1.89 లక్షల మంది, అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్‌లో 67,761 మంది అర్హత సాధించారు.

ఏపీ ఈఏపీసెట్ 2025 ఫలితాలు ఇక్కడ తెలుసుకోండి
AP EAPCET 2025 results: ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAMCET/EAPCET) 2025 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యామండలి (APSCHE) ఆదివారం విడుదల చేసింది.
ఫలితాలను సెట్ కన్వీనర్ వీవీ సుబ్బారావు ప్రకటించారు. జేఎన్టీయూకే బీసీ కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సెట్ చైర్మన్, జేఎన్టీయూకే వైస్ ఛాన్సలర్ సీఎస్ఆర్కే ప్రసాద్ లు పాల్గొన్నారు.
ఈసారి మొత్తం 3,62,429 మంది విద్యార్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, అందులో 3,40,300 మంది హాజరయ్యారు. మొత్తం 2,57,509 మంది అర్హత సాధించగా, మొత్తం ఉత్తీర్ణత శాతం 75.67% గా ఉంది.
AP EAPCET 2025 results: ఇంజనీరింగ్ స్ట్రీమ్ వివరాలు
• హాజరైన విద్యార్థులు: 2,64,840
• అర్హత సాధించినవారు: 1,89,748
• ఉత్తీర్ణత శాతం: 71.65%
AP EAPCET 2025 results: అగ్రికల్చర్, ఫార్మసీ స్ట్రీమ్ వివరాలు
• హాజరైన విద్యార్థులు: 75,460
• అర్హత సాధించినవారు: 67,761
• ఉత్తీర్ణత శాతం: 89.80%
విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ cets.apsche.ap.gov.in/EAPCET ద్వారా తమ స్కోర్‌కార్డు, ర్యాంక్ కార్డు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
AP EAPCET 2025 results: ఏపీ ఈఏపీసెట్ 2025 ర్యాంకింగ్ విధానం
ర్యాంక్ లిస్టు 75:25 నిష్పత్తిపై ఆధారపడి తయారుచేశారు.
• 75%: EAMCET స్కోరు
• 25%: ఇంటర్మీడియట్ (క్లాస్ 12) మార్కులు
అర్హత సాధించడానికి అభ్యర్థులు కనీసం 25% మార్కులు (160లో 40 మార్కులు) పొందాలి.
AP EAPCET 2025: కౌన్సెలింగ్ ప్రక్రియ
ఏపీ ఈఏపీసెట్ 2025 ఫలితాల తరువాత APSCHE 322 సంస్థల్లో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహించనుంది. ఇందులో ప్రతి కాలేజ్‌కు సంబంధించిన ఓపెనింగ్, క్లోజింగ్ ర్యాంకులు త్వరలో ప్రకటించనున్నారు.
AP EAPCET 2025 కౌన్సెలింగ్ విద్యార్థులకు సూచనలు
• స్కోర్‌కార్డులోని వ్యక్తిగత వివరాలు, మార్కులు సరిచూసుకోవాలి
• కౌన్సెలింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన అధికారిక ప్రకటన కోసం వేచి ఉండాలి
• మార్కుల పత్రాలు, సర్టిఫికెట్లు, గుర్తింపు పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి
• ఏవైనా పొరపాట్లు ఉంటే హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించాలి
ఇంజనీరింగ్ పరీక్ష మే 21 నుంచి 27 వరకు, అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలు మే 19, 20 తేదీల్లో నిర్వహించారు.