- Home
- Andhra Pradesh
- Amaravati: 50 అంతస్తుల్లో అసెంబ్లీ, 42 ఫ్లోర్స్‌లో HOD టవర్స్.. అమరావతిలో అద్భుత నిర్మాణాలు
Amaravati: 50 అంతస్తుల్లో అసెంబ్లీ, 42 ఫ్లోర్స్‌లో HOD టవర్స్.. అమరావతిలో అద్భుత నిర్మాణాలు
ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచ స్థాయి రాజధానిని అందించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతోంది కూటమి ప్రభుత్వం. ఇందులో భాగంగానే అమరావతి పునఃనిర్మాణానికి శ్రీకారం చుడుతోంది. మే2వ తేదీన రాజధాని పునఃనిర్మాణ పనులకు ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా శంకుస్థాపన చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే అమరావతిలో నిర్మించనున్న పలు ఐకానిక్ భవనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రతీ నగరానికి దాని ప్రత్యేకతను చాటి చెప్పే ఒక నిర్మాణం ఉంటుంది. హైదరాబాద్‌కి చార్మినార్, కోల్‌కతాకు హౌరా బ్రిడ్జ్ ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ సిటీ ఒక గుర్తింపు ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో అలాంటి నిర్మాణాలు చేపట్టాలని ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే అసెంబ్లీని అద్భుతంగా నిర్మించాలని చూస్తోంది. లిల్లీ ఆకారంలో నిర్మించనున్న ఈ కట్టడం అమరావతికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.
అమరావతి ప్రాజెక్టు పునఃప్రారంభం:
2014లో రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు నాయుడు అమరావతని రాజధానిగా నిర్మించాలని అనుకున్నాడు. అందుకు అనుగుణంగానే పనులు ప్రారంభించారు. అయితే 2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన పనులు ఆగిపోయాయి. ఇప్పుడు మళ్లీ చంద్రబాబు అధికారంలోకి రావడంతో అమరావతి అభివృద్ధి పనులు మళ్లీ ప్రారంభం కాబోతున్నాయి. మే 2న ప్రధాని నరేంద్ర మోదీ ఈ ప్రాజెక్టును అధికారికంగా పునఃప్రారంభించనున్నారు.
అమరావతి నగర నిర్మాణ విశేషాలు:
* అమరావతి నగరం గుంటూరు జిల్లాలో కృష్ణా నదికి ఎడమ వైపు 217.23 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అభివృద్ధి చెందనుంది.
* ఈ నగరాన్ని ప్రజల రాజధానిగా పిలుస్తున్నారు.
* నగరంలో నిర్మించనున్న అసెంబ్లీ టవర్ 250 మీటర్ల ఎత్తులో లిల్లీ ఆకారంలో ఉండబోతోంది. అక్కడినుంచి అమరావతి, విజయవాడ నగరాల 360 డిగ్రీ వ్యూవ్ కనిపిస్తుంది.
* అసెంబ్లీ భవనం మూడు అంతస్తులతో ఉంటుంది. రెండో అంతస్తులో ప్రజల కోసం ఓ గ్యాలరీ ఏర్పాటవుతుంది.
ఏడాదిలో అసెంబ్లీ కేవలం 40-50 రోజులు మాత్రమే ఉంటుంది కాబట్టి. మిగతా రోజుల్లో టవర్‌ను ప్రజల సందర్శనకు అందుబాటులో ఉంచనున్నారు.
Andhra Assembly
ప్రభుత్వ విభాగాల కోసం ప్రత్యేక జోన్:
నగరాన్ని తొమ్మిది సబ్‌సిటీలుగా ప్లాన్ వేస్తున్నారు. అందులో ఒకటి ప్రభుత్వానికి ప్రత్యేకంగా ఉంటుంది. ఇందులో అసెంబ్లీ, హైకోర్టు, 50 అంతస్తుల సచివాలయం, 42 అంతస్తుల నాలుగు హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ టవర్లు ఉంటాయి. ప్రభుత్వం ఉన్న ప్రాంతాన్నే నగరానికి కేంద్రంగా చేసుకొని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఈ నిర్మాణాలు జరుగుతున్నాయి.