ప్రభాస్ నటించిన రాజా సాబ్ చిత్ర క్లైమాక్స్ గురించి ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. క్లైమాక్స్ సన్నివేశాలని భారీ విజువల్స్, సీజీ వర్క్ తో రూపొందిస్తున్నారట.
రాజా సాబ్ మూవీ
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం ‘రాజా సాబ్’ చిత్ర షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. మారుతి దర్శకత్వంలో, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమా హారర్ ఎంటర్టైనర్‌గా రూపొందుతోంది. ఈ చిత్రంలో ప్రభాస్ ఫుల్ లెంత్ ఎంటర్టైనింగ్ రోల్ లో కనిపించనున్నట్లు సమాచారం. గత కొంతకాలంగా యాక్షన్ పాత్రలే ఎక్కువగా చేసిన ప్రభాస్‌ను ఇలా పూర్తి వినోదాత్మక పాత్రలో ఫ్యాన్స్ చూడబోతున్నారు.
భారీగా సీజీ వర్క్
ఈ సినిమాలో వినోదంతో పాటు థ్రిల్లింగ్ అంశాలు కూడా ఎక్కువగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా, ఈ చిత్రానికి సంబంధించిన క్లైమాక్స్ పై భారీ అంచనాలు ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం, ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు సుమారు 30 నిమిషాల పాటు ఉంటాయట. ఇందులో భారీ స్థాయిలో సీజీ వర్క్ ఉపయోగించబడిందని తెలుస్తోంది.
హాలీవుడ్ స్థాయిలో క్లైమాక్స్
ఈ చిత్రంలో క్లైమాక్స్ సన్నివేశాలు విజువల్ వండర్ అనిపించేలా, సినిమాకే హైలైట్‌గా నిలుస్తాయనిఅంటున్నారు. హాలీవుడ్ స్థాయికి దీటుగా ఉండే విధంగా క్లైమాక్స్‌ను క్లైమాక్స్ సన్నివేశాల విజువల్స్ రూపొందించినట్లు సమాచారం. ఈ క్లైమాక్స్ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇంత వినూత్న ప్రయత్నాన్ని తెలుగు పరిశ్రమలో ఇటీవలి కాలంలో చూడటం అరుదు. ప్రభాస్ అభిమానులు ఈ చిత్రం కోసం ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్ 5న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక టీజర్ త్వరలో రిలీజ్ కానుంది. థ్రిల్లింగ్ విజువల్స్, వినోదం, హారర్ అంశాలు కలగలిపి ఉండే ఈ చిత్రం టాలీవుడ్‌లో ప్రత్యేకమైన మైలురాయిగా నిలవొచ్చని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
