పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విజయవాడలో తన పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ రామ్ కొనికికి చెందిన సెలూన్ కొనికి లాంచ్ కి హాజరయ్యారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 

పవన్ కళ్యాణ్ పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్ 

టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో రామ్ కొనికి పేరు తెలియని సెలబ్రిటీ ఉండరు. అతను ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పర్సనల్ హెయిర్ స్టైలిస్ట్. ఒక్క పవన్ కళ్యాణ్ కు మాత్రమే కాదు.. టాలీవుడ్ టాప్ స్టార్స్, ఆర్టిస్టులు 25 మందికి పైగా రామ్ కొనికి హెయిర్ స్టైలిస్ట్‌గా వర్క్ చేస్తున్నారు. అతనికి పవన్ అంటే ప్రత్యేకమైన అభిమానం. 

పవన్ చేతుల మీదుగా సెలూన్ ప్రారంభం 

సెలబ్రిటీలకు హెయిర్ స్టైలిస్ట్‌గా వ్యవహరించే రామ్ కొనికికి హైదరాబాద్, జూబ్లీ హిల్స్ ఏరియాలో 'సెలూన్ కొనికి' పేరుతో ఒక స్టూడియో ఉంది. ఇప్పుడు ఏపీలో, విజయవాడ ఎంజీ రోడ్డులో మరొక స్టూడియో ఓపెన్ చేశారు. పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ఆ స్టూడియో లాంచ్ ఆదివారం జరిగింది. హైదరాబాద్‌లో స్టూడియో లాంచ్ కూడా పవన్ చేతుల మీదుగా జరిగింది. 

సింపుల్ లుక్ అదిరింది 

అయితే సెలూన్ కొనికి లాంచ్ లో పవన్ కళ్యాణ్ అందరిని తన లుక్ తో సర్ప్రైజ్ చేశారు. పవన్ కళ్యాణ్ బ్లూ టీ షర్ట్, బ్లాక్ షార్ట్ ధరించి సెలూన్ ఓపెనింగ్ కి వచ్చారు. ఈ లుక్ లో పవన్ చాలా ఫిట్ గా, హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నారు. చాలా కాలం తర్వాత పవన్ ని స్టైలిష్ లుక్ లో చూస్తున్నామని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. 

ట్రోలర్స్ కి కౌంటర్ ?

ఇటీవల పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడం వల్ల ఫిట్ నెస్ కోల్పోయినట్లు కామెంట్స్ చేశారు. ఆ మధ్యన మహా కుంభమేళా సందర్భంగా పవన్ ఫిట్ నెస్ పై ట్రోలింగ్ కూడా జరిగింది. కానీ ఇప్పుడు పవన్ తన లేటెస్ట్ లుక్ తో ట్రోలర్స్ కి సమాధానం ఇచ్చినట్లు అయింది.