అనసూయ తాజాగా షేర్ చేసిన ఫోటోస్ వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోస్ లో తన బరువు గురించి అనసూయ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. 

ఫుల్ బిజీగా అనసూయ 

నటిగా, యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ గత కొన్ని వారాలుగా తన ఫ్యామిలీతో బిజీ బిజీగా గడుపుతోంది. ఇటీవల అనసూయ కొత్త ఇంటిని కొనుగోలు చేసి అందులో గృహప్రవేశం చేసిన సంగతి తెలిసిందే. 

కుటుంబ సమేతంగా అనసూయ తన భర్త పిల్లలతో కొత్త ఇంట్లోకి అడుగు పెట్టింది. కొత్త ఇంట్లో పెద్ద ఎత్తున పూజా కార్యక్రమాలు, హోమాలు నిర్వహించింది.

శ్రీలంక టూర్ లో సందడి 

ఆ తర్వాత వెంటనే అనసూయ భర్త పిల్లలతో కలిసి శ్రీలంక కు సమ్మర్ వెకేషన్ కి వెళ్ళింది. కొన్ని రోజుల పాటు అనసూయ శ్రీలంకలో వివిధ ప్రాంతాల్లో పర్యటించి ఆ దృశ్యాల్ని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. 

ఈ నేపథ్యంలో అనసూయ స్విమ్ వేర్ ధరించి స్విమ్మింగ్ పూల్ లో భర్తతో రొమాంటిక్ గా ఇచ్చిన ఫోజులు ఇంటర్ నెట్ లో తెగ వైరల్ అయ్యాయి.

కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2 

వెకేషన్ పూర్తయ్యాక తిరిగి వచ్చిన అనసూయ వర్క్ తో మళ్ళీ బిజీగా మారింది. అనసూయ ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తోంది. అదే విధంగా బుల్లితెర కార్యక్రమాల్లో కూడా పాల్గొంటోంది. 

కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2 అనే టీవీ షోలో అనసూయ జడ్జిగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ షోలో అనసూయ, శేఖర్ మాస్టర్ కలిసి జడ్జీలుగా పాల్గొంటున్నారు.

బరువు పెరగడంపై అనసూయ రియాక్షన్ 

ఈ షో కోసం అనసూయ అదిరిపోయే స్కిన్ ఫిట్ సిల్వర్ డ్రస్సులో మెరిసింది. ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఎప్పటిలాగే అనసూయ ఈ ఫోటోల్లో కూడా గ్లామరస్ గా మెరిసిపోతోంది. ఇటీవల అనసూయ కాస్త బొద్దుగా మారింది. 

తన బరువు గురించి తానే సెటైర్ వేస్తూ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఇచ్చింది. హాలిడే వల్ల బరువు పెరిగా.. పట్టించుకోకండి అని ఫన్నీగా క్యాప్షన్ ఇచ్చింది. హాలిడేలో ఫుడ్ ని బాగా ఎంజాయ్ చేసినట్లు ఎమోజీల ద్వారా చెప్పకనే చెప్పింది.

ఇమ్మాన్యుయేల్ కి అందరి ముందు ముద్దిచ్చిన టీవీ నటి

కిరాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్ 2 షో లేటెస్ట్ ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో వైరల్ గా మారింది. ఈ ప్రోమో లో బుల్లితెర కమెడియన్ ఇమ్మాన్యుయేల్ తో టీవీ నటి దేబ్జానీ రొమాన్స్ చేస్తూ ముద్దిచ్చింది. దీనితో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు.

దీనికి అనసూయ, శేఖర్ మాస్టర్ ఇచ్చిన రియాక్షన్ నవ్వులు పూయించే విధంగా ఉంది. ముద్దు పెట్టడం మేము చూడలేదు.. ఇంకోసారి పెట్టమంటూ అనసూయ ఎంకరేజ్ చేయడం వైరల్ గా మారింది.