బాలయ్య, గోపీచంద్ రెండవ కాంబినేషన్ లో NBK111 చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన “వీర సింహా రెడ్డి” అనే యాక్షన్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది.
రెండోసారి బాలయ్య, గోపీచంద్ కాంబినేషన్
మాస్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ రెండవసారి నటించబోతున్నారు. జూన్ 10న బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా ముందుగానే అధికారికంగా ప్రకటించారు. బాలయ్య, గోపీచంద్ రెండవ కాంబినేషన్ లో NBK111 చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన “వీర సింహా రెడ్డి” అనే యాక్షన్ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ చిత్రం విజయం తర్వాత మలినేని బాలీవుడ్‌లోకి అడుగుపెట్టి, సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో “జాట్” అనే సినిమాను తెరకెక్కించారు. అయితే ఆ చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించింది. ఇప్పుడు మళ్లీ మలినేని టాలీవుడ్‌లోకి తిరిగివచ్చి, బాలకృష్ణతో సరికొత్త చిత్రం రూపొందించేందుకు సిద్ధం అయ్యారు.
“#NBK111” అనే వర్కింగ్ టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వేంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఆయన ప్రస్తుతం రామ్ చరణ్ నటిస్తున్న “పెద్ది” అనే భారీ చిత్రాన్ని కూడా నిర్మిస్తున్నారు.
చారిత్రాత్మక నేపథ్యంలో కథ ?
ఈ రోజు విడుదలైన ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ పోస్టర్‌లో ఒక గర్జిస్తున్న సింహం పోస్టర్ చూపించారు. ఆ సింహం ముఖానికి యుద్ధాలలో ఉపయోగించే షీల్డ్ ఉంచారు. పూర్వం రాజులు యుద్ధాలలో ఉపయోగించే షీల్డ్ లా అది కనిపిస్తోంది. గోపిచంద్ మలినేని కూడా ఈ చిత్ర అనౌన్స్ మెంట్ పోస్ట్ లో ఇది హిస్టారికల్ మూవీ అనే హింట్ ఇచ్చారు. అంటే ఈసారి బాలయ్య, గోపిచంద్ కాంబోలో వచ్చే చిత్రం రెగ్యులర్ మాస్ యాక్షన్ మూవీ కాకుండా చారిత్రాత్మక నేపథ్యంలో పీరియడ్ డ్రామాగా ఉండబోతోందా అనే సందేహాలు మొదలయ్యాయి.
ఇదే కనుక నిజమైతే ఈ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోవడం ఖాయం. ఎందుకంటే హిస్టారికల్ బ్యాక్ డ్రాప్ లో గోపీచంద్ ఇంతవరకు మూవీ చేయలేదు. అదే జరిగితే గోపీచంద్ కి ఈ ప్రాజెక్ట్ ఒక సాహసమే అవుతుంది. త్వరలో ఈ చిత్ర కథకి సంబంధించిన క్లారిటీ రానుంది.
