World Test Championship 2025-27: ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 సీజన్ ప్రారంభం అయింది. ఈ సీజన్ లో భాగం అయిన టీమ్‌ల మ్యాచ్‌ల వివరాలు, తేదీలు, వేదికలు, ఫైనల్ వివరాలు వెల్లడయ్యాయి.
World Test Championship 2025-27: లండన్ లో ఆస్ట్రేలియాను ఓడించి దక్షిణాఫ్రికా చరిత్ర సృష్టించి 2023-25 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ ను గెలుచుకుంది. దీంతో ఐసీసీ కొత్త ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సీజన్ వివరాలను ప్రకటించింది. డబ్ల్యూటీసీ 2025-27 సీజన్ ప్రారంభమైంది. జూన్ 17న శ్రీలంక జట్టు బంగ్లాదేశ్ తో మొదటి మ్యాచ్ తో కొత్త సీజన్ ప్రారంభమైంది.
ఈ సీజన్‌లో ఫైనల్ 2027 జూన్ లో జరగనుంది. ప్రస్తుతం ఫైనల్ వేదికపై అధికారిక ప్రకటన రాలేకపోయినప్పటికీ, ఇండియా ఫైనల్‌ను ఆతిథ్యం ఇవ్వాలనే ఆసక్తి ఉన్నప్పటికీ, వేదిక తిరిగి ఇండియానే అవుతుందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2025-27 ముఖ్యాంశాలు
- ఆస్ట్రేలియా ఈ సీజన్‌లో అత్యధికంగా 22 మ్యాచ్‌లు ఆడుతుంది
- శ్రీలంక అత్యల్పంగా 12 మ్యాచ్‌లు ఆడనుంది
- 2027 జూన్ లో ఫైనల్ మ్యాచ్ జరగనుంది
- దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ రెండుసార్లు ఛాంపియన్లు కావడానికి అవకాశం ఉంది
- భారత్, ఇంగ్లాండ్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, వెస్టిండీస్ మొదటిసారి టైటిల్ గెలవాలని చూస్తున్నాయి
టీమ్ వారీ మ్యాచ్‌ల వివరాలు
ఆస్ట్రేలియా జట్టు 22 మ్యాచ్ లలో 11 హోమ్ మ్యాచ్ లు ఆడనుంది. ఇంగ్లాండ్ జట్టు 9, భారత్ 9, న్యూజిలాండ్ 7, సౌతాఫ్రికా 8, వెస్టిండీస్ 7, పాకిస్తాన్ 6, బంగ్లాదేశ్ 6, శ్రీలంక 6 హోమ్ మ్యాచ్ లను ఆడనున్నాయి.
టీమ్‌ల మ్యాచ్‌ల షెడ్యూల్, తేదీలు, వేదికలు
ఆస్ట్రేలియా
• జూన్ 2025: 2 టెస్టులు vs వెస్టిండీస్ (అవే)
• నవంబర్ 2025: 5 టెస్టులు vs ఇంగ్లాండ్ (హోమ్)
• సెప్టెంబర్ 2026: 3 టెస్టులు vs దక్షిణాఫ్రికా (అవే)
• డిసెంబర్ 2026: 3 టెస్టులు vs న్యూజిలాండ్ (హోమ్)
• జనవరి 2027: 5 టెస్టులు vs భారత్ (అవే)
• మార్చి 2027: 2 టెస్టులు vs బంగ్లాదేశ్ (హోమ్)
బంగ్లాదేశ్
• జూన్ 2025: 2 టెస్టులు vs శ్రీలంక (అవే)
• మార్చి 2026: 2 టెస్టులు vs పాకిస్తాన్ (హోమ్)
• అక్టోబర్ 2026: 2 టెస్టులు vs వెస్టిండీస్ (హోమ్)
• నవంబర్ 2026: 2 టెస్టులు vs దక్షిణాఫ్రికా (అవే)
• ఫిబ్రవరి 2027: 2 టెస్టులు vs ఇంగ్లాండ్ (హోమ్)
• మార్చి 2027: 2 టెస్టులు vs ఆస్ట్రేలియా (అవే)
ఇంగ్లాండ్
• జూన్ 2025: 5 టెస్టులు vs భారత్ (హోమ్)
• నవంబర్ 2025: 5 టెస్టులు vs ఆస్ట్రేలియా (అవే)
• జూన్ 2026: 3 టెస్టులు vs న్యూజిలాండ్ (హోమ్)
• ఆగస్టు 2026: 3 టెస్టులు vs పాకిస్తాన్ (హోమ్)
• డిసెంబర్ 2026: 3 టెస్టులు vs దక్షిణాఫ్రికా (అవే)
• ఫిబ్రవరి 2027: 2 టెస్టులు vs బంగ్లాదేశ్ (అవే)

భారత్
• జూన్ 2025: 5 టెస్టులు vs ఇంగ్లాండ్ (అవే)
• అక్టోబర్ 2025: 2 టెస్టులు vs వెస్టిండీస్ (హోమ్)
• నవంబర్ 2025: 2 టెస్టులు vs దక్షిణాఫ్రికా (హోమ్)
• ఆగస్టు 2026: 2 టెస్టులు vs శ్రీలంక (అవే)
• అక్టోబర్ 2026: 2 టెస్టులు vs న్యూజిలాండ్ (అవే)
• జనవరి 2027: 5 టెస్టులు vs ఆస్ట్రేలియా (హోమ్)
న్యూజిలాండ్
• నవంబర్ 2025: 2 టెస్టులు vs వెస్టిండీస్ (హోమ్)
• జూన్ 2026: 3 టెస్టులు vs ఇంగ్లాండ్ (అవే)
• అక్టోబర్ 2026: 2 టెస్టులు vs భారత్ (హోమ్)
• డిసెంబర్ 2026: 3 టెస్టులు vs ఆస్ట్రేలియా (అవే)
• జనవరి 2027: 2 టెస్టులు vs శ్రీలంక (హోమ్)
• మార్చి 2027: 2 టెస్టులు vs పాకిస్తాన్ (అవే)
పాకిస్తాన్
• అక్టోబర్ 2025: 2 టెస్టులు vs దక్షిణాఫ్రికా (హోమ్)
• మార్చి 2026: 2 టెస్టులు vs బంగ్లాదేశ్ (అవే)
• జూలై 2026: 2 టెస్టులు vs వెస్టిండీస్ (అవే)
• ఆగస్టు 2026: 3 టెస్టులు vs ఇంగ్లాండ్ (అవే)
• నవంబర్ 2026: 2 టెస్టులు vs శ్రీలంక (హోమ్)
• మార్చి 2027: 2 టెస్టులు vs న్యూజిలాండ్ (హోమ్)
దక్షిణాఫ్రికా
• అక్టోబర్ 2025: 2 టెస్టులు vs పాకిస్తాన్ (అవే)
• నవంబర్ 2025: 2 టెస్టులు vs భారత్ (అవే)
• సెప్టెంబర్ 2026: 3 టెస్టులు vs ఆస్ట్రేలియా (హోమ్)
• నవంబర్ 2026: 2 టెస్టులు vs బంగ్లాదేశ్ (హోమ్)
• డిసెంబర్ 2026: 3 టెస్టులు vs ఇంగ్లాండ్ (హోమ్)
• ఫిబ్రవరి 2027: 2 టెస్టులు vs శ్రీలంక (అవే)
శ్రీలంక
• జూన్ 2025: 2 టెస్టులు vs బంగ్లాదేశ్ (హోమ్)
• జూన్ 2026: 2 టెస్టులు vs వెస్టిండీస్ (అవే)
• ఆగస్టు 2026: 2 టెస్టులు vs భారత్ (హోమ్)
• నవంబర్ 2026: 2 టెస్టులు vs పాకిస్తాన్ (అవే)
• జనవరి 2027: 2 టెస్టులు vs న్యూజిలాండ్ (అవే)
• ఫిబ్రవరి 2027: 2 టెస్టులు vs దక్షిణాఫ్రికా (హోమ్)
వెస్టిండీస్
• జూన్ 2025: 2 టెస్టులు vs ఆస్ట్రేలియా (హోమ్)
• అక్టోబర్ 2025: 2 టెస్టులు vs భారత్ (అవే)
• నవంబర్ 2025: 2 టెస్టులు vs న్యూజిలాండ్ (అవే)
• జూన్ 2026: 2 టెస్టులు vs శ్రీలంక (హోమ్)
• జూలై 2026: 2 టెస్టులు vs పాకిస్తాన్ (హోమ్)
• అక్టోబర్ 2026: 2 టెస్టులు vs బంగ్లాదేశ్ (అవే)
2025-27 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ సీజన్ ఇప్పుడు మొదలయ్యింది. అన్ని జట్లూ తమ పూర్తి శక్తితో ఫైనల్‌కు చేరుకోవాలని వ్యూహాలు సిద్ధం చేసుకున్నాయి.
