Gold: చాలామంది బంగారంపై పెట్టుబడి పెట్టడం చాలా సేఫ్ అనుకుంటారు. కానీ లాంగ్ టర్మ్ లో లాభాలు రావాలంటే ఇంకా బెటర్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

మన దేశంలో పెళ్లి చేయాలన్నా, పెళ్లికి వెళ్లాలన్నా లేడీస్ ఫస్ట్ ఆలోచించేది బంగారు నగల గురించే. గోల్డ్ కి అంత ప్రాధాన్యం ఇస్తారు. అందుకే కొంచెం డబ్బు ఉన్నా చాలామంది బంగారం కొంటారు. అర్జెంట్ గా డబ్బు కావాలంటే బంగారు నగలు తాకట్టు పెడతారు. ఇలా అవసరాల్లో ఆదుకుంటుందనే ఎక్కువ మంది బంగారంలో ఇన్వెస్ట్ చేయడానికి ఇష్టపడతారు.

మంచి లాభాలు కావాలంటే బంగారం కన్నా షేర్ మార్కెట్ బెటర్

బంగారం మంచిదే కానీ.. షేర్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే లాంగ్ టర్మ్ లో లాభాలు బాగుంటాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ పడిపోయినా, ఇన్ఫ్లేషన్ పెరిగినా చాలా మంది బంగారంలో ఇన్వెస్ట్ చేస్తారు. మార్కెట్ పడిపోయినప్పుడు బంగారం, వెండి వాల్యూ తగ్గదు. అందుకే బంగారం కొనడం మంచిదని అనుకుంటారు. కానీ లాంగ్ టర్మ్ లో అంత లాభం ఉండదని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. 

బంగారం కొంటే వడ్డీ రాదు..

మీరు బంగారం కొంటే అది ఒక ఆస్తిగా ఉంటుంది. భవిష్యత్తులో దాని వాల్యూ పెరుగుతుంది. అది కూడా బంగారం ధర పెరిగితేనే లాభం. కాని వడ్డీ లాంటిది ఏమీ రాదు. షార్ట్ టర్మ్ లో బంగారం ధరలు ఎలా ఉంటాయో కూడా చెప్పలేం. లాంగ్ టర్మ్ లో షేర్ మార్కెట్ కన్నా తక్కువ లాభమే వస్తుందని మార్కెట్ విశ్లేషకులు సూచిస్తున్నారు.

మ్యూచువల్ ఫండ్స్ లాభాలు బాగుంటాయి

మార్కెట్ బాగున్నప్పుడు మ్యూచువల్ ఫండ్స్ బంగారం కన్నా ఎక్కువ లాభం ఇస్తాయి. లాంగ్ టర్మ్ లో ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ బాగుంటాయి. ఇన్ఫ్లేషన్ కన్నా ఎక్కువ లాభం వస్తుంది. ఎందుకంటే మ్యూచువల్ ఫండ్స్ ని స్టాక్ మార్కెట్ నిపుణులు మేనేజ్ చేస్తారు. అందువల్ల లాంగ్ టర్మ్ లో మంచి లాభాలు వస్తాయి. అందుకే బంగారం కొనడం కన్నా మ్యూచువల్ ఫండ్స్ బెటర్. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా SIP చేస్తే లాంగ్ టర్మ్ లో బంగారం కన్నా ఎక్కువ లాభం వస్తుంది. బంగారం ధర పెరిగినా, లాంగ్ టర్మ్ లో ఈక్విటీ లాభాలు ఎక్కువ.

ఈక్విటీలో ఇన్వెస్ట్ చేస్తే ఆశించిన లాభాలు

ఈక్విటీలో లార్జ్ క్యాప్ షేర్స్ వాల్యూ బాగుంది. కానీ, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ షేర్స్ వాల్యూ చాలా ఎక్కువ. అయినా మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీల లాభాలు లార్జ్ క్యాప్ కంపెనీల కన్నా ఎక్కువగా ఉంటాయని మార్కెట్ నిపుణుల అంచనా వేస్తున్నారు. షేర్ మార్కెట్ లో సెక్టార్ రొటేషన్ కంటిన్యూ అవుతుంది. అందువల్ల ఈక్విటీ ఇన్వెస్టర్స్ 3-6 నెలల పాటు లార్జ్ క్యాప్, మల్టీ క్యాప్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ ఫండ్స్ లో 6-12 నెలల పాటు ఇన్వెస్ట్ చేయాలి. ఇండియన్ ఎకానమీ గ్రోత్, క్యాపిటల్ ఎక్స్పెండిచర్, వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉండటం వల్ల ఈక్విటీ పాజిటివ్ గా ఉంది.

ఈక్విటీలో పెట్టుబడి పెంచొచ్చు

ఈక్విటీలో పెట్టుబడి పెంచుతూ ఉండటం మంచిది. మార్కెట్ పడిపోతే ఇన్వెస్ట్మెంట్ పెంచాలని మోతీలాల్ ఓస్వాల్ సూచించారు. బ్యాంక్ డిపాజిట్స్, బాండ్స్, REIT, InvIT, NCD లాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసేవారు, డెట్ పోర్ట్ ఫోలియోలో 30% యాక్టివ్ ఫండ్స్, లాంగ్ టర్మ్ గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. మల్టీ అసెట్ ఫండ్స్, ఈక్విటీ సేవింగ్స్ ఫండ్స్ కి 30-35% కేటాయించొచ్చు. ప్రైవేట్ క్రెడిట్, REIT, InvIT, హై యీల్డ్ NCD బాండ్స్ కి 30-35% కేటాయించొచ్చు. షార్ట్ టర్మ్ డబ్బు అవసరాలకు ఫ్లోటింగ్ రేట్ ఫండ్స్, ఆర్బిట్రేజ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు.

ఫైనల్ గా బంగారంపై ఇన్వెస్ట్ చేసే బదులు తెలివితేటలుగా స్టాక్ మార్కెట్ చేయడం లేదా మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుబడి పెట్టడం ఎక్కువ లాభాలనిస్తుంది. మీరు గాని పెట్టుబడి పెట్టే ఆలోచనలో ఉంటే ముందుగా మార్కెట్ విశ్లేషకులు, నిపుణుల సలహాలు తీసుకోండి.