పహల్గాం దాడిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సైన్యం మనోధైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి పిటిషన్లు వద్దని కోర్టు హెచ్చరించింది.
జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి పిటిషన్ల వల్ల సైన్యం మనోధైర్యం దెబ్బతింటుందని, ఇలాంటివి కోర్టుల పరిధిలోకి రాకూడదని కోర్టు స్పష్టం చేసింది.
పిటిషన్‌పై కోర్టు ఫైర్
జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషనర్లు మహమ్మద్ జునైద్, ఫతేష్ కుమార్ సాహు, విక్కీ కుమార్‌లను దేశ పరిస్థితి అర్థం చేసుకుని పిటిషన్ వెనక్కి తీసుకోవాలని సూచించింది. ఉగ్రవాదంపై పోరాటంలో ఐక్యంగా ఉండాలని, ఇలాంటి పిటిషన్లతో సైన్యం మనోధైర్యం దెబ్బతీయకూడదని కోర్టు పేర్కొంది.
పహల్గాం దాడిపై న్యాయ విచారణ, పర్యాటకుల భద్రతకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని పిటిషన్‌లో కోరారు. దేశ భద్రత దృష్ట్యా పిటిషన్‌ను తోసిపుచ్చడంతో పిటిషనర్లు దాన్ని వెనక్కి తీసుకున్నారు.
పిటిషనర్లపై ఆగ్రహం
పహల్గాం దాడిపై న్యాయ విచారణ కోరుతూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. "రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలంటున్నారు, కానీ వాళ్లు విచారణ నిపుణులు కాదు. తీర్పులు మాత్రమే ఇవ్వగలరు. మాకు ఆదేశాలు ఇవ్వమని అడగకండి. మీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్లండి. వెనక్కి వెళ్లిపోవడం మంచిది" అని కోర్టు వ్యాఖ్యానించింది.
