పాకిస్థాన్ పై భారత్ జరిపిన దాడులను  ఆ దేశం ధృవీకరించింది. వెంటనే దేశంలోని పలు విమానాశ్రాయాలను మూసి వేస్తూ నిర్ణయం తీసుకున్నారు.  

ఇస్లామాబాద్: ఉగ్రవాద కేంద్రాలపై భారతదేశం ప్రతీకార దాడిని పాకిస్తాన్ ధృవీకరించింది. లాహోర్, సియాల్‌కోట్ విమానాశ్రయాలు మూసివేశారు. క్షిపణి దాడి జరిగిందని పాక్ మీడియా నివేదించింది. దాడి దృశ్యాలు కూడా బయటకు వచ్చాయి.

పాక్ ఆక్రమిత కశ్మీర్‌లో తొమ్మిది ప్రదేశాలపై భారతదేశం దాడి చేసింది. ఉగ్రవాద కేంద్రాలపై భారతదేశం దాడి చేసింది. 9 పాక్ ఉగ్రవాద కేంద్రాలను ధ్వంసం చేసినట్లు సైన్యం తెలిపింది. న్యాయం అమలు చేసినట్లు సోషల్ మీడియా ద్వారా సైన్యం తెలిపింది. మరింత సమాచారం త్వరలో వెల్లడిస్తామని రక్షణ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 

ఉగ్రవాద కేంద్రాలపై మాత్రమే దాడి జరిగిందని భారత సైన్యం స్పష్టం చేసింది. పాక్ సైనిక స్థావరాలపై దాడి జరగలేదు. బహావల్‌పూర్, ముజఫరాబాద్, కోట్లీ, మురిడ్కేలలో దాడులు జరిగాయి.