New vehicle rules: రోడ్డు భద్రత విషయంలో కేంద్రప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలను నియంత్రించడానికి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రోడ్లపైకి వచ్చే వాహనాలు.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను, కేంద్రం సూచించిన విధంగా రిజిస్ట్రేషన్ మార్క్‌ను డిస్ప్లే చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది.
New vehicle rules: రోడ్డు భద్రత నిబంధనలను రోజు రోజుకీ కఠినతరం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా కాలం చెల్లిన వాహనాలను రోడ్లపైకి రాకుండా.. మరో కీలక నిర్ణయం తీసుకుంది రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ(ఎంఓఆర్‌టీహెచ్). కాలం చెల్లిన వాహనాలతో పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందనీ, అలాంటి వాహనాలను నియంత్రించడానికి.. రోడ్డుపై నడిచే అన్ని వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికేట్'ని తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది.
ఇకపై రోడ్లపైకి వచ్చే ప్రతి వాహనానికి.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాలనీ, కేంద్రం సూచించిన విధంగా రిజిస్ట్రేషన్ మార్క్‌ను డిస్ప్లే చేయాలని ఆదేశించింది. ఈ మేరకు గురువారం అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్ వాహనం నెంబరు ప్లేట్ తరహాలోనే ఉంటుంది. దీని మీద వేహికల్ ఫిట్‌నెస్ గడువు తేదీని స్పష్టంగా కనబడుతుంది. ఈ సర్టిఫికేట్ DD-MM-YY ఫార్మట్'లో ఉండాలని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కొత్త రూల్స్‌లో ముఖ్యమైన విషయాలు..
>> హెవీ గూడ్స్/ప్యాసింజర్ వాహనాలు, మీడియం గూడ్స్/ప్యాసింజర్ వాహనాలు, ఇతర తేలికపాటి మోటారు వాహనాల విషయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను.. విండ్‌స్క్రీన్ ఎడమ వైపు ఎగువ అంచున ప్రదర్శించాలని మంత్రిత్వ శాఖ తెలిపింది.
>> ఆటో-రిక్షాలు, ఇ-రిక్షాలు, ఇ-కార్ట్‌లు, క్వాడ్రిసైకిళ్ల విషయంలో కూడా.. ఫిట్‌నెస్ సర్టిఫికెట్, రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ను.. విండ్‌స్క్రీన్ ఎడమ వైపు ఎగువ అంచున ప్రదర్శించాలి.
>> అదే సమయంలో.. బైక్‌లు, స్కూటర్ల వంటివాటి విషయంలో ఫిట్‌నెస్ సర్టిఫికెట్‌ను స్పష్టంగా కనిపించే ప్రాంతంలో పెట్టాల్సి ఉంటుంది. నోటిఫికేషన్ ప్రకారం, వాహనాలు టైప్ అరియాల్ బోల్డ్ స్క్రిప్ట్'లో నీలం బ్యాక్ గ్రౌండ్ పై పసుపు రంగులో సమాచారాన్ని ప్రదర్శించాల్సి ఉంటుంది.
>> ఈ నిర్ణయంపై ప్రజాభిప్రాయ సేకరణను కూడా సేకరించాలని నిర్ణయించింది రోడ్డు రవాణా శాఖ. ఇందుకు సంబంధించి రాబోయే 30 రోజుల్లో ప్రజలు, ఇతర వాటాదారులు సూచనలు చేయలని మంత్రిత్వ శాఖ కోరింది. ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్న తర్వాత ఈ కొత్త రూల్స్ అమలు తేదీపై ప్రకటన వెలువడే అవకాశముంది.
ప్రభుత్వ గణాంకాల ప్రకారం, భారతదేశంలో 20 ఏళ్లు పైబడిన 51 లక్షల లైట్ మోటారు వాహనాలు ఉన్నాయి, అలాగే.. 34 లక్షల వాహనాలు 15 సంవత్సరాల కంటే పాతవి. 15 ఏళ్లు పైబడిన మరో 17 లక్షల మీడియం & హెవీ కమర్షియల్ వేహికల్స్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ లేకుండా ఉన్నాయి. ఈ సర్టిఫికెట్లో వాహన ఫిట్‌నెస్ తేదీని తేదీ, నెల, సంవత్సరం ఫార్మాట్లో పొందు పరచాలి.
