దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో రన్‌వే  పనుల నేపథ్యంలో సెప్టెంబర్ 15 వరకు 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు చేస్తున్నట్లు విమానాశ్రయ అధికారులు తెలిపారు.

రాష్ట్ర రాజధాని దిల్లీలోని ఇంద్రాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్‌వే ఆధునికీకరణ పనులు చేపట్టనట్లుగా, ఈ నెల 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు ప్రతిరోజూ 114 దేశీయ విమాన సర్వీసులు రద్దు కానున్నట్లు విమానాశ్రయ నిర్వాహక సంస్థ డిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ లిమిటెడ్ (DIAL) వెల్లడించింది. అదనంగా, మరో 86 ఫ్లైట్‌ల షెడ్యూల్‌ను మార్చే పనిలో అధికారులు ఉన్నారు.

రోజుకి సుమారు 1,450..

ఇందుకు సంబంధించి ఎయిర్‌లైన్లతో చర్చించిన అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు డయల్ సీఈఓ విదేహ్ కుమార్ జైపురియార్ తెలిపారు. ప్రస్తుతం దిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో నాలుగు రన్‌వేలు ఉన్నా, వాటిలో భాగంగా ఒక రన్‌వేను అప్‌గ్రేడ్ చేయాల్సి రావడంతో సర్వీసులపై ప్రభావం చూపనుంది. రోజుకి సుమారు 1,450 విమానాలు ఇక్కడకు రాకపోకలుంటాయి.

ప్రధాన ఎయిర్‌లైన్లైన ఇండిగో, ఎయిర్ ఇండియా రోజుకు వరుసగా 33, 25 ఫ్లైట్‌లు రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. ప్రయాణికులపై ప్రభావం తక్కువగా ఉండేందుకు, రద్దీ సమయాల్లో ఉపయోగించే విమానాలను సాధారణ సమయాల్లోనూ అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు.

దిల్లీ విమాన సర్వీసులపై తగ్గుదల వల్ల, ఇతర నగరాలైన ముంబయి, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, పట్నా, అహ్మదాబాద్ ఎయిర్‌పోర్ట్‌లలోనూ స్వల్ప ప్రభావం ఉంటుందని అధికారులు తెలిపారు. ఉదాహరణకు ముంబయిలో 56 నుంచి 54కి, బెంగళూరులో 38 నుంచి 36కి విమానాల సంఖ్య తగ్గనుంది.

ఈ మార్పులు రెండు నెలలపాటు కొనసాగనుండటంతో, దిల్లీకి ప్రయాణించే వారికి ముందస్తుగా షెడ్యూల్‌ పరిశీలించడం మంచిదని సూచిస్తున్నారు.