దేశానికి అధ్యక్షుడైతే ఏంటి… ఆ భార్యకు మాత్రం సాధారణ భర్తే. అందుకే అందరు ఆడవారిలా తన కోపాన్ని భర్తపై ప్రదర్శించింది. ఇలా ఓ దేశాధ్యక్షుడైన భర్తను భార్య కొడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.  

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ వియత్నాం పర్యటనకు సంబంధించిన సంచలన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. ఆయనను భార్య బ్రిగిట్టే మేక్రాన్ కొట్టినట్టు కనిపించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వీడియోా ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది… దేశాధ్యక్షుడైనా భార్య చేతిలో తన్నులు తినాల్సిందే? అంటూ ఈ వీడియోపై నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. 

ఆగ్నేయాసియా పర్యటనలో భాగంగా వియత్నాంలో పర్యటిస్తున్నారు ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్. ఈ క్రమంలోనే రాజధాని హనోయ్ విమానాశ్రయానికి మేక్రాన్ దంపతులు చేరుకున్న సమయంలో ఈ సంఘటన జరిగింది. విమానం దిగేముందు ఫ్రాన్స్ అధ్యక్షుడిని ఎవరో చెంపపై కొడుతున్నట్లుగా ఉన్న ఓ వీడియా వైరల్ గా మారింది.

మేక్రాన్‌ ను భార్య నిజంగానే కొట్టిందా?

విమానంలోంచి ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ బయటకు వస్తున్నప్పుడు ఎర్రటి దుస్తులు ధరించిన ఒక చేయి ఆయన ముఖంపై కొట్టినట్లు వీడియోలో కనిపిస్తోంది. కొద్దిసేపటి తర్వాత అదే రంగు దుస్తులు ధరించిన బ్రిగిట్టే మేక్రాన్ కనిపిస్తుంది. దీంతో ఆయన భార్యే ఆయన్ని కొట్టినట్టు నెటిజన్లు భావిస్తున్నారు.

Scroll to load tweet…

ఈ సంఘటనపై వివరణ ఇచ్చిన ఫ్రాన్స్ అధ్యక్షుడి కార్యాలయం మొదట వీడియో నిజమో కాదో తెలియదని ప్రకటించింది. అయితే తర్వాత ఇది నిజమేనని ఒప్పుకుంది. కానీ ఇది దంపతులిద్దరి మధ్య జరిగిన "సరదా గొడవ" అని ఫ్రాన్స్ అధ్యక్షుడి కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ వీడియో ఇంతలా వైరల్ కావడంవెనక రష్యా కుట్రలు దాగివున్నాయని ఫ్రాన్స్ ఆరోపిస్తోంది.